Monday, October 28, 2024
spot_img

ఓట్ల కోసం ఎవరైనా ప్రలోభ పెడితే సి-విజిల్ మోగించండి

తప్పక చదవండి
  • ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కు ఫిర్యాదు చేసే మొబైల్ యాప్

హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా ఉండేందుకు నిబంధనలు రాజకీయ పార్టీలు ఉల్లంఘించకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం సీ విజిల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్క పౌరుడు తన దృష్టికి వచ్చిన ఎన్నికల ఉల్లంఘన కార్యక్రమాలను ఫిర్యాదు చేయవచ్చు. భారత ఎన్నికల సంఘం ప్రారంభించిన సి-విజిల్ యాప్ ఈ అన్ని ఖాళీలను పూరించడానికి, ఫాస్ట్ ట్రాక్ ఫిర్యాదు స్వీకరణ, సత్వర పరిష్కార వ్యవస్థను రూపొందించడానికి సి-విజిల్ అనేది ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి, వ్యయ ఉల్లంఘనలను నివేదించడానికి పౌరుల కోసం ఒక వినూత్న మొబైల్ యాప్ అప్లికేషన్  సి-విజిల్ అంటే విజిలెంట్ సిటిజన్ ఇది స్వేచ్ఛా, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో పౌరులు పోషించగల క్రియాశీలక బాధ్యతాయుతమైన పాత్రను నొక్కి చెబుతుంది.

ఫిర్యాదు సమయంలో ఫొటో, వీడియో అప్లోడ్ చేసే సమయంలో ఫోన్లో జీపీఆర్ఎస్ ఆన్ చేసి ఉండాలి. ఫిర్యాదు చేసే వ్యక్తులు తమ వివరాలను నమోదు చేయాల్సిన అవసరం లేదని సూచించారు. వారి వివరాలు గ్రూప్ లో ఉంటాయి. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరిగినప్పుడు ఫొటో కానీ, 2 నిమిషాల నిడివి ఉన్న వీడియోలు కానీ యాప్ లో అప్లోడ్ చేయాలి. సీ విజిల్ యాప్ ద్వారా వివరాలు నేరుగా జిల్లా ఎన్నికల అధికారికి చేరుతాయి. అక్కడ ఆఫీసులో అందుబాటులో ఉండే సిబ్బంది అధికారులకు, సిబ్బందికి యాప్ లో వచ్చిన ఫిర్యాదులపై స్పందించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించనున్నారు. ఫిర్యాదుదారులకు కేటాయించిన ఐడీకి తిరిగి అప్ డేట్ పంపిస్తారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు