Friday, September 20, 2024
spot_img

రంగు పడితే అక్రమ నిర్మాణాలు సక్రమ నిర్మాణాలు అవుతాయ?

తప్పక చదవండి
  • అక్రమ నిర్మాణాలకు కొమ్ము కాస్తున్న టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు

ఎల్బీనగర్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ నిర్మాణాలకు తావు లేకుండా పొందుపరిచిన చట్టం టి.ఎస్‌.బి.పాస్‌.. సరూర్‌ నగర్‌ సర్కిల్‌ – 5లో టి.ఎస్‌. బి.పాస్‌ చట్టానికి తూట్లు పొడుస్తు అంతులేని అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారు కొందరు.. సరూర్‌ నగర్‌ డివిజన్‌ పరిధిలో ఓ నిర్మాణ దారుడు టి.ఎస్‌.బి.పాస్‌ నుండి డొమెస్టిక్‌తో కూడిన రెండు అంత స్తుల భవనానికి అనుమతులు తీసుకొని ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి కమర్షియల్‌ భవనం నిర్మిస్తూ టూ – లేట్‌ బోర్డ్‌ను కూడా పెట్టి అదనంగా మరో అంతస్తు నిర్మి స్తున్నాడు.. ఆర్‌.కే. పురం డివిజన్‌ పరిధిలో..మరో నిర్మాణ దారు డు రెండు అంతస్తుల భవనానికి అనుమతులు తీసుకొని ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి అదనంగా మరో అంతస్తు, నిర్మి స్తున్నాడు.. ఈలాంటి అక్రమ నిర్మాణాలపై అధికారులకు ఫిర్యాదులు వస్తే వాటిని పరిశీలించే లోపే నిర్మాణాలు పూర్తి అవుతున్నాయి…మీడియాలో అక్రమ నిర్మాణాలపై కథనాలు వస్తే నోటీసులు ఇవ్వడం హడావిడి చేయడం ఇక్కడ పరిపాటిగా మారి పోయింది.. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.. ఇప్పుడు ఈ రెండు నిర్మాణాలకు రంగు పడిరది.. ఈ రెండు నిర్మాణాలు, సక్రమ నిర్మాణాల, లేక అక్రమ నిర్మాణాల, రంగు పడిరది ఇప్పుడు సక్రమ నిర్మాణాలే అంటున్న అక్రమ నిర్మాణా దారులు.. ఈలాంటి అక్రమ నిర్మాణ దారులకు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కొమ్ము కాస్తున్నారని.. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి తమ ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు నిర్మించి రంగు వేస్తే సక్రమ నిర్మాణాలు ఏలా అవుతాయని సామాజిక ఉద్యమ కారుడు వేముల కొండల్‌ గౌడ్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను ప్రశ్నిస్తున్నాడు.. మరి అధికారులు ఏవిధంగా స్పందిస్తారో మరో కథనంలో చూద్దాం …

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు