No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి..

తప్పక చదవండి
  • విద్యారంగంలోని సవాళ్ళను ఎదుర్కోవాలి..
  • సూచించిన ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి..

హైదరాబాద్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటంతో పాటు, సమకాలీన అవసరాలకు అనుగుణంగా బోధన, అభ్యాస పద్దతులను సంస్కరించుకోవటం ద్వారా విద్యారంగంలో వస్తున్న సవాళ్లను ఎదుర్కోవచ్చని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి అభిప్రాయపడ్డారు. పీజీ కోర్సుల్లో మూల్యాంకన సంస్కరణలు – నిరంతర, సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) అమలు పై ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్ ఆడిటోరియంలో క్యాంపస్ అనుబంధ, గుర్తింపు కళాశాలల అధ్యాపకుల కోసం ఏర్పాటు చేసిన కార్యశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యాబోధనలో చాట్ జీపీటీ లాంటి ఆధునిక అవకాశాలు సవాళ్లుగా మారాయని.. ఆధునికత, సాంకేతికతను అందిపుచ్చుకోవటం ద్వారా అధ్యాపకులు నిరంతరం తమను తాము సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఉన్నత విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని… బాలికల విద్య సహా గ్రాస్ ఎన్రోల్ మెంట్ లోనూ దేశ సగటును దాటి గణాంకాలను నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఏ రంగంలోనైనా ఎప్పటికప్పుడు మార్పులు అనివార్యమని.. నేటి అవసరాలకు అనుగుణంగా బోధన, అభ్యాస పద్దతులు మారాల్సిన అవసరాన్ని ఓయూ ఉపకులపతి ఆచార్య దండెబోయిన రవిందర్ యాదవ్ వివరించారు. హంటర్ కమిషన్ నుంచి కోఠారి కమిషన్ వరకు విద్యావ్యవస్థలో వచ్చిన సంస్కరణలను ప్రస్తావిస్తూనే… సంస్కరణలు అనివార్యమని స్పష్టం చేశారు. మూల్యాంకన వ్యవస్థలో మీర్పులను తీసుకురావటంలో జరిగిన ప్రయత్నాలను ఓఎస్డీ ప్రొఫెసర్ బి. రెడ్యానాయక్ తన స్వాగతోపన్యాసంలో వివరించారు. ఈ ప్రయత్నంలో సహకరించిన భాగస్వాములకు కృతజ్ఞతలు తెలిపారు.
ఉన్నత విద్యారంగంలో తీసుకురావాల్సిన మూల్యాంకన సంస్కరణలపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ ఎస్ చంద్రశేఖర్ తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధ్యాపకులకు వివరించారు. మూల్యాంకల సంస్కరణలలో మార్పులపై సమగ్ర సర్వే నిర్వహించామని… ఇందుకు సంబంధించిన అంశాలపై ఆయన వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు. తెలంగాణలో అసెస్‌మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ సిస్టమ్.. నావిగేషన్ ఛాలెంజెస్, ఎక్స్‌ప్లోరింగ్ ప్రాస్పెక్ట్స్ అనే అంశంపై ప్రొఫెసర్ చంద్రశేఖర్ మాట్లాడారు. క్వశ్చన్ బ్యాంక్ పద్ధతి నుండి అసెస్‌మెంట్ బ్యాంక్ పద్ధతికి మారాల్సిన సమయం ఆసన్నమైందని… కృత్రిమ మేధస్సు పురోగతితో ఉపాధ్యాయుని ఉద్యోగం ప్రమాదంలో ఉందనే విషయాన్ని గుర్తించాలని తెలిపారు.
ఎలాంటి పరిజ్ఞానమైనై అందరికీ అందుబాటులోకి వచ్చిందని.. అధ్యాపకులతో పోల్చితే విద్యార్థులు ఆధునికతను అందిపుచ్చుకోవటంలో ముందున్నారని గుర్తు చేశారు. గూగుల్ నుంచి చాట్ జీపీటీ వరకు ఏ విషయమైనా ఓపెన్ డొమైన్ లో ఉందన్న ప్రొఫెసర్.. సవాళ్లను స్వీకరిస్తూనే అధ్యాపకులు ఆధునికతవైపు అడుగులు వేయాలని హితవు పలికారు. ఉద్యోగ నైపుణ్యాలు, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల భవిష్యత్తు నైపుణ్యాలను అంచనా వేయడం.. వారికి ఉపాధి కల్పించడంలో సహాయం చేయడం పట్ల అధ్యాపకులు ప్రధానంగా దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, ప్రిన్సిపల్స్, డైరెక్టర్లు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు ఈ కార్యశాల జరగనుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు