No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

ఒక్క అవకాశమివ్వండి..

తప్పక చదవండి
  • ఈ పదేళ్లలో కేసీఆర్‌ చేసిందేమి లేదు..
  • రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్‌దే
  • అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు
  • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

వనపర్తి : బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి.. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ అప్పులపాలు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వనపర్తి జిల్లాలోని విజయభేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్‌.. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని.. బీఆర్‌ఎస్‌ పాలనపై నిప్పులు చెరిగారు. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి.. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్పులపాలు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన విజయ భేరి సభలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ పాలనలో అన్నదాతలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న రేవంత్‌.. రైతన్నకు భరోసా కాంగ్రెస్సేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో హస్తం పార్టీకి సంపూర్ణ మద్దతు పలకాలని కోరారు. బీఆర్‌ఎస్‌ పాలనపై విమర్శలు గుప్పించిన రేవంత్‌… పదేళ్ల కేసీఆర్‌ పాలనలో నిధులన్నీ గజ్వేల్‌, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలకే మళ్లించారని వెనుబడిన పాలమూరును మరింత వెనకకు నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆగర్భ శ్రీమంతులుగా కల్వకుంట్ల కుటుంబ మాత్రమే బాగుపడిరదని.. యావత్తు ప్రజానికం అప్పుల ఊబిలోకి జారుకుందని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో రూ. లక్ష కోట్లు దోపిడీ చేసి.. లక్షలాది రూపాయలు సంపాదించుకొని ఈరోజు కేసీఆర్‌, కేటీఆర్‌ వారి పార్టీలో ఉన్నవాళ్ల కలలు మాత్రమే నెరవేరాయి. ఈ పది సంవత్సరాల్లో ఎవరైనా బాగుపడ్డారంటే.. ఎవరైనా ఆగర్భ శ్రీమంతుడు అయ్యారంటే.. ఎవరికైనా ఫామ్‌ హౌస్‌లు వచ్చాయంటే.. ఎవరైనా విలాసవంతమైన జీవితం గడుపుతున్నారంటే అది కేవలం కేసీఆర్‌ కుటుంబం మాత్రమేనని అన్నారు. ఇక అభివృద్ధి కోసం ఎవరి దగ్గరో చేతులు చాచడం కాదని.. మీ అభివృద్ధి.. మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉందని అది మీరు వేసే ఓటు నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. వనపర్తికి పరిశ్రమలు రావాలంటే ఇక్కడ కాంగ్రెస్‌ గెలవాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని.. కేసీఆర్‌ కుటుంబం.. పార్టీ నేతల కలలు మాత్రమే నెరవేరాయని విమర్శించారు. మంత్రి నిరంజన్‌ రెడ్డిపై రేవంత్‌ ఫైర్‌..: లక్ష కోట్ల కేసీఆర్‌ అవినీతికి కాళేశ్వరం మూడేళ్లకే ఇసుక కదిలింది.. మేడిగడ్డ కూలిందని ఎద్దేవా చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డిపై విమర్శలు గుప్పించిన రేవంత్‌ రెడ్డి.. లాల్చీ వేసుకున్న ప్రతివాడూ లాల్‌ బహదూర్‌ శాస్త్రి కాదు.. పంచె కట్టిన ప్రతివాడూ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కాదంటూ మంత్రి నిరంజన్‌ రెడ్డిపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. పంచె కట్టుకుని నిరంజన్‌ రెడ్డి తనకు తాను వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ కేబినెట్‌లో అత్యంత అవినీతిపరుడని ఆరోపించారు. గుడి, బడి అని తేడా లేకుండా కబ్జాలు చేశారని వందల ఎకరాల్లో ఫామ్‌ హౌస్‌లు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 59 ఏళ్లలోపు చనిపోయిన రైతులు 83వేలు ఉంటే.. కేంద్రం లెక్కల ప్రకారం మరో 9 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. దీంతో 91వేల రైతుల చావులకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజ్‌రెడ్డి బాధ్యత వహించాలన్నారు. రైతు ఆత్మహత్యలను ఆపేందుకే కాంగ్రెస్‌ రైతు భరోసా పథకం ప్రకటించిందని తెలిపారు. పదేళ్లు కేసీఆర్‌?కు అవకాశం ఇచ్చారని.. ఒక్క అవకాశం కాంగ్రెస్‌ పార్టీకు ఇవ్వమని అభ్యర్థించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు