Friday, September 20, 2024
spot_img

బీజేపీవి బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు

తప్పక చదవండి
  • ఎంపి జివిఎల్‌ వ్యాఖ్యలపై లెఫ్ట్‌ మండిపాటు
  • మండిపడ్డ రామకృష్ణ, బివి రాఘవులు

విజయవాడ : బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత రామకృష్ణ, సిపిఎం నేత బివి రాఘవులు మండిపడ్డారు. విమర్శలకు కౌంటర్‌ ఇచ్చారు. గురువారం విజయవాడలో రామకృష్ణ విూడియాతో మాట్లాడుతూ.. బీజేపీ , కాంగ్రెస్‌ రెండు పెద్ద పార్టీలే కానీ ఆంధ్రప్రదేశ్‌లో నెగటివ్‌ ఓట్లలో పెద్ద పార్టీ బీజేపీయేనని అన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు విషయంలో బీజేపీ, జగన్‌ కలిసే జైలుకు పంపారని విమర్శించారు. బీజేపీ బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు చేస్తున్నారని ఇదివరకే చెప్పాం.. ఢల్లీిలో విూరు చేస్తుందేంటి.. ఢల్లీి ఉపముఖ్యమంత్రి 6 నెలలుగా జైలులో ఉన్నారని.. ఎమ్మెల్సీ కవిత, విజయసాయి అల్లుడు అదే కేసులో బయట ఉన్నారని, బీజేపీ మద్దతు లేకపోతే బయట ఉంటారా అని ప్రశ్నించారు. బీజేపీ కూడా ఒకానొక సమయంలో ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారని, తమకు ఇప్పుడు ఇద్దరే ఉన్నారని రామకృష్ణ వ్యాఖ్యానించారు. అయినా మేము ప్రజల తరుపున నిలబడి పోరాడతామని, ప్రజలు తలుచుకుంటే ఎవరినైనా గెలిపిస్తారని అన్నారు. ఎంతో మంది ఆంధ్రులు కమ్యూనిస్టులుగా ఆత్మగౌరవం కోసం పోరాడారని, విూలాంటి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు భయపడమని రామకృష్ణ స్పష్టం చేశారు. ఏపీలో జనసేనతో పొత్తుపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన, బీజేపీ బంధంపై ఎలక్షన్లు దగ్గరపడే కొద్దీ మరింత స్పష్టత వస్తుంది. మరెవరినైనా కలుపుకోవాలా అనే దానిపై భవిష్యత్తులో చర్చిస్తాం. జనసేన పొత్తుపై మాకెలాంటి కన్ఫ్యూజన్‌ లేదు. 175 నియోజకవర్గాలల్లో డిసెంబర్‌ నుంచి మా పార్టీ బలోపేతం అవడానికి పని చేస్తుంది. ఏపీ అధ్యక్షులు ఎవరైనా మా పార్టీ అభివృద్ధికే నిర్ణయాలుంటాయి. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను ఓడిరచగల పార్టీగా బీజేపీ ఉంది. ఇండియా అలయెన్స్‌లో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ అన్ని చోట్ల పోటీ చేస్తోంది. అందరూ కలిసొచ్చినా, విడివిడిగా వచ్చినా, ఇంకో నలుగురిని తెచ్చుకున్నా మోదీదే గెలుపు. బీజేపీపై ఏ పార్టీ వ్యాఖ్యలు చేసినా వారిది అభద్రతా భావమే. కమ్యూనిష్టులు దిక్కు తోచక ప్రధాని మోదీపై అనేక ఏడుపుకొట్టు మాటలు మాట్లాడుతున్నారు. కమ్యూనిష్టులు దాదాపు కనుమరుగయ్యారు.. తెలంగాణాలో ఒకటో రెండో సీట్లు పొందారు. ఏపీలో కూడా సీట్లు కోసం కమ్యూనిష్టులు ఇలా మాట్లాడుతున్నారని ఎంపీ జీవీఎల్‌ ఎద్దేవ చేశారు. బీజేపీ సీనియర్‌ నేత జీవియల్‌ వ్యాఖ్యలకు సీపీఎం నేత బీవీ రాఘవులు కౌంటర్‌ ఇచ్చారు. పిట్టలంటే అందరికీ గౌరవమని.. మమ్మల్ని పిట్టలతో పోల్చినందుకు జీవియల్‌ ధన్యవాదాలు తెలిపారు. పిట్టలు లేకుంటే అసలు పర్యావరణమే లేదనేది వారు తెలుసుకోవాలన్నారు. తాము పిట్టల పార్టీల వాళ్లమే అయితే.. వారిది రాబందుల పార్టీ కదా అని అన్నారు. తాము ప్రజల కోసం పని చేస్తామని.. వారు పెట్టుబడిదారుల కోసం పని చేస్తారన్నారు. సమాజాన్ని నాశనం చేయడానికే ఆ రాబంధులు పని చేస్తున్నారని బీవీ రాఘవులు మండిపడ్డారు. మా వల్ల ప్రజలకు మేలు జరిగితే.. వాళ్ల వల్ల అన్యాయం జరుగుతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్‌ను తొలగించి, కిషన్‌ రెడ్డిని ఎందుకు పెట్టారని బీవీ రాఘవులు ప్రశ్నించారు. కర్నాటక, ఇతర రాష్టాల్రలో వాళ్ల పార్టీ నాయకులను ఎందుకు మార్చారని నిలదీశారు. వాళ్ల సంగతి వాళ్లు తెలుసుకుని ప్రజల ఆదరణ పొందితే మేలని అన్నారు. వైరుధ్యాలు ఉన్నా అనేక పార్టీలు కలిసి ఇండియాగా ఏర్పడ్డాయన్నారు. మతోన్మాదాన్ని తరిమికొట్టేందుకు ఇండియా పని చేస్తోందన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలలో బీజేపీని ఓడిరచేలా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. సీపీఐ, సీపీఎంలు శాసన సభకు వెళ్లాలని ఎవరికి వారుగా పోటీ చేస్తున్నామని బీవీ రాఘవులు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు