Monday, October 28, 2024
spot_img

చాందినీ చౌక్ వద్ద బంగారం దోపిడీ..

తప్పక చదవండి
  • జలంధర్ దగ్గర నిందితులను పట్టుకున్న పోలీసులు..

న్యూ ఢిల్లీ : ఢిల్లీలోని చాందీని చౌక్ వద్ద ఒక జ్యువెల్లరీ దుకాణ ఉద్యోగి వద్ద నుంచి బంగారం దోచుకెళ్లిన ఐదుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జలంధర్ ప్రాంతంలో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఒక మహిళ (42) కూడా ఉన్నారు. ఆమెతోపాటు నలుగురు వ్యక్తులు కలిసి రెండు కిలోల బరువు ఉన్న 17 బంగారం బిస్కట్లను దోచుకుని పారిపోయేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. నిందితులు ఖయాల ప్రాంత వాసులు నవన్ నీత్, మోహ్సిన్ ఖాన్ , ధీరజ్, అంకిత్ పొర్వాల్, ఠాగూర్ గార్డెన్ ఎక్స్‌టెన్షన్ వాసి సోనూ సూరి ఉన్నారు. ఈ నెల 22 మధ్యాహ్నం 2.45లకు ఉద్యోగ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద నుంచి పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఒక వ్యక్తి ఫోన్ చేసి, తాను బంగారం బిస్కట్లు ఉన్న బ్యాగ్‌ను తమ యజమానికి అప్పగించేందుకు వెళుతుండగా మార్గమధ్యంలో ఒక బైక్.. తర్వాత మరొక బైక్ అడ్డగించాయని తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కొంత సేపటి తర్వాత నిందితులు వెళ్లిన బైక్‌ల్లో ఒకటి జలంధర్‌లో దొరికింది.

తమ స్నేహితులు నవ్ నీత్‌, సోనూ సూరీలకు సదరు వ్యక్తి బంగారం బిస్కట్లు తీసుకెళ్తున్న సంగతి తెలుసునని నిందితులు చెప్పారు. ఈ బంగారం దోచుకుందామని ప్లాన్ చేశామని తెలిపారు. ఢిల్లీలో ఉంటే అరెస్ట్ చేస్తారన్న భయంతో జలంధర్ పారిపోయామని చెప్పారని డీసీపీ హరేంద్ర సింగ్ చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు