- కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీర్ల ఐలయ్య
- ప్రచారానికి మద్దతు పలికిన మోత్కుపల్లి నర్సింహులు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది.. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుంది.. ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా అని ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బొమ్మలరామారం మండలం కాజీపేట, యావాపూర్, జలాల్ పూర్, తూముకుంట, బండికడాపల్లి, రామలింగంపల్లి, రంగపురం, ప్యారారం, గజ్జరాళ్ల తాండ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. రామలింగంపల్లి గ్రామంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి ముఖ్యఅతిథిలుగా ప్రచారంలో పాల్గొని బీర్ల ఐలయ్యకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్యకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. బొమ్మాలరామరం మండలం లోని పెద్ద పర్వతపురం గ్రామ సర్పంచ్ రెడ్డబోయిన లక్ష్మీనర్సయ్య, వార్డు సభ్యురాలు యమునా, జలాల్ పూర్ మాజీ సర్పంచ్ ఎల్లయ్య, సీనియర్ లీడర్ కుర్మా బీరప్ప కాంగ్రెస్ పార్టీ లోకి చేరారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న బొమ్మాలరామరం అభివృద్ధి కాలేదని బీర్ల ఐలయ్య అన్నారు. మండలంలోని రోడ్లు నాణ్యతగా వేస్తామని అన్నారు. గ్రామాల్లో ఉన్న పాఠశాలను అభివృద్ధి చేసి ఉన్నత విద్యను అందిస్తామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం 9 సంవత్సరాలు గడిచిన ఒక రైతులుకు పూర్తిగా రుణమాఫీ చేసిన దాఖలు ఎక్కడ లేవని మండిపడ్డారు. కొత్తగా రుణాలు ఇచ్చిన సందర్భం కూడా లేదు. ఆనాడు రైతులకు సబ్సిడీ కింద ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, డ్రిప్ పైపులు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని గుర్తుచేశారు.
మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ.. కేసిఆర్ పథకాల పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి… అధికారం ఇవ్వాలని కోరారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేయటంతో పాటు మేనిఫెస్టోలో చెప్పిన విషయాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. దళిత, గిరిజనులకు మేలు చేసేలా మేనిఫెస్టో ఉందన్నారు. రాష్ట్ర సంపదను ప్రజలకు పంచేలా ఉందని చెప్పారు. పేదలకు భూములపై హక్కులు కల్పించేలా పలు అంశాలను పేర్కొన్నారు తెలిపారు.ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంటికి చేరేలా కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.