Friday, September 20, 2024
spot_img

తల్లిపాలతో ముందుగానే బ్రెస్ట్‌ క్యాన్సర్‌ నిర్దారణ

తప్పక చదవండి

మాడ్రిడ్‌ : తల్లి పాలపై విశ్లేషణల ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించవచ్చని స్పెయిన్‌ పరిశోధకులు వెల్లడిరచారు. రొమ్ముక్యాన్సర్‌కు కారకమయ్యే ట్యూమర్‌ డీఎన్‌ఏ రొమ్ము క్యాన్సర్‌ ఉన్న తల్లుల పాలల్లోనూ ఉన్నట్టు పరిశోధకులు చెప్పారు. స్పెయిన్‌లోని వాల్‌ డీ హెబ్రాన్‌ యూనివర్సిటీ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ గ్రూప్‌ హెడ్‌ డా.క్రిస్టినా సౌరా నేతృత్వంలో ఈ పరిశోధనలు నిర్వహించారు. సాధారణంగా రొమ్ము క్యాన్సర్‌ రోగుల్లో ట్యూమర్‌ డీఎన్‌ఏ ఉంటుంది. యూనివర్సిటీకి చెందిన దవాఖానలో రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ గర్భిణి చేరారు.తన పాల ద్వారా బిడ్డకు కూడా క్యాన్సర్‌ సోకుతుందేమోనని ఆమె భయపడ్డారు. ఏడాది క్రితం శీతలీకరణం చేసిన పాలను ఆమె పరిశోధకులకు అందించగా.. ఆ పాలపై పరిశోధనలు చేసి అందులో ట్యూమర్‌ డీఎన్‌ఏ ఉన్నట్టు గుర్తించారు. అనంతరం 15 మంది తల్లుల నుంచి పాల శాంపిళ్లను సేకరించి.. నెక్ట్స్‌ జనరేషన్‌ సీక్వెన్సీంగ్‌ (ఎన్‌జీఎస్‌), డ్రాప్లెట్‌ డిజిటల్‌ పీసీఆర్‌ టెక్నాలజీతో పరీక్షించగా అందులో 13 మంది తల్లుల పాలల్లో ట్యూమర్‌ డీఎన్‌ఏ ఉన్నట్టు నిర్దారించారు. పరిశోధకులు వీహెచ్‌ఐవో`వైడబ్ల్యూబీసీ జెన్‌ ప్యానెల్‌ను రూపొందించారు. అయితే ఈ పాల వల్ల పిల్లలకు ఎటువంటి ప్రమాదం ఉండదని డా.క్రిస్టినా సౌరా తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు