No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

24 గంటల కరెంట్‌ చూపిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయను..

తప్పక చదవండి
  • వచ్చే ఎన్నికల్లో 75 నుంచి 85 సీట్లలో గెలుస్తాం..
  • టిక్కెట్ల అమ్మకంపై హరీష్‌వి దిగజారుడు మాటలు..
  • కాంగ్రెస్‌ వచ్చాక సర్వీస్‌ కమిషన్‌ను పటిష్టం చేస్తాం..
  • కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వ్యాఖ్యలు..

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 24 గంటలు కరెంట్‌ ఇస్తే తాను ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారమని, 75 నుంచి 85 సీట్లలో గెలుస్తామని వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. తన నివాసంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ..తన సవాలుని ఎవరు స్వీకరిస్తారో ముందుకు రావాలన్నారు. బీఆర్‌ఎస్‌ అంటే బొందల రాష్ట్ర సమితి అన్నారు. తమ పార్టీ గురించి పక్కన పెట్టి హరీష్‌ తన పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల న్నారు. ఆరు అడుగులు పెరగడం కాదు కొంచెం బుర్ర ఉండాలని హరీష్‌రావుని ఉద్దేశించి అన్నారు. కర్ణాటకలో అమలవుతున్న స్కీమ్‌లను తనతో వస్తే తీసుకెళ్లి చూపిస్తానని కోమటిరెడ్డి తెలిపారు. స్పెషల్‌ ఫ్లైట్‌ పెట్టి మంత్రులను కర్ణాటక తీసుకెళ్తానన్నారు. సీఎం కేసీఆర్‌ వైరల్‌ ఫీవర్‌ నుంచి కోలుకోవాలి. తెలంగాణలో కరెంట్‌ సమస్య తీవ్రంగా ఉంది. విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి ఉన్నా లేనట్లే. ఆయనకు సబ్జెక్టు లేదు. సీఎం జ్వరంతో ఉంటే కేటీఆర్‌, హరీష్‌ ఎందుకు సవిరీక్ష చేయడం లేదు? కాంగ్రెస్‌ వాళ్లు రూ.10 కోట్లకు టికెట్లను అమ్ముకుంటున్నారంటూ హరీష్‌ రావు పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. టీఎస్‌పీఎస్సీ పూర్తిగా వైపల్యం చెందింది. పరీక్ష నిర్వహణ చేత కావడం లేదు. కాంగ్రెస్‌ వచ్చాక పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తాం. కాంగ్రెస్‌ 6 హావిరీలు ఇచ్చింది. అవి వంద రోజుల్లో నెరవేరుస్తాం. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మాలాంటి వాళ్లం ప్రభుత్వంలో నుంచి వెళ్ళిపోతాం అన్నారు. కేసీఆర్‌ లాగా మేం దుబారా ఖర్చులు చేయం. దళితులకు 10 లక్షలు అన్నారు. అందరికి ఇచ్చే సరికి ఎంత ట్కెం పడుతుంది? తెలంగాణలో ఉద్యోగుల జీతాలు 15వ తారీఖు ఇస్తున్నారు. జార్కండ్‌ వంటి రాష్ట్రంలో కూడా 1వ తారీఖున జీతాలు పడతాయి. ధనిక రాష్ట్రం తెలంగాణలో 16 నెలల నుంచి 1వ తారీఖు పడుతలేవు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దోచుకున్నారు. ఐటీ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండి ఉంటే ఇంకా ఎక్కువ కంపెనీలు వచ్చేవి. వీళ్ళ లాలూచి వల్ల కొన్ని వెనక్కి పోతున్నాయి. కాంగ్రెస్‌ హయాంలో వచ్చిన ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌, సెజ్‌ల వల్లే హైదరాబాద్‌ అభివృద్ధి జరుగుతోంది. కేసీఆర్‌ ఇంకా కొత్తగా ఎన్ని స్కీమ్‌ లు వదిలినా ప్రజలు నమ్మరు. దళితుల భూములు లాక్కున్న ఘనత కేసీఆర్‌దే‘ అని కోమటిరెడ్డి అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌పై మాట్లాడేందుకు ఆయన పెద్దగా ఎక్కువ ఆసక్తి చూపలేదు. బాబు కేసుల కథనాలు వస్తుంటే టీవీ ఆఫ్‌ చేస్తున్నానని, ఆయనకు సంబంధించిన వార్తలు న్యూస్‌ పేపర్లలో చదవడమే మానేశానని అన్నారు. బాబు అరెస్ట్‌ గురించి ఇప్పుడు మాట్లాడనని, అయినా ఆంధ్రా గురించి మాకెందుకు? అని ప్రశ్నించారు. మా దృష్టి అంతా కేసీఆర్‌ను గద్దె దించడంపైనే ఉంద న్నారు. చంద్రబాబు అరెస్ట్‌ గురించి తాను పట్టించుకోవడం లేదని, మా బాధలు మాకున్నాయని తెలిపారు. కేసీఆర్‌ను ఎలా గద్దె దించాలనే దానిపైనే తాము ప్రయత్నాలు చేస్తున్నామని, ఏపీ రాజకీయాలతో తమకు సంబంధం లేదన్నారు. అక్కడ ఏం జరిగినా మాకు అనవసరమని పేర్కొన్నారు. తమ దృష్టంతా కేసీఆర్‌ను ఓడిరచాలనే విషయంపైనే కేంద్రీకృతమై ఉందని చెప్పారు. ఈ సందర్బంగా బీఆర్‌ఎస్‌ సర్కార్‌కు కోమట రిెడ్డి ఛాలెంజ్‌ విసిరారు. రైతులకు 24 గంటలు కరెంట్‌ ఇస్తే తాను ఎమ్మెల్యే బరిలో ఉండనని, పోటీ నుంచి తప్పుకుంటానంటూ సవాల్‌ చేశారు. తన సవాల్‌ స్వీకరించేందుకు బీఆర్‌ఎస్‌ నుంచి ఎవరు ముందుగా వచ్చినా సిద్దమేనని అన్నారు. దళితబంధు, బీసీ బంధు కోసం విరీ పార్టీ నేతలు ఎంత కవిరీషన్లు తీసుకున్నారనేది ప్రజలందరికీ తెలుసన్నారు. హరీష్‌ రావు ఆరడుగుల హైట్‌ ఉంటే సరిపోదని, ముందు విరీ పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని సూచించారు. హరీష్‌ రావుకు దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని, 24 గంటల కరెంట్‌ రైతులకు ఇస్తున్నట్లు నిరూపిస్తే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానన్నారు. నిరూపించకపోతే హరీష్‌ రావు రాజీనామా చేస్తారా? అంటూ మండిపడ్డారు. విద్యుత్‌ శాఖ మంత్రిగా జగదీష్‌ రెడ్డి ఉన్నా లేనట్లేనని, విద్యుత్‌ సమస్యలపై మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ సమీక్ష చేయాలని సూచించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు