- వాటర్ కనెక్షన్ల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్న వాటర్ బోర్డ్ డిపార్ట్మెంట్..!
- ఆగ్రహం వ్యక్తంచేస్తున్న స్థానిక ప్రజలు
కాప్రా : చెర్లపల్లి డివిజన్లో అనుమతులు లేకుండా రోడ్డును తవ్వకాలు జరిపిన వాటర్ బోర్డ్ డిపార్ట్మెంట్ తవ్వకాలకు పర్మిషన్ లేదన్న కాప్రా సర్కిల్ ఇంజనీర్. చెర్లపల్లి డివిజన్లో వాటర్ పైప్ లైన్ వేయుటకు కాప్రా సర్కిల్ ఇంజనీరింగ్ విభాగం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉండగా అనుమతులు లేకుండా ఇష్టరాజ్యంగా తవ్వకాలు జరిపి.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి రోడ్డు వేస్తున్న అక్కడక్కడ అనుమతులు లేకుండా వాటర్ బోర్డ్ డిపార్ట్మెంట్ వాటర్ కనెక్షన్ల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అనుమతులు లేకుండా తవ్వకాలు జరపడంతో మంచిగా ఉన్నటువంటి రోడ్లు పాడవడంతో వేసిన రోడ్లన్నీ మళ్ళీ మళ్ళీ వేయవలసి వస్తుంది. అనుమతి కాపీ తెలియజెయమని కోరగా అధికారుల పేర్లు చెప్పి జెసిబి తో రోడ్డును తొవ్వడం జరిగింది. సదరు కాంట్రాక్టర్ను అనుమతులు ఉన్నాయా అని వివరణ కోరగా అనుమతులు ఇచ్చారని బుకాయించారు.
వివరణ : కాప్రా సర్కిల్ చెర్లపల్లి డివిజన్ ఇంజనీర్ స్వరూప వివరణ కోరగా అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపినందుకు నోటీసు జారీ చేయడం జరిగిందని తెలిపారు.