No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

గిరిజన తండాలలో అభివృద్ధి వెలుగులు పంచిన ఘనత కేసీిఆర్‌ దే

తప్పక చదవండి
  • మంత్రి సత్యవతి రాదోడ్‌
  • 10 శాతం రిజర్వేషన్‌ పెంచిన ఘనత ముఖ్యమంత్రిదే

మిర్యాలగూడ : తెలంగాణలో గిరిజనుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజక వర్గంలో మంత్రి సత్యవతి రాథోడ్‌ పర్యటించారు. దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఆమె మాట్లాడుతూ..గిరిజన అభ్యున్నతి కోసం 3,146 ఆదివాసి గూడేలు,తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కెసిఆర్‌ కే దక్కిందన్నారు. వాటిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోయేందుకు 2 వేల కోట్లతో బిటి రోడ్లుల నిర్మాణం చేపట్టారన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా జనాభా దామాషా ప్రకారం 6 శాతం వున్న గిరిజన రిజర్వేషన్‌లను 10 శాతాని పెంచింది కేసీఆర్‌ అనే గుర్తు చేశారు.ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో 700 మించి పెన్షన్‌ అమలు చేయలేనివారు..తెలంగాణలో మాత్రం 4 వేలు ఇస్తాననడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు.సీఎం కేసీఆర్‌ నాయకత్వంలొనే పేదలకు మేలు జరుగుతుందని,రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని మంత్రి అన్నారు.లిపలు అభివృద్ధి పనుల ప్రారంభంలి:- 90 లక్షల నిధులతో ఏర్పాటు కానున్న గాంధీనగర్‌ – కల్లేపల్లి బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.4.20కోట్ల నిధులతో దామరచర్ల శివారులో ఏర్పాటు చేయనున్న గిరిజన బాలుర గురుకుల పాఠశాల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆడవి దేవులపల్లి మండలంలోని ఉల్సాయిపాలెం నుండి బంగారికుంట తండాకు 6.75 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన, గాంధీనగర్‌ నుండి తాటి చెట్టు తండా వరకు 2.52 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన, బంగారిగడ్డ తండా ఉల్షాయి పాలానికి కోటి 35 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణం పనులు,1కోటి 80 లక్షలతో బంగారికుంట తండా నుండి చింతచెట్టు తండా వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు,20 లక్షల నిధులతో బంగారికుంట తండాలో ఏర్పాటు కానున్న నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు, అడవిదేవులపల్లి గ్రామం నుండి బాలంపల్లి వరకు 4.05 కోట్ల నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అడవిదేవులపల్లి మండల కేంద్రంలో జనసభ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచేందుకు సీఎం కేసీఆర్‌ సహాయ సహకారాలతో ముందుకు దూసుకుపోతున్నానని తెలిపారు. అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే తిరిగి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి పట్టం కట్టాలనిఅన్నారు.ఈ కార్యక్రమంలో ఆగ్రోస్‌ చైర్మన్‌ తిప్పన విజయసింహారెడ్డి, మిర్యాలగూడ మున్సిపల్‌ చైర్మన్‌ తిరునగర్‌ భార్గవ్‌, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు చింత రెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బైరం బుచ్చయ్య, వైస్‌ చైర్మన్‌ కుందూరు వీర కోటిరెడ్డి, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ దుర్గంపూడి నారాయణరెడ్డి, చిట్టిబాబు నాయక్‌, జడ్పీటీసీలు ఆంగోతు లలిత హాథిరం, కుర్ర లక్పతి, ఎంపీపీలు ధీరవత్‌ నందిని, బాలు నాయక్తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు