Friday, September 20, 2024
spot_img

కేసీఆర్‌కు స్వతంత్రుల గండం ..

తప్పక చదవండి
  • భారీగా నామినేషన్ల ఉపసంహరణ
  • గజ్వేల్‌ బరిలో 44.. కామారెడ్డిలో 39 మంది
  • ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
  • ఫలించిన బుజ్జగింపులు.. 30 ఎన్నికలు

తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు సరిగ్గా 14 రోజుల సమయం మాత్రమే ఉంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌ 30వ తేదీన జరగనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అటు ఎన్నికల అధికారులు ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టారు. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గులాబీ బాస్‌ కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కొత్త టెన్షన్‌ నెలకొంది. గజ్వేల్‌ నియోజకవర్గంలో ఆయనకు ఇండిపెండెంట్ల నుంచి తలనొప్పి మొదలైంది. గజ్వేల్‌ లో కేసీఆర్‌ పై పోటీకి దిగి తమ సమస్యలను ప్రజల ముందుకు తేవాలనే సంకల్పంతో పలువురు ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు. అందులో 13 మంది అభ్యర్థులకు గాను 16 సెట్‌ నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. బుధవారం స్వతంత్ర అభ్యర్థులు 58 మంది నామినేషన్లను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి గజ్వేల్‌ అసెంబ్లీ స్థానానికి 44 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గజ్వేల్‌ అసెంబ్లీ స్థానానికి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తుండగా.. ఇదే స్థానానికి ఈటల రాజేందర్‌ కూడా పోటీ చేస్తున్నారు. అయితే గజ్వేల్‌ బరిలో సీఎం కేసీఆర్‌, ఈటల రాజేందర్‌ తోపాటు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. అయితే ప్రజలు ఎవర్ని గెలిపిస్తారన్నదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. గజ్వేల్తో పాటు సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న రెండో నియోజకవర్గం కామారెడ్డి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఈ నియోజకవర్గం నుంచి 39 మంది బరిలో నిలిచారు. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. నామినేషన్ల స్క్రూటినీ తర్వాత ఈ నియోజకవర్గంలో 58 మంది పోటీలో ఉండగా.. ఇవాళ 19 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. కామారెడ్డి నుంచి భారాస అభ్యర్థిగా సీఎం కేసీఆర్‌, కాంగ్రెస్‌ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, భాజపా నుంచి కె. వెంకట రమణారెడ్డి పోటీలో ఉన్నారు. సీఎం కేసీఆర్‌, రేవంత్‌ రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండటంతో.. ఈ నియోజకవర్గం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు