No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

బీఆర్ఎస్‌ పై మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు…

తప్పక చదవండి

జనగామ : కొంత మంది డిక్లరేషన్ అంటూ నాటకాలకు తెరలేపుతున్నారు. కానీ ప్రజలు మాత్రం కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రి చేయాలని సెల్ఫ్ డిక్లరేషన్ చేశారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. పాలకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్‌తో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వికలాంగులకు 4 వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది. మేము అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నాం, ఇతరులు అబద్ధాలు చెప్పి ఓట్లు అడుగుతున్నారని స్పష్టం చేశారు. కేసీఆర్‌ మూడోసారి గెలిస్తే అభివృద్ధి కొనసాగుతుంది. ఇతరులు గెలిస్తే అభివృద్ధికి కుంటు పడుతదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటలు వస్తున్న కరెంటు.. వేరే ప్రభుత్వం వస్తే కరెంట్ వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. 75 వేల కోట్ల రైతుబంధు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని అలాగే రైతు రుణమాఫీ చేస్తున్న ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్‌ మాత్రం బీఆర్ఎస్‌దేనని తేల్చి చెప్పారు. బీజేపీ జమిలి పేరుతో ఎన్నికల డ్రామాలు ఆడుతున్నది. బీజేపీ ఎన్ని జెమిలీలు తెచ్చినా జంబ్లింగ్‌లు చేసినా బీఆర్ఎస్ విజయం మాత్రం ఖాయమన్నారు. దక్షిణభారతంపై బీజేపీ చూస్తున్న చిన్న చూపుకు తగిన రీతిలో.. ఈ ప్రాంత ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్తారన్నారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో, దేశంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. అధికారం ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి చేయకుండా, అధికారం లేని రాష్ట్రాల్లో ఎలా చేస్తారని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో పాలకుర్తి ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు