Thursday, September 19, 2024
spot_img

దాపటెద్దు అంటే.. రైతు పెద్ద కొడుకు

తప్పక చదవండి

ఆరుగాలం యాతన పడే రైతుకు కుడి భుజం లాగా ఆసరయ్యేది. దాపటెద్దును కానికి ఎడమ పక్కన కడతాం అట్లే నాగలి నడవడానికి ఎడ్లను అదుపులుంచడానికి దాపటెద్దుకే పగ్గం కట్టి రైతు ఆ పగ్గంను చేతుల వట్టుకుని అలికిడి చేస్తూ ఎడ్లను అదు పుల పెట్టుకుని నాగలి దున్నుతడు. దాపటెద్దు ఉషారుతనంతోటి నాగలి సాల్లు సక్కగా ఒచ్చేటట్టు నడుస్తది. ఒలపటి ఎద్దు పని దొంగది అయిన సక్కగా పని రానిది అయినా దాన్ని కూడా సైర మీద దాపటెద్దు నడిపించుకుని పోతది. నాగలి మర్లే మూలల కాడ కూడా దాపటెద్దు సైర తోటే ఒలపటిది మర్రి కొత్త సాలు ఏసుకుని కొండ్రలు కలుపుకుంటా నాగలి సక్కగా పోతది. ఇంకా దాపటెద్దు అస్సలైన పనితనం దంతెలు కట్టినప్పుడు కనవడుతది కర్రలు కరాబ్‌ గాకుండా సాల్ల నడుమన దారం గట్టి ముగ్గు వొషినట్టు సక్కగా నడుస్తది.

మూలలు మర్రె కాడ ఒక్క కర్ర కూడా తొక్కకుండ బుద్ధి నేర్చిన మనిషి తీరు నడవడం ఈ దాపటెద్దుకే ఉన్న నైపుణ్యం. రైతు దొడ్లే దాపటెద్దు ఒక్కటి రేవు తెల్సినది అయితే చాలు మిగతా కోడెలకు అన్నిటికీ అదే నాగలి నడుసుడు నేర్పిస్తది. బలువు పని ఉన్నప్పుడు పొద్దు మాపు రొండు పూటలు నాగలి నడిసిన అలసి పోదు, నాగలి నడుసుకుంటా కూడా నెమరు వేసుకుని బలం పొందగలదు దాపటెద్దు. రైతుకు దాపటెద్దు తోటే సగం దున్నుకం అలకగా ఐతది. ఒకరకంగా చెప్పాలంటే దాపటెద్దు రైతు ఎవుసంకు పెద్దకొడుకు లెక్క. ఇంట్ల తండ్రి తర్వాత పెద్ద కొడుకు బాధ్యత ఎట్లనో అట్లే రైతు ఎవుసంలా దాపటెద్దు బాధ్యత కూడా అంతే…. చాలా సందర్భాల్లో చాక చక్యంగా, నైపుణ్యంతో, కష్టపడి పనిచేసే వారిని దాపటెద్దు తో పోల్చడం మనం గమనిస్తూ ఉంటాము. తెలంగాణ సాహితి మాగాణములో అంకురించిన సిద్దిపేట యువ కథా రచయిత దుర్గమ్‌ భైతి,తన కొత్త కథల పుస్తకానికి ఈ ‘‘దాపటెద్దు ‘‘ పేరు పెట్టారు.ఈ పుస్తకములో వివిధ పత్రికల్లో ప్రచురితమైన ఇరవై రెండు కథలున్నాయి.ప్రతి కథలో సామాజిక స్పృహ ఇమిడి యున్న ది. ఇందులో చాలా కథలకు బహుమతులు కూడా లభించినవి. ప్రతి కథ దేనికదే వైవిధ్యభరితముగా ఉన్నది. సందేశముతో కూడి ఉన్నది.ఈ పుస్తకం లోని కథల్లో ముఖ్యంగా గ్రామీణ వాతా వరణం, బాల కార్మిక సమస్య,పండుటాకుల జీవితాలు,మహిళల స్వాభిమాన దృశ్యాలు,రైతుల దైనందిన చర్యలు కనిపిస్తాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు