No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ లకు ఓటేస్తే మళ్లీ దొరలపాలనే

తప్పక చదవండి

మనగొంతుకను మనమే వినిపించుకుందాం.. బడా మీడియాలు మనకు సహకరించవు

  • దొరల పాలన కావాలా బీసీ ముఖ్యమంత్రి కావాలా
  • బీసీని సీఎం చేస్తానన్న బీజేపీకి ఓటేసి బీసీని సీఎం చేసుకుందాం
  • బీజేపీకి ఓటు వేయకుంటే రాజ్యాధికారం వదులుకున్నట్టే
  • బీసీ సోదరులారా ఆలోచించండి.. అవకాశం జారవిడుచుకోవద్దు
  • ఉచిత విద్య, వైద్యం దక్కాలంటే బీజేపీ ప్రభుత్వం రావాల్సిందే
  • ఎమ్మార్పిఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

హైదరాబాద్‌ : ఎన్నో సంవత్సరాలుగా రాజ్యాధికారం కోసం ఎదురుచూస్తున్న బీసీ ప్రజానీకం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ లకు ఓటేసి మళ్ళీ దొరల పాలన తెచ్చుకుందామా? బీసీని సీఎం చేస్తానన్న బీజేపీకి ఓటేసి బీసీని ముఖ్యమంత్రి చూసుకుందామావద్దా? ఆలోచించుకోవాలని ఇదే మంచి అవకాశమని,బీసీని సీఎం చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉందని, బీసీలకు అన్యాయం జరుగుతుంది. అణిచివేతకు గురి అవుతున్నారు. అంటూ మీడియా వేదికగా బీసీ నాయకులు గొంతు చించుకుంటున్నది ఒట్టిదేనా. బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకు వచ్చిన బిజెపి పట్ల బీసీల వైఖరి ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. బీసీ ని ముఖ్యమంత్రి చేస్తా అన్న బీజేపీకి బీసీ సంఘాలు, నాయకులు, బీసీ సమాజం సహకరించాలని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ లకు ఓటేస్తే మళ్లీ దొరల పాలనే వస్తుందని ఇది మనకు అవసరమా అని మందకృష్ణ మాదిగ అన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రెడ్డి, బ్రాహ్మణి, వెల్లమా, కమ్మ, వైశ్య దళిత సామాజిక వర్గాలే ముఖ్యమంత్రి పదవిని చేపట్టాయి ఇప్పటివరకు ఎప్పుడు కూడా బీసీలు ముఖ్యమంత్రి కాలేదు అంటే బీసీ వర్గాల లోపల ఐక్యత లోపమేనని పలువురు మేధావులు బహాటంగా విమర్శిస్తున్నారు.

- Advertisement -

స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నీలం సంజీవరెడ్డిని మొదలుకొని కిరణ్‌ కుమార్‌ రెడ్డి వరకు రెడ్డిల పాలన కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వెలమ దొరల పాలన కొనసాగుతుంది. బీఆర్‌ఎస్‌ కు ఓటు వేస్తే వెలమ దొరలు ఏలుతారు. కాంగ్రెస్‌ కు ఓటు వేస్తే రెడ్డిలు ఏలుతారు. మరి బీసీ ముఖ్యమంత్రి పాలించొద్దా! బీసీని సీఎం చేస్తానన్న బీజేపీకి బీసీలు మద్దతు ఎందుకు తెలుపరో వారే తేల్చుకోవాలి.

బీసీలకు ముఖ్యమంత్రి పదవి అక్కరలేదా.
బీసీ లకు రాజ్యాధికారం కావాలి. చట్టసభల్లో బీసీ ప్రాతినిధ్యం పెరగాలి అంటున్న బీసీ సంఘాలు, నాయకులు బలహీన వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ఏ రాజకీయ పార్టీ టికెట్లు కేటాయించిందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా అని అన్నారు. తెలంగాణలో మార్పు కోరుకుంటే మనం బీఆర్‌ఎస్‌ కు ఓట్లు వేస్తే మూడోసారి కేసీఆర్‌ సీఎం అవుతాడని, కాంగ్రెస్‌ కు ఓటు వేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో పాలించింది మొట్టమొదట నీలం సంజీవరెడ్డి చివరి సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి అని మళ్లీ ఇప్పుడు అధికారంలోకి వస్తే రెడ్డి సీఎం కాడా అని, అది మార్పు కోరుకున్నట్లు ఎట్లా అవుతుందని ఆయన అన్నారు. బీసీ సీఎం కావాలంటే బీజేపీకి కదా మనం ఓట్లు వేయాల్సిందని అన్నారు.

దొరలకు అధికారం కట్టబెట్టడానికేనా తెలంగాణ తెచ్చుకుంది.
తెలంగాణను తెచ్చుకున్నది కేసీఆర్‌ లేదా రెడ్డిల కోసమేనా! అందుకోసమేనా వేలాది మంది ఆత్మ బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ అసలేం జరుగుతోంది.. ఒక్కసారి ఆలోచించాలి.. బీసీ ప్రజలారా..! మీకంటే మేమే నయం మేము కచ్చితంగా దొర, రెడ్డి అధికారాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నాం.. మా మాదిగ ఉపకులాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణ చేపడతానని చెప్పడంతో మా 30 ఏళ్ల కళా సహకారం అవుతున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. అందుకే మా జాతి ప్రయోజనాలను కాపాడే వారికే మా మద్దతు తెలియజేశాం. మేమంతా నరేంద్ర మోడీ వెంటే ఉంటాం బీజేపీ పార్టీకి ఓటు వేస్తాం.

బీసీలకు రాజ్యాధికారం అనేది ప్రచారం మాత్రమేనా
బీసీల పట్ల ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేసి బీసీలకు రాజ్యాధికారం కావాలని చట్టసభల్లో మా పాత్ర స్పష్టంగా ఉండాలని ఎన్నో ఉద్యమాలు చేసి ప్రభుత్వాలను స్తంభింపజేసిన ఆర్‌ కృష్ణయ్య ఇప్పుడు ఎటు పోయాడు. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి వేసిన పదవి కోసం బీసీ లా ప్రయోజనాలను తాకట్టు పెట్టాడా అనే అనుమానం తలెత్తుతోంది. ఆయన బీసీ నాయకుడుగా ఉన్నప్పుడే బాగున్నది. ఎప్పుడైతే రాజకీయంలోకి వచ్చాడో ఆయన బీసీ ప్రజలు ఆశయాలను తుంగల తొక్కాడు. రాజకీయ ప్రయోజనాల కోసమే బీసీలను వాడుకున్నాడా అని అనిపిస్తుంది. ఆర్‌ కృష్ణయ్య రాజ్యసభ పదవికి న్యాయం చేస్తాడో.. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తాడో ఆయన్నే తేల్చుకోవాలన్నారు. మేమైతే బీసీల పక్షాన మా గొంతు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని, బీసీలు కూడా సిద్ధం కావాలన్నారు.

మనకు బడా మీడియాలు సహకరించవు మన గొంతుకను మనమే వినిపించాలి
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అధికారం దక్కాలని మనం విస్తృతంగా ప్రచారం చేయాలి, ఎందుకంటే మన గొంతుక ను బడా మీడియాలు ప్రచారం చేయవు. సోషల్‌ మీడియా ద్వారా ప్రచారాన్ని ప్రజల్లోకి మనమే తీసుకెళ్లాలని, మీడియాలో ఉన్న ప్రతి వెబ్సైట్‌ ని మనం వాడుకొని వాట్సప్‌, ఫేస్‌ బుక్‌, ఇంస్టాగ్రామ్‌, యూట్యూబ్‌, ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన కోరారు. ఎందుకంటే కొన్ని మీడియా సంస్థలు మన యొక్క అశ్విత్వాలను, అస్తిత్వాలను ప్రపంచానికి తెలియచేయవు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందొద్దని వారు మన ప్రచారాలను ప్రసారం చేయరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం అవసరమయ్యే ఏ అంశాన్ని కూడా వదలకుండా బీజేపీని గెలిపించుకొని బడుగు బలహీన వర్గాల వ్యక్తిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. ఏదేమైనాప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మనం క్షేత్రస్థాయిలో పనిచేయాలని, బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే ఎస్సీ, ఎస్టీలు బీసీలు రాజ్యాధికారం దక్కాలన్న భారతీయ జనతా పార్టీ కి ఓటు వేసి గెలిపించాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్య, వైద్యం ఉచితంగా అందాలంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి
బలహీనవర్గాల కోసం తమ మేనిఫెస్టోలో అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టిన బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మార్పీఎస్‌ స్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ గల్ఫ్‌ బాధితుల సంక్షేమం కోసం నోడల్‌ ఏజెన్సీ ఏర్పాటు, నవజాత శిష్యులకు ఫిక్స్‌ డిపాజిట్‌, ఉచిత విద్య వైద్యం, రైతు భరోసా, రైతు బీమా, పంటలకు మద్దతు ధర, రైతుకు పెట్టుబడి సాయం, డిగ్రీ విద్యార్థులకు ఉచిత లాప్టాప్‌ లు, ఇలా చెప్పుకుంటూ పోతే పేద ప్రజల కోసం ఎన్నో అద్భుతమైన పథకాలను తీసుకువచ్చిన భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని దానికోసం ఎస్సీ ఉపకులాలతోపాటు బీసీ వర్గాలు పార్టీకి ఓటు వేసి బీసీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దానికి అందరూ కట్టుబడాలని ఆయన పిలుపునిచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు