No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

హీరో విజయ్‌ ఆంటోని కూతురు ఆత్మహత్య

తప్పక చదవండి

చెన్నై : బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రముఖ దక్షిణాది నటుడు, సంగీత దర్శకుడు విజయ్‌ ఆంటోని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె విూరా ఆంటోని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు చెన్నైలోని డీడీకే రోడ్‌లోని తమ నివాసంలో ఆమె బలవన్మరణానికి పాల్పడిరది. పదహారేళ్ల విూరా ఓ ప్రైవేటు పాఠశాలలో సీనియర్‌ ఇంటర్‌ చదువుతోంది. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. చదువుల ఒత్తిడితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా, విూరా ఆత్మహత్య నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక, విజయ్‌ ఆంటోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిచ్చగాడు సినిమాతో తెలుగులో ఆయన బాగాఈ పాపులర్‌ అయ్యారు. ఆ సినిమాకు సీక్వెల్‌ బిచ్చగాడు 2 తమిళంలో కంటే తెలుగులోనే భారీగా వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు