Thursday, September 19, 2024
spot_img

దళితబంధు కోసం దరఖాస్తు పెట్టారా ఏమైనా?

తప్పక చదవండి
  • దేశంలో ఎక్కడైనా దళితబంధు ఇస్తున్నారా?
  • దళితుల సంక్షేమం కోసమే దళితబంధు
  • బిజెపి, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమం గురించి మాట్లాడే దమ్ముందా
  • ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌

ఖమ్మం : దళితబంధు పుట్టించిన మొగోడు ఎవరండి ఈ దేశంలో.. కేసీఆర్‌ అనేటోడు రాకముందు దళిత బంధు ఈ దేశంలో ఉండేనా..? అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశ్నించారు. దళితబంధు పెట్టమని ఎవరన్నా అడిగారా..? ఎవడన్న ఈ మొగోళ్లు ధర్నా చేసిండ్రా. దరఖాస్తు పెట్టిండ్రా.. మరి ఎవడు పెట్టిండు. ఎందుకు పెట్టాము. దయచేసి ఆలోచన చేయాలి అని కేసీఆర్‌ ప్రజలకు సూచించారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఊరికే అల్లాటప్పాగా ఓట్ల ముందు పెట్టలేదు అని కేసీఆర్‌ గుర్తు చేశారు. దళితబంధు పెట్టినప్పుడు ఎన్నికలు లేవు. నన్ను ఎవరూ అడగలేదు. అదో పెద్ద విషాదగాధ. మన దేశానికే మాయని మచ్చ. యావత్‌ భారత సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. 75 ఏండ్ల కింద స్వాతంత్య్రం వస్తే నాడు దళితుల పరిస్థితి బాగా లేదు. యుగయుగాలు, తరతరాల నుంచి అణిచివేతకు, విక్షకకు గురయ్యారు. ఊరి నుంచి వెలివాడల్లో ఉన్నారు. అంటరాని వారు అని నిందలకు గురయ్యారు. మహాకవి జాషువా బాధపడి గాయపడి కావ్యాలు రాశారు. దళిత జాతి ఎందుకు అలా ఉండాలి. వాళ్లు మనషులు కారా.? మనలాగా పుట్టలేదా..? సాటి మానవులు కారా.? అని కేసీఆర్‌ నిలదీశారు. ఇవాళ పెడబొబ్బలు పెట్టే మూడు రంగుల జెండాలు, ఎర్రెర్ర జెండాలు, పచ్చ పచ్చ జెండాలు.. ఏం చేశారండీ. ఒక్క సారి గుండె విూద చేయి వేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలి అని కేసీఆర్‌ సూచించారు. దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్పా వారి గురించి ఆలోచించలేదు. దళితులకు అరచేతికి బెల్లం పెడుతా.. చక్కెర, చాకెట్లు ఇస్తానని చెప్పి అప్పటికప్పుడు ఎన్నికల ముందు మురిపించారు. మోసం చేశారు. దశాబద్దాల తరబడి ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. వాళ్ల నిజమైన శ్రేయస్సు గురించి ఆలోచించలేదు. వాళ్లను మనషులుగా గుర్తించలేదు అని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇవాళ ఉత్తర భారతదేశంలో దళితుల విూద రోజు దాడులే అని కేసీఆర్‌ గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌, రాజస్థాన్‌, ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో చాలా భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. మహిళల విూద మానభంగాలు జరుగుతున్నాయి. ఏంది ఈ వివక్ష, ఏంది ఈ దురాగతం. ఇది ప్రజాస్వామ్య దేశమా..? అరాచకమా..? దీన్నంతనటిని క్రోడికరించి, ఆలోచించి, ఇవాళ ముఖ్యమంత్రి అయినా తర్వాత కాదు.. నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పిడికెడు మంది కార్యకర్తలతో దళిత చైతన్య జ్యోతి అని పెట్టుకుని కొన్ని కార్యక్రమాలు చేశాం. ఈ రోజు దళితబంధుకు కూడా అదే స్ఫూర్తి అని కేసీఆర్‌ పేర్కొన్నారు. మొదటి టర్మ్‌ తర్వాత రెండో టర్మ్‌లోకి వచ్చిన తర్వాత ఆదాయం మెరుగుపడ్డాక.. దళితబంధు అమలు చేశామని కేసీఆర్‌ తెలిపారు. విూరందరూ చూస్తున్నారు ప్రభుత్వ వైఖరి. ఎలక్షన్‌ మేనిఫెస్టోలో పెట్టని స్కీంలే చాలా ఉన్నాయి. పది రెట్లు చాలా ఎక్కువ చేశాం. ఎప్పటికప్పుడు ఏది అవసరమో పెట్టుకుంటూ ముందుకు పోయాం. పది ఓట్లు రావాలి.. ఈ ఎన్నిక గడవాలి.. ఈ పూట గడవాలి.. అనే కిరికిరి రాజకీయాలు చేయలేదు. ఎందుకంటే మేం తెలంగాణ తెచ్చినవాళ్లం. మాకు బాధ్యత ఉంది. నూటికి నూరు శాతం బాగు చేయాలని. చిల్లర రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా బ్రహ్మాండంగా బాగు చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్లాం. దళిత ఓట్ల కోసం చిల్లర రాజకీయలు చేసే వాళ్లం అయితే.. మొదటి టర్మ్‌ ఎండిరగ్‌లో, సెకండ్‌ టర్మ్‌ ప్రారంభంలో పెట్టేవాళ్లం. మురిపించేవాళ్లం అయితే సెకండ్‌ టర్మ్‌ ఆటోమేటిక్‌గా, స్వాభావికంగా గెలిచిన తర్వాత దళిత వర్గాల గురించి ఏదైనా మొదలుపెట్టాలని దళితబంధు మొదలుపెట్టామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. సత్తుపల్లి చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం అని కేసీఆర్‌ ప్రశంసించారు. ఆలోచన శక్తి ఉన్న ప్రజలు. విూతో ఒకటే మాట మనవి చేస్తున్నా.. ఎన్నికలు వస్తాయి, పోతాయి. పుయ్య మల్లయ్య గెలుస్తునే ఉంటరు. అది పెద్ద విషయం కానే కాదు. ఎవరు కాదన్నా అవున్నన్నా ఎవరో ఒకరు గెలుస్తరు. ఆలోచన చేయాలి. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులను కూడా చూడాలి. వారి చరిత్ర తెలుసుకోవాలి. వీరిని గెలిపించడం ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. వీరి వెనుకాల ఉన్న పార్టీ చరిత్ర, దృక్పథం ప్రజల గురించి ఏం ఆలోచిస్తుందో తెలుసుకోవాలి. ఎవరో చెప్పారని ఓటు వేయడం కాదు. కులం వాడు నిలబడ్డాడని ఓటు వేయకూడదు. సొంత విచక్షణతో నిజనిజాల గురించి నిలబడి ఆలోచించి ఓటు వేయరో అప్పటి వరకు ప్రజాస్వామ్య పరిణితి రాదు. అలా ఆలోచించి ఓటు వేసిన దేశాల్లో బ్రహ్మాండమైన ఫలితాలు వస్తున్నాయి. ఆ చైతన్యం మన దేశంలో కూడా రావాలి అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు