Friday, September 20, 2024
spot_img

పకడ్బందీగా జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ

తప్పక చదవండి
  • మీడియా సమావేశంలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ డా. హరీష్‌

ఇబ్రహీంపట్నం : భారత ఎన్నికల కమీషన్‌ సూచించిన నిబంధనల ప్రకారం పకడ్బందీగా రంగారెడ్డి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ డా. హరీష్‌ అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌ లో జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమా సింగ్‌ , పోలిస్‌ ఉన్నత స్థాయి అధికారులతో కలిసి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ హరీష్‌ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్‌ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబం ధించి షెడ్యూల్‌ విడుదల చేసిందని, ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ నవంబర్‌ 3న ఉందని, నవంబర్‌ 3 నుంచి నవంబర్‌ 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, నవంబర్‌ 13 వరకు నామినేషన్ల స్క్రూటినీ, నవంబర్‌ 15 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉందని, నవంబర్‌ 30న పోలింగ్‌, డిసెంబర్‌ 3న కౌంటింగ్‌ నిర్వహణ జరుగుతుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్‌ జాబితాలో తమ పేరు సరి జాబితాలో పేరు లేని వారు అక్టోబర్‌ 30 వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. ప్రకటనల కోసం ఎంపీసీ కమిటీ అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ నీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ అధికారులు ఏ పార్టీకి కూడా అనుకూలంగా ఉండరాదని హెచ్చరించారు. కరపత్రాలు, ఫ్లెక్సీ లు ప్రింటింగ్‌ చేసేవారు కోసం సెక్షన్‌ 126 ప్రకారం నడుచుకోవాలనీ తెలి పారు. ప్రచారానికి వెళ్లే అభ్యర్ధులు తమ రూట్‌ మ్యాప్‌ ని రిట ర్నింగ్‌ అధికారికి తెలిపాలని సూచిం చారు. మతం, కులం, ప్రాం తంపై విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడటం, తప్పుడు ప్రచారాలు చేయ డంపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు, నాయకులకు సమావేశాలు నిర్వహించు కునేందుకు సింగిల్‌ విండో సిస్టం ద్వారా అను మతులు అందిస్తామని, ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్‌ స్పీకర్లు వినియోగించడానికి వీలులేదని అన్నారు. బెల్ట్‌ షాపులపై నిఘా పెట్టాలని పోలీసులకు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్‌ ఉన్నత అధికారులు , రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు