Sunday, October 27, 2024
spot_img

రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశాలు

తప్పక చదవండి
  • 36 ఎకరాల 24 గుంటలకు పాస్‌ బుక్‌లు ఇవ్వాలని ఆర్డర్‌
  • వాసవి ఆనంద నిలయం నిర్మాణ సంస్థ భూమిలో
    తన భూమి ఉందని ఆరోపిస్తున్న గులాం దస్తగిర్‌

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : ఎల్‌.బీ నగర్‌ లో వాసవి ఆనంద నిలయం నిర్మాణ సంస్థకు సంబందించి వారు నిర్మిస్తున్న భుముల్లో కొంత భాగం మా భూమి ఉందని, ఆ భూమికి మేమె యజమానులమంటూ గులాం దస్తగిర్‌ తండ్రి (లేట్‌) అబ్దుల్‌ మాజీద్‌ ఖాన్‌ అనే వ్యక్తి కొత్తగా తెరపైకి వచ్చారు. సర్వే నెంబర్‌ 9/1 జె లో 36 ఎకరాల 24 గుంటల భూమి ఉందని తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్‌ ను ఆశ్రయించారు.

తెలంగాణ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, రంగారెడ్డి కలెక్టర్‌, ఆర్‌ డీ ఓ లకు భూమి పై పూర్తి వివరాలు ఇవ్వాలని నోటీసులు అందించారు. కాగా, వారి వద్ద నుండి ఎలాంటి సమాధానం లేకపోవడంతో రేవెన్యూ జిపి, సంబంధిత అధికారులు స్పందించలేదని భూ యజమానులకు పాస్‌ పుస్తకాలూ జారీ చేయాలనీ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. హై కోర్ట్‌ ఆర్డర్‌ కాపీ (డబ్ల్యూపి నెంబర్‌ 11557/2022)ని జిల్లా కలెక్టర్‌ కు అప్లై చేయగా సరూర్‌ నగర్‌ తహసీల్దార్‌ కు లెటర్‌ ద్వారా (ఎల్‌.ఆర్‌ నెం. ఈ5/3294/2023, తేదీ 30/10/2023 నాడు భూమికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు