Thursday, September 19, 2024
spot_img

తెలంగాణలో అవినీతి పరిపాలన

తప్పక చదవండి
  • కేసీఆర్‌కు అవకాశమిస్తే ప్రగతి భవన్, ఫామ్‌హౌస్‌కే పరిమితం
  • నవంబర్ 30 వ తర్వాత తెలంగాణలో బీజేపీ సర్కారు
  • డబల్ ఇంజన్ సర్కార్ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి
  • కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లే
  • పాలమూరులో బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డికి మద్దతుగా ఈటల ప్రచారం

మహబూబ్ నగర్ : తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేయటం బీజేపీ లక్ష్యమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ పట్టణంలోని క్లాక్ టవర్స్ చౌరస్తాలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏపీ మిథున్ రెడ్డి కి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేయటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృతనిచ్చేంతగా ఉన్నారని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో నిధులను కేటాయించిందని ప్రతి గ్రామపంచాయతీలో కేంద్ర నిధులతోనే అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. పాలమూరు ఎమ్మెల్యేగా ఏపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. డబల్ ఇంజన్ సర్కార్ తోనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీ అభ్యర్థులు అందరూ ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్నారని అన్నారు. ఆలమూరు అభివృద్ధిలో భాగంగా యువకుడిగా నితిన్ రెడ్డికి అవకాశం ఇవ్వటం నరేంద్ర మోడీ సైనికుడిగా ఆయనని ఇక్కడికి పంపించాలని అన్నారు.

పాలమూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మిథున్ రెడ్డి కృషి చేస్తారని అన్నారు. తెలంగాణలో అవినీతి పరిపాలన సాగుతుందని ప్రజలు కమలం గుర్తుకు ఓటు వేయటానికి ఎప్పుడు ఎప్పుడు చేస్తున్నారన్నారు. డబల్ ఇంజన్ సర్కార్ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని సూచించారు. ప్రజలు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అండగా ఉన్నారని దేశంలో ఇప్పటికే అన్ని రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రేపు నవంబర్ 30 వ తారీకు తర్వాత తెలంగాణలో కూడా బీజేపీ సర్కారు వస్తుందన్నారు. సర్కారు ఏర్పాటు చేసిన వెంటనే రైతులను నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా తమ కృషి చేస్తామని పేర్కొన్నారు. పాలమూరు బిజెపి అధికారంలోకి రావాలంటే ప్రతి ఒక్కరు కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు వీర బ్రహ్మచారి, ఎమ్మెల్యే అభ్యర్థి మిథున్ రెడ్డి, బీజేపీ నాయకులు పద్మజా రెడ్డి, పడకుల బాలరాజు, పాండురంగ రెడ్డి, బీజేపీ నాయకులు కార్యకర్తలు వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు