Saturday, September 21, 2024
spot_img

చారిత్రక నగరం కరీంనగరం : మంత్రి గంగుల

తప్పక చదవండి

కరీంనగర్‌ : చారిత్రక నగరం కరీంనగరమని ఉద్యమాలకు పెట్టింది పేరు ఈ గడ్డ అని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.స్వరాష్ట్ర సాధన కోసం సింహ గర్జనతో సమరశంఖాన్ని పూరించింది ఇక్కడి నుండే ననిటీ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కరీంనగర్‌ జిల్లాలో నిర్మించారు ఎన్నింటికో వేదికగా నిలిచిన ఘనత కరీంనగర్‌ దికెసిఆర్‌ కు ఇష్టమైన నగరం కరీంనగర్‌ అని పేర్కొన్నారు.నన్ను 3 సార్లు గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు… సియం కెసిఆర్‌ సహకారం తో కోట్లాది రూపాయల నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.10 సంవత్సరాల పాలనలో నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేశామన్నారు.40-50 సంవత్సరాల దరిద్రాన్ని తుడిచే ప్రయత్నం చేశాం. సీబీ… ఎంఆర్‌ఎఫ్‌… ఐటి టవర్‌… టిటిడి… ఇస్కాన్‌. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీతో నగరం ప్రాశ స్త్యం పెరిగిందన్నారు. సంవత్స రంలోగా ఎంఆర్‌ఎఫ్‌ ను పూర్తి చేస్తామ న్నారు.అభివృద్ధి కొనసాగాలంటే కెసిఆర్‌ ను గెలిపించాలన్నారు. కెసిఆర్‌ పాలనలో లా అండ్‌ ఆర్డర్‌ భేషుగ్గా ఉందని శాంతి భద్రతలు ఉన్న చోటే అభివృద్ధి జరుగుతుందన్నారు.కెసిఆర్‌ చేతుల్లోనే తెలంగాణ క్షేమంగా ఉంటుందని తెలిపారు.మరోసారి అవకాశం ఇచ్చారుసియం కెసిఆర్‌… మంత్రి కెటిఆర్‌ ల ఆశీర్వాదంతో 4వ సారి బరిలో దిగుతున్న నన్ను ఆశీర్వదించండి.హైదరాబాద్‌ తర్వాత గొప్పగా అభివృద్ధి చేస్తాను.10 గంటలకు ప్రజా ఆశీర్వాద సభ… ఈ సభలో మంత్రి కెటిఆర్‌ పాల్గొంటు న్నారని నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆశీర్వదించండని కోరారు .నా చేతులు బలోపేతం చేయండి… మరిన్ని నిధులు తెచ్చి అభి వృద్ధి చేస్తానని తెలిపారు.విలువైన ఓటును వృధా చేయొద్దుఅభివృద్ధికి పట్టం కట్టండి.స్వలాభం కోసం… స్వార్థం కోసం పోటీ చేసేవారిని ఆదరించొద్దు బిఆర్‌ఎస్‌ తోనే అభివృద్ధి సాధ్యం అన్నారు. 9వ తేదీన తొలి నామినేషన్‌… 10వ తేదీన 2వ నామినేషన్‌ దాఖలు చేస్తానని తెలిపారు.బొమ్మకల్‌ హనుమాన్‌ టెంపుల్‌ నుండి ప్రచారం ప్రారంభిస్తానాన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు