Friday, September 20, 2024
spot_img

మీ ఓటుతోనే ఐదేండ్ల భవిష్యత్‌

తప్పక చదవండి
  • కాంగ్రెస్‌ను నమ్ముకుంటే కరెంట్‌ కష్టాలు
  • కరెంట్‌ ఉత్పత్తిలో మనది మిగులు రాష్ట్రం
  • యాదాద్రి పవర్‌ ప్లాంట్‌తో మరో 4వేల మెగావాట్లు వస్తాయి
  • కర్నాటకలో కూడా 24 గంటలు ఇవ్వడం లేదు
  • దేశంలో ఎక్కడా లేని అభివృద్ది మనదగ్గరే ఉంది
  • చెప్పుడు మాటలు విని మోసపోతే గోస తప్పదు
  • మిషన్‌ భగీరథ బ్రహ్మాండంగా విజయవంతం చేసాం
  • బాల్కొండ ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ పిలుపు

నిజామాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో కరెంట్‌ కొరత రానే రాదు.. మిగులు రాష్ట్రంగా కాబోతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తేల్చిచెప్పారు. అలాగే తెలంగాణలో ఇస్తున్న 24 గంటల కరెంట్‌ ఎక్కడా ఇవ్వడం లేదన్నారు. అధికారం దక్కిన కర్నాకటలో కూడా కాంగ్రెస్‌ ఇవ్వడం లేదని గుర్తించాలని అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల్లో నిలబడ్డ వ్యక్తి గురించే కాదు.. ఆ అభ్యర్థి వెనకున్న పార్టీ చరిత్ర చూడాలి అని కేసీఆర్‌ సూచించారు. అలవోకగా, ఆషామాషీగా ఓటు వేస్తే కిందవిూద అవుతుంది. మంది మాటలు పట్టుకుని మారువానం పోతే మళ్లొచ్చే వరకు ఇల్లు కాలిపోయిందని అన్నట్టు ఆగమాగం అయిపోతది. కాబట్టి ఓటు చాలా విలువైంది..

దాని ప్రభావం ఐదేండ్ల భవిష్యత్‌పై ఉంటది కాబట్టి జాగ్రత్తగా వాడాలి. అన్ని వర్గాలను ఆదుకునే ప్రయత్నం చేశాం. సమస్యలన్నింటిని పరిష్కారం చేసుకున్నాం అని కేసీఆర్‌ తెలిపారు.రాష్ట్రంలో ఏ మారుమూల పల్లె అయినా, ఆదిలాబాద్‌లో గోండు బిడ్డలకు కూడా మంచినీళ్లు అందుతున్నాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. మిషన్‌ భగీరథ బ్రహ్మాండంగా విజయవంతం చేసుకున్నాం. కరెంట్‌ సమస్య కంప్లీట్‌ చేసుకున్నాం. యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ అందుబాటులోకి వస్తే ఇంకో 4 వేల మెగావాట్ల విద్యుత్‌ మనకు వస్తుంది. మిగులు రాష్ట్రంగా కాబోతున్నాం. కరెంటో కొరత రానేరాదు. ఎవరికి రాని, ఎవడు యేట్లే పడని, గంగల పడని, తెలంగాణకు మాత్రం ఆ కొరత రాదు. రానివ్వడు కేసీఆర్‌ ఎట్టి పరిస్థితుల్లో అని సీఎం తేల్చిచెప్పారు. ధరణి వచ్చాక భూముల పంచాయితీలు తగ్గాయని కేసీఆర్‌ చెప్పారు. నూటిలో ఒకరిద్దరికి సమస్య ఉంటే పరిష్కరిస్తాం. 17 రాష్టాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్‌ ఇవ్వడం లేదు. కానీ తెలంగాణలో మాత్రం బీడీ కార్మికులకు పెన్షన్‌ ఇస్తున్నాం. దీని గురించి బీడీలు చుట్టే బిడ్డలు ఆలోచించాలి. ప్రభుత్వ వైఖరి, పార్టీ వైఖరి గురించి. పోటీలో ఉన్న పార్టీకి మెదడు ఎలా పని చేస్తదో, ఏమో ఆలోచిస్తదో విచారించాలి. ఏ రాష్ట్రం కూడా బీడీ కార్మికులకు పెన్షన్‌ ఇవ్వట్లేదు. బాల్కొండ, ఆర్మూర్‌ ఈ ప్రాంతాల్లో బీడీ కార్మిక బిడ్డలు ఆలోచించాలి. బీడీ కార్మికులకు రేపు ఐదు వేల పెన్షన్‌ రాబోతోంది. విూ ఒక్క ఓటు కూడా ఇంకో పార్టీకి పడొద్దు. ఆ విధంగా కార్యకర్తలు ప్రచారం కూడా చేయాలి అని కేసీఆర్‌ సూచించారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు విలువైందని సీఎం కేసీఆర్‌ అన్నారు. వజ్రాయుధంలాంటి ఓటును ఉల్టా వినియోగిస్తే కిస్మత్‌ను బదలాయిస్తుందని.. భవిష్యత్‌ను కిందవిూద చేస్తుందని ప్రజలను హెచ్చరించారు. ’నేను చెప్పే నాలుగుమాటలపై గ్రామాల్లో చర్చ పెట్టాలి. ఏది నిజమో కాదో తేల్చాలి. ఓటు అనేది.. ఈ ప్రజాస్వామ్య దేశంలో విూ దగ్గరున్న విలువైన వజ్రాయుధమే ఓటు. దాన్ని ఉల్టా వినియోగిస్తే మీ తలరాతను కిందవిూద చేస్తుంది. ఐదేళ్ల భవిష్యత్తు కిందివిూది చేస్తుంది. ఓటు కిస్మత్‌ను బదలాయిస్తుంది..

- Advertisement -

కాబట్టి.. రాష్ట్ర పరిస్థితులను బదలాయిస్తుంది కాబట్టి తమాషా కోసం వేయొద్దు. మా చిన్నయ్య చెప్పిండు.. మా బామ్మద్ది చెప్పిండు.. మా కులపోడు చెప్పిండు.. మా వాడకొట్టోడు చెప్పిండని ఓటు వేయొద్దు’ అంటూ సూచించారు. ఎవరికి వారు ఎక్కడికక్కడ చర్చ చేసి నిర్ణయానికి రావాలి. ఆ చర్చ జరి ఓటువేసే కాలం వచ్చిన నాడు గ్యారంటీగా నాయకులు కాదు ప్రజలు గెలుస్తారు. ఆ ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యం. ఆ పరిణితి ఈ దేశంలో రావాలని ఆ భగవంతున్ని కోరుతున్నా. కాంగ్రెస్‌ పార్టీ వస్తుంది. ఆ పార్టీ రాష్టాన్న్రి దేశాన్ని ఏకబిగిన 50 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్లు చేసిననాడు మనం చూడలేదు. ఇవాళ కాంగ్రెస్‌ మాట్లాడుతున్నది ఒక్క ఛాన్స్‌ అంటున్నది. విూకు 11 సార్లు ఛాన్స్‌లు ఇచ్చారు. ఒక్కసారి ఛాన్స్‌ ఇస్తే పంటికంటకుండా మింగుతరా? ఏం కారణం? అని ఆలోచన చేయాలి. వైఖరేంటో గమనించాలి. ఏం మాట్లాడుతున్నారు.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో ఆలోన చేయాలి. అప్పుడే నిజానిజాలు తేలుతయ్‌. బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది’ అన్నారు. ప్రశాంత్‌రెడ్డి కన్నా ముందు చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు. అప్పుడేం జరిగింది.. ప్రశాంత్‌రెడ్డి కాలంలో ఏం జరిగిందో విూ కండ్ల ముందే ఉందని మనవి చేస్తున్నా. 18 సబ్‌స్టేషన్లు కట్టిండు. 45 ట్రాన్స్‌ఫార్మర్లు తెచ్చిండు. మళ్లీ మూడు కావాలని మొదలుపెట్టిండు దుకాణం. గత చరిత్రలో నేను కూడా ఎమ్మెల్యేగా సిద్దిపేటలో ఉండేది. ఒక్క సబ్‌స్టేషన్‌ కావాలంటే మూడేళ్లు తిరిగేది. కాంగ్రెస్‌ రాజ్యంలో ట్రాన్‌ఫార్మర్లు, కరెంటు మోటార్లు కాలుతుండే. సగం రాత్రి కరెంటు.. సగం పొద్దాక కరెంటు.. పాముకాట్లు, కరెంటు షాక్‌లు ఉంటుండే..

ట్రాన్స్‌ఫార్మర్‌ కాలితే బోరుకు రూ.2వేలు జమ చేసుడే ఉండే. మళ్లీ ఆ రాజ్యమే రావాల్నా. మళ్లీ తెల్లందాక.. పొద్దాక కరెంటు కావాలా? అదే ఆలోచన చేయాలని కోరుతున్నా. అన్నం ఉడికిందా లేదా? అంటే కుండంత పిసకాల్సిన అవసరం లేదు. టీవీలు చూస్తున్నరు.. పేపర్లు చదువుతరు చర్చ చేస్తరు. సెల్‌ఫోన్ల యుగం ఇది. ఎక్కడ ఏం జరిగిన న్యూస్‌ వస్తుంది. ఇండియాలో మనది చిన్న రాష్ట్రం. పదేళ్ల వయసుమాత్రమే ఉన్న రాష్ట్రం. పెద్ద పెద్ద రాష్టాల్రున్నాయ్‌. భారతదేశం మొత్తంలో ఒక్కరాష్ట్రం కూడా 24గంటల కరెంటు ఇవ్వదు. ఒక తెలంగాణనే ఇస్తుంది’ అని తెలిపారు. ఇదే సందర్భంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. తెలంగాణ అభివృద్ధి గురించి అడ్డగోలుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. మనషులు మాట్లాడితే కొంచెం ఇజ్జత్‌ ఉండాలే అని శివకుమార్‌పై కేసీఆర్‌ మండిపడ్డారు. మనషులు మాట్లాడితే కొంచెం ఇజ్జత్‌ కూడా ఉండాలే.. ఓ పెద్ద లీడర్‌ అని కర్ణాటక నుంచి ఎగేసుకుని వచ్చిండు. అక్కడ ఉప ముఖ్యమంత్రి అంట. నాకు డైలాగ్‌ కొడుతుండు. ఏం డైలాగ్‌ అంటే.. కర్ణాటక అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది.. బస్సు పెడుతా రా.. ఐదు గంటలు కరెంట్‌ ఇస్తున్నామని చెప్తుండు. మేం 24 గంటలు ఇస్తున్నాం రా బాబు.. నీకు ఎవడన్నా చెప్పిండో లేదో.. నువ్వొచ్చి మాకు నీతులు చెప్తే మేం ఏం చేయాలి అని కేసీఆర్‌ ఘాటుగా బదులిచ్చారు. ఇక ఈ బీజేపోళ్లు ఊపుకుంటూ వస్తరు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఒకడు వస్తడు. నోటికొచ్చినట్టు మాట్లాడిపోతరు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిలు వచ్చి ఇట్లనే మాట్లాడిపోతరు. ఉత్తరప్రదేశ్‌ కూలీలు మన వద్దకు వచ్చి నాట్లు వేసి పోతున్నరు. వాడొచ్చి మనకు ఉపన్యాసం చెబితే ఇప్పుడే నేనేం చేయాలి.. రౌతు పట్టుకుని నెత్తి పగులగొట్టుకోవాల్నా..? ఇగో ఇట్ల ఉన్నది కథ. విూ ప్రజలు బతకలేక మా దగ్గర వచ్చి బతుకుతున్నరు. 14 రాష్టాల్ర నుంచి కూలీలు వస్తున్నరు. విూరొచ్చి మాకు నీతులు చెప్తే ఎట్ల ఉంటది ఆలోచించాలి. వీళ్లు కనుక వస్తే రైతుబంధుకు రాంరాం.. కరెంట్‌ కాటగలుస్తది.. దళితబంధుకు జైం భీం.. ఈ కథ తయారైతది. నేను కూడా ఏం చేయలేను. విూ కోసం మస్తు కొట్లాడాను. 14 ఏండ్లు తెలంగాణ కోసం కొట్లాడాను. ఇప్పుడు పందేండ్లు కొట్లాడాను. ఇప్పుడు విూరు కొట్లాడి నిర్ణయం చేయాలి అని కేసీఆర్‌ ప్రజలకు సూచించారు. ఎన్నికల్లో ఏం పడితే మాట్లాడే దుష్ట సాంప్రదాయం దేశంలో వస్తుందని.. ఆగమవుడున్నదని సీఎం కేసీఆర్‌ అన్నారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా మరోసారి వేముల ప్రశాంత్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ’బాల్కొండ నియోకవర్గానికి ఎప్పుడు వచ్చినా మొదటిసారిగా జ్ఞాపకం వచ్చేది మోతే గ్రామం. ఆ మట్టిలో ఉన్న బలం అటువంటిది. తెలంగాణ ఉద్యమంలో అందరికన్నా ముందు మోతే గ్రామమే తీర్మానం చేసి.. తెలంగాణ కావాలని పిడికిలెత్తిన నిలబడ్డ గ్రామం. ఆ గ్రామం మట్టిని ముడుపుకట్టి హైదరాబాద్‌ తీసుకుపోయాను. మళ్లీ తెలంగాణ వచ్చిన తర్వాత అదే మట్టిని తీసుకువచ్చి గ్రామంలో కలిపారు. ఈ సందర్భంగా మోతె గ్రామానికి శిరస్సు వహించి నమస్కారం చేస్తున్నానునని ప్రకటించారు. ప్రజాస్వామ్య పరిణితి పెరగడం లేదు.. అన్నదమ్ముళ్లు అక్కచెల్లెల్లకు దండంపెట్టి చెబుతున్నా.. ఎన్నికలు రాంగనే ఆగమాగం అవుడున్నది. ఎన్నికలంటే ఎలా అయ్యిందంటే ఇష్టం వచ్చిన అబద్ధాలు మాట్లాడొచ్చు. ఇష్టంమున్న ఆరోపణలు పెట్టొచ్చు. సాయి సంసారి అనొచ్చు. లచ్చి దొంగ అనొచ్చు. ఏం పడితే మాట్లాడే దుష్ట సాంప్రదాయం వస్తున్నది. ఎలక్షన్లు ఎన్నిసార్లు రాలే ? ఎవరో ఒకరు గెలవాల్సిందే. రెండో మూడో పార్టీలు నిలబడుతయ్‌. పార్టీకో మనిషి నిలబడుతడు. బీఆర్‌ఎస్‌ నుంచి ప్రశాంత్‌రెడ్డి ఉన్నడు. కాంగ్రెస్‌ ఒకాయన, బీజేపీకి ఒకాయన.. ఇంకా ఎవరైనా ఇండిపెండెంట్‌ పోటీచేస్తడేమో. వీళ్ల సంగతి చూడాల్సిందే. ఈ అభ్యర్థి గుణగణాలు చూడాల్సిందే. వీళ్లు గెలువడమే కాదు. వీళ్ల గెలుపు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు దారి తీస్తుందని అన్నారు. సభలో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు