Friday, September 20, 2024
spot_img

కాంగ్రెస్‌ చెప్పే దొంగ హామీలు నమ్మి మోసపోకండి

తప్పక చదవండి

మేండోరా : కాంగ్రెస్‌కు వేసే ఓటు తెలంగాణలో 24 గంటల కరెంటుకు చేటు అని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి, బీఆరెస్‌ అభ్యర్థి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఆయన బాల్కొండ నియోజక వర్గం మెండోరా మండలం వెల్కటూరు, సావెల్‌, చాకిర్యాల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ.. కర్ణాటకలో ఎన్నికల్లో హామీ ఇచ్చి కూడా వ్యవసాయానికి సరి పడా కరెంటు ఇవ్వలేక.. రైతులచే నిరసనలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే తెలంగాణలో కూడా చాలీచాలని కరెంటు కష్టాలు తప్పవన్నారు. కాంగ్రెస్‌ వారు చెప్పే హామీలు నమ్మి మోసపోవద్దు అని కోరి కోరి కాంగ్రెస్‌తో కర్ణాటక లాంటి కష్టాలను తెచ్చుకోవద్దన్నారు. కాంగ్రెస్‌ హయాంలో కాకతీయ కాలువ నీటి కోసం రైతులు పడ్డ ఇబ్బందులు మరిచి పోలేమ న్నారు. 2014 తరువాత తాను ఎమ్మెల్యేగా గెలిచాక కాకతీ య కాలువ నీటి కోసం రైతులు పడ్డ కష్టాలను, రైతులు ఆందో ళనలను నిజాయితీగా స్వీకరించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకా రంతో కాకతీయ కాలువను 365 రోజులు నిండుగా ఉండేట్లు చేశానన్నారు. తద్వారా కాకతీయ కాలువ నీటి సమస్య శాశ్వతంగా దూరం చేశానన్నారు. మంత్రి ఈ మాటలు చెబుతున్నప్పుడు రైతుల పెద్ద ఎత్తున జయజయ ధ్వానాలు చేశారు. 365 రోజులు కాకతీయ కాలువ ద్వారా నీటిని అందిస్తున్న ప్రశాంత్‌రెడ్డి జిందాబాద్‌ అని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వెంచిర్యాల్‌ వెల్కటూర్‌ మధ్య వర్షాకాలం రాకపోకలు నిలిచిపోయే సమస్యను గుండెవాగులో బ్రిడ్జి నిర్మించి అరవై ఏండ్ల సమస్యను పరిష్కరించానని అన్నారు. సావెల్‌, చాకిర్యాల్‌ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ కోసం గ్రామాల రైతులు యాభై ఏండ్లుగా చెప్పులరిగేలా తిరిగినా తనకంటే ముందు పనిచేసిన వారు ఏమీ చేయలేకపోయారన్నారు. ఎమ్మెల్యేగా తాను ఎన్నికైన అనతి కాలంలోనే సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా విన్నవించి నూతన సబ్‌ స్టేషన్లు నిర్మించి ఈ రెండు గ్రామాల కల నెరవేర్చానన్నారు. సావెల్‌లో ప్రత్యేక కృషితో పుష్కర ఘాట్‌ను నిర్మించానన్నారు. దీంతో పుష్కరాల సమయంలో సావెల్‌ గ్రామం రాష్ట్రమంతా తెలిసిపోయిందన్నారు. పనిచేసిన వారికే ఓటు వేసి అభివృద్ధిని కొనసాగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ గ్రామాలు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాయని గుర్తు చేశారు. ఈ మూడు గ్రామాల్లో అడిగినవి, అడగనవి ఎన్నో పనులు చేసి పెట్టానన్నారు. మిషన్‌ భగీరథతో ఈ గ్రామాల పక్కనే ఉన్న గోదారి నీటిని అందించి ఇంటింటికి నల్లా పెట్టి మహిళలల నీటి కష్టాలు తీర్చానన్నారు. అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ ఈ పని చేయలేకపోయాయని గుర్తు చేశారు. సావెల్‌లో 12 లక్షలతో స్మశాన వాటిక రూ. 20 లక్షలతో ఆరోగ్య ఉప కేంద్రం, రూ. 1.40 కోట్లతో సీసీ రోడ్లు అన్ని కుల సంఘాలకు కుల సంఘ భవనాలు తదితర అభివృద్ధి పనులు చేశాన న్నారు. కొత్తగా బీడీ పీఎఫ్‌ వచ్చిన వారికి ఈసారి ప్రభుత్వం ఏర్పడగానే బీడి పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. రుణమాఫీ అందరికీ అందు తుందన్నారు. అందరికీ అందేలా జిమ్మేదారీ నాదీ అని భరోసా ఇచ్చారు. ఆయా గ్రామాల్లో మంత్రికి మహిళలు, యువ కులు, రైతులు ఘనంగా సాదర స్వాగ తం పలికారు. మరోసారి ఆశీర్వ దించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మళ్లీ ఐదేండ్లు ఇదే రీతిన అభివృద్ధి, సేవలు అందిస్తానన్నారు. ఈ ప్రచార కార్యక్ర మంలో స్థానిక గ్రామ, మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు