Friday, October 25, 2024
spot_img

సీఎం కేసీఅర్‌ వైద్య రంగానికి పెద్ద పీట

తప్పక చదవండి
  • మంత్రులు హరీశ్‌ రావు, మల్లారెడ్డి, మహేందర్‌ రెడ్డి

మేడ్చల్‌ : సిఎం కేసీఆర్‌ వైద్య రంగానికి పెద్ద పీట వేశారని ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు అన్నారు. మేడ్చల్‌ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయాలోని సిఎంఆర్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ వైద్య కళాశాల నూతన భవనాన్ని మంత్రులు హరీష్‌ రావు, చామకూర మల్లారెడ్డి, పట్నం మహేందర్‌ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ మాట్లాడుతూ సిఎం కేసీఆర్‌ విద్యా వైద్యానికి పెద్ద పీట వేశారని, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో 2,850 మెడికల్‌ సీట్లు ఉంటే ఇప్పుడు 10,000 సీట్లు పెంచామని తెలిపారు. గతంలో వైద్య విద్యార్థులు చదువుకోవాలంటే చైనా, ఉక్రెయిన్‌ లాంటి విదేశాలకు వెల్లె వారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, ప్రతి జిల్లా లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌ ప్రారంబించామన్నారు. పేదలకు వైద్యం, ఎల్లప్పుడూ వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. ప్రవేట్‌ వైద్య కళాశాలలు ఏర్పాడినప్పటికీ అందులో పేద, మద్య తరగతి విద్యార్థులకు యాభై శాతం ప్రభుత్వం తరపున చెల్లిస్తామని ఆయన అన్నారు. సిఎంఆర్‌ వైద్య కళాశాల ప్రారంబించడం చాలా ఆనందం గా ఉందని, ఇక్కడ విధులు నిర్వహించే వైద్యులకు, ఇతర సిబ్బంది కి, సిఎంఆర్‌ మెడికల్‌ కాలేజ్‌ యాజమాన్యాకి శుభాకాంక్షలు తెలియజేస్తునానన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్‌ నియోజకవర్గ బిఆర్‌ఎస్‌ పార్టీ ఇంచార్జీ మహేందర్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భాస్కర్‌ యాదవ్‌, మేడ్చల్‌ జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌ దర్గా దయాకర్‌, జెడ్పీటీసీ శైలజ విజయనందారెడ్డి, గుండ్లపోచాంపల్లి మున్సిపాలిటీ చైర్‌ పర్సన్‌ మద్ధుల లక్ష్మీ శ్రీనివాస్‌ రెడ్డి, సిఎంఆర్‌ హాస్పిటల్‌ ఛైర్మన్‌ గోపాల్‌ రెడ్డి, మండల అధ్యక్షుడు దయానంద్‌ యాదవ్‌, నాయకులు, విధ్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు