Friday, September 20, 2024
spot_img

పీర్జాదిగూడ ఇంజనీరింగ్‌లో ‘‘ఆ నలుగురిదే’’ పెత్తనం..

తప్పక చదవండి
  • ఈ ప్రొక్యూర్‌ మెంట్‌కు విరుద్ధంగా
    పనుల కేటాయింపు..
  • ‘‘బంధుగణం’’ గుప్పెట్లో పిర్జాదిగూడ
    కార్పొరేషన్‌…
  • కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న
    పట్టించుకుని నాధుడే లేరా..?
  • నిధుల గోల్‌ మాల్‌ పై విజిలెన్స్‌కు
    ఫిర్యాదులు..

హైదరాబాద్‌ : పిర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఆ నలుగురి చేతుల్లో బందీ అయిపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిగా 26 డివిజన్‌ కు ఏ లాంటి అభివృద్ధి పనులు చేయాలన్నా తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రొక్యూర్‌ మెంట్‌ విధానంలోనే అభివృద్ధి పనుల కేటాయింపు ఉంటుంది. కానీ పిర్జాదిగూడ ఇంజనీరింగ్‌ విభాగంలో అందుకు విరుద్ధంగా అభివృద్ధి పనుల కేటాయింపు జరుగుతుందంటే ఏ స్థాయిలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో అర్థమవుతుందని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ప్రోక్యుర్‌ మెంట్‌ ప్రక్రియ పిర్జాదిగూడ ఇంజనీరింగ్‌ విభాగంలో వర్తించదని చిన్న స్థాయి కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. పిర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఒక బలమైన ప్రజా ప్రతినిధి బంధుగణమే చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అభివృద్ధి పనులు దక్కించుకోవడంలో ‘‘ఆ నలుగురిదే’’ పై చెయ్యి :
ఇంజనీరింగ్‌ విభాగంలో వర్క్‌ ఇన్స్పెక్టర్‌ తిరుపతి చక్రం తిప్పుతూ ఆ నలుగురికే కోట్లాది అభివృద్ధి పనులు కట్టబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనుల కేటాయింపుల్లో అన్యాయం జరుగుతుందని తోటి కాంట్రాక్టర్లు ఎన్నిసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఆ బలమైన ప్రజా ప్రతినిధి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ నలుగురు కాంట్రాక్టర్లను గుప్పెట్లో పెట్టుకొని రాత్రికి రాత్రి పనులు అప్పజెప్పి ఎంబీలు సైతం సంతకాలు పెట్టిస్తున్న వైనం పిర్జాదిగూడ ఇంజనీరింగ్‌ విభాగంలో చోటు చేసుకుంటుంది.
నిధుల గోల్‌ మాల్‌ పై విజిలెన్స్‌ కు ఫిర్యాదులు :
పిర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో నిధులు గోల్‌ మాల్‌ జరిగినట్లు ఆరోపణలు రావడంతో విజిలెన్స్‌ కు ఫిర్యాదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ స్థాయిలో అవినీతి అక్రమాలు జరుగుతున్న ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత అధికారులు స్పందించి పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని చిన్న స్థాయి కాంట్రాక్టర్లు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు