Friday, September 20, 2024
spot_img

ఇంటికో ఉద్యోగం రాలేదు కానీ గల్లీకో బెల్ట్‌ షాప్‌…

తప్పక చదవండి
  • ప్రజలను కలవని ఫామ్‌ హౌస్‌ ముఖ్యమంత్రి మనకు అవసరమా?
  • మద్యం అమ్మకాల్లో భారతదేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌ రాష్ట్రం
  • రైతుబంధు మన మొఖాన కొట్టి అన్ని బందు పెట్టిండు
  • నేను పార్టీ నుండి బయటకు వచ్చినప్పుడు నా వెంట నడిచిన వ్యక్తి బాబన్న
  • బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలపై విరుచుకుపడిన బీజేపీ నాయకులు ఈటల రాజేందర్‌
  • షాద్‌ నగర్‌ పట్టణంలో బీజేపీి పార్టీ భారీ బహిరంగ సభ

షాద్‌ నగర్‌ : షాద్‌ నగర్‌ పట్టణంలో నిర్వహించిన బిజెపి బహిరంగ సభకు పార్టీ శ్రేణుల్లో ఫుల్‌ జోష్‌ నింపింది పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలతో సభా ప్రాంగణం కిక్కిరిసి పోయింది సభకు వచ్చిన నేతలకు బిజెపి శ్రేణులకు ఉత్సాహం నింపింది బిజెపి రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ముదిరాజ్‌ ప్రసంగం ఉద్వేగ భరితంగా సాగడంతో బిజెపి శ్రేణుల్లో జోష్‌ నిండిపోయింది ముందుగా షాద్‌ నగర్‌ కు వచ్చిన ఈటల రాజేందర్‌ కి ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బహిరంగ సభలో ముందుగా బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి అందే బాబయ్య మాట్లాడుతూ ఒక బీసీ బిడ్డను నేను టికెట్‌ కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ఎన్నికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఎవరికి టికెట్‌ ఇచ్చినా కలిసి పనిచేయడానికి సిద్ధం అన్న వ్యక్తి ఈరోజు వేరే పార్టీ గుర్తుతో పోటీ చేస్తూ బిజెపి పార్టీపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు సమయాబావం తక్కువ ఉండటం వలన ఎక్కువసేపు మాట్లాడలేకపోయారు అందె బాబయ్య ఆ తర్వాత సభను ఉద్దేశించి ఈటెల రాజేందర్‌ మాట్లాడుతూ అన్ని పార్టీలు ఎన్నికల ముందు వచ్చి ఎన్నో మాట్లాడి పోతుంటారు కానీ అంతిమ నిర్ణయం మాత్రం మా అక్క చెల్లెల చేతిలో ఉందని అన్నారు తెలంగాణ ఉద్యమంలో అనేకసార్లు కేసులు పెట్టి జైలుకు పంపిన నన్ను మహబూబ్నగర్‌ జైలు లో కూడా కొన్ని రోజులు ఉండాల్సి వచ్చిందని అన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ఆర్థిక శాఖ మంత్రి ని నేను నన్ను పార్టీ నుండి బహిష్కరించినప్పుడు నా వెంట నడిచిన వ్యక్తి అందె బాబయ్య ఆరోజు సీఎం కేసీఆర్‌ బాబన్నకు ఫోన్‌ చేసి ఎందుకు రాజేందర్‌ వైపు వెళ్తున్నావ్‌ నీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఆశ చూపిన కూడా ఒక బీసీ బిడ్డకు అన్యాయం జరిగిందని నా అవసరం ఇప్పుడు ఈటెల రాజేందర్‌ కు ఉందని పదవులను కూడా పక్కనపెట్టి నా వెంట నడిచాడు.ప్రజలను కలవని ప్రజల మధ్య ఉండని ఫామ్‌ హౌస్‌ ముఖ్యమంత్రి మనకు అవసరమా అని అన్నారు కళ్యాణ లక్ష్మి షాదీ, ముబారక్‌, పెన్షన్లకు కలిపి మనకిస్తున్నది 13500 వేల కోట్లు అలాగే రైతుబంధు రైతు బీమా కింద 11,500 కోట్లు మొత్తం కలిపితే 26,000 వేల కోట్లు మాత్రమే ప్రతి ఊళ్లో వైన్‌ షాపులు ప్రతి గల్లీకి బెల్ట్‌ షాపులు పెట్టించి 45 వేల కోట్ల రూపాయలు మన దగ్గర నుంచి వసూలు చేస్తున్నాడు యువతను తాగుబోతులుగా తయారు చేశాడు మద్యం అమ్మకాల్లో భారతదేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా తయారు చేశాడు తెలంగాణ వచ్చిన కొత్తలో గుడుంబా నిర్మూల చేసినప్పుడు మన ఆరోగ్యం గురించి ఇంతలా ఆలోచిస్తున్నాడు కదా అనుకున్నాం కానీ గల్లీ గల్లీకి బెల్ట్‌ షాపు పెట్టి ఆదాయాన్ని రెట్టింపు చేసుకున్నాడు ఊరిలో మెడికల్‌ షాపులు లేవు గాని గల్లీలో మద్యం షాపులు మాత్రం ఏర్పాటు అయ్యాయి విద్యను వ్యాపారం చేస్తూ ఏ కార్పొరేట్‌ స్కూల్‌ కి వెళ్ళిన 50 వేల రూపాయలకు తక్కువ కాకుండా ఫీజులు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశాడు ఇందుకేనా ఇన్ని ప్రాణలు త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకుంది తెలంగాణ వచ్చిన తర్వాత మీ ఊరిలో ఎంతమందికి ఉద్యోగం వచ్చింది అని అడిగాడు షాద్నగర్‌ నియోజకవర్గంలో ఇంత పెద్ద పారిశ్రామిక వాడ ఉంది ఎంతమంది పిల్లలు ఆ పరిశ్రమంలో పని చేస్తున్నారు ఇక్కడ పరిశ్రమలకు నీళ్లు మనం ఇయ్యాలి భూమి మన ఇవ్వాలి ఆ పరిశ్రమంలో నుంచి వచ్చే వ్యర్ధాలను మనం పిలుస్తూ రోగాల పాలవ్వాలి ఆ పరిశ్రమల్లో మన వాళ్ళు చేస్తున్న పని స్వీపర్లు అటెండర్లు మాత్రమే దళితులను మోసం చేసి అసైన్డ్‌ భూములను మూడు,నాలుగు లక్షలకు లాక్కొని కోట్ల రూపాయలకు వాళ్లు అమ్ముకుంటున్నారు దళితుల భూములను లాక్కొని దళితులను రోడ్డుపాలు చేస్తున్నారు ఒక రైతుబంధు ఇచ్చి అన్ని బందు పెట్టిండు వ్యవసాయంపై ఇచ్చే రాయితీలను ఎందుకు ఇవ్వడం లేదు కాంగ్రెస్‌ పార్టీని ఉద్దేశించి మాట్లాడుతూ బిజెపి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తానంటే కాంగ్రెస్‌ వాళ్లు అవహేళన చేస్తున్నారు కాంగ్రెస్‌ పార్టీ ఒక్కసారైనా ఒక బీసీని,ఎస్టీని ముఖ్యమంత్రిని చేశారా అని అన్నాడు మోడీ ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పే వ్యక్తి కాదు అని అన్నారు చివరగా మాట్లాడుతూ అందే బాబాయ్‌ కు ఓటు వేసి గెలిపించాలని షాద్నగర్‌ ప్రజలు ఆశీర్వదించి అందే బాబాయ్య ను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు