No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

తెలంగాణలో ఇంకా అభివృద్ధి పనులు కొనసాగాలంటే బిఆర్ఎస్ గెలవాలి….

తప్పక చదవండి
  • అని వెల్లడించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
    నల్లగొండ : తెలంగాణ రాష్ట్రం తొమ్మిదిన్నర ఏండ్లలో ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు గొప్పగా అభివృద్ధి చెందాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం దామరచర్ల మండలం కల్లెపల్లి గ్రామంలో బంగారు మైసమ్మ ఆలయ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు కలిసి పాల్గొన్నారు.
    ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి, గిరిజనులకు రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఎన్నో ఏండ్లుగా ఉన్న పోడు పట్టాల సమస్యలను పరిష్కరించి, పొడు భూములకు పట్టాలు ఇచ్చిన మహా నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రశంసించారు.ఆలయ నిర్మాణానికి శంకుస్తాపన చేస్తున్న మండలి చైర్మన్‌ గుత్తా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు పెట్టాలి, అభివృద్ధి ఆగకుండా ఉండాలి అంటే మళ్లీ అధికార పార్టీనే ఆదరించాలని ఆయన సూచించారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే భాస్కర్ రావు చాలా అభివృద్ధి చేసారని మరోసారి ఆయనకు అవకాశం కల్పిస్తే.. ఇంకా గొప్పగా అభివృద్ధి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు