Thursday, September 19, 2024
spot_img

నవంబర్ లో బ్యాంకుల పనిదినాలు..

తప్పక చదవండి
  • దాదాపు 15 రోజులు పనిచేయవని ప్రకటన..
  • నిర్ణయం తీసుకున్న ఆర్.బీ.ఐ.

హైదరాబాద్ : దేశంలో చాలా మంది బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉండాలన్న ఉద్దేశంతో పలు పథకాలను ప్రవేశపెట్టడంతో మారుమూల గ్రామాల్లోని ప్రజలకు సైతం బ్యాంకు ఖాతాలు అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో బ్యాంకుల పనివేళలు, బ్యాంకుల సెలవులపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

బ్యాంకులకు ఏ నెలలో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకుల సెలవులకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నవంబర్‌ నెలకు సంబంధించిన సెలవుల విషయమై ఆర్‌బీఐ ప్రకటన చేసింది. ఇక నవంబర్‌ నెలలో బ్యాంకులకు ఏకంగా 15 రోజులు బ్యాంకులు పనిచేయవు. దేశంలోని పలు ప్రాంతీయ పండుగలు, ప్రత్యేక రోజుల కారణంగా ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ప్రకటించాయి. మరి నవంబర్‌ నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయో ఇప్పుడు చూద్దాం..

- Advertisement -
  • నవంబర్‌ 1వ తేదీన కన్నడ రజతోత్సవం/ కర్వా చౌత్​/ కుట్​ పండుగ నేపథ్యంలో బ్యాంకులకు సెలవు ప్రటించారు. అయితే ఇది కేవలం బెంగళూరు, ఇంఫాల్​, శిమ్లాలోని బ్యాంక్​లకు మాత్రమే పరిమితం.
  • ఇక నవంబర్‌ 10వ తేదీన వంగాల పండుగను పురస్కరించుకొని షిల్లాంగ్​లోని బ్యాంక్​లకు సెలవును ప్రకటించారు.
  • నవంబర్ 13వ తేదీన అగర్తలా, డెహ్రాడూన్​, గ్యాంగ్​టక్​, ఇంఫాల్​, జైపూర్​, కాన్పూర్​, లక్నోలోని బ్యాంక్​లకు సెలవులు ప్రకటించారు. నిజానికి నవంబర్‌ 12వ తేదీన దీపావళి కాగా ఆరోజు ఆదివారం వస్తోంది.
  • ఇక నవంబర్ 14వ తేదీన దీపావళి బలిప్రాతిపద పండగ కారణంగా.. అహ్మదాబాద్​, బేలాపూర్​, బెంగళూరు, గ్యాంగ్​టక్​, ముంబై, నాగ్​పూర్​లోని బ్యాంక్​లకు సెలవును ప్రకటించారు.
  • నవంబర్ 15వ తేదీన లక్ష్మీ పూజను పురస్కరించుకొని.. గ్యాంగ్​టక్​, ఇంఫాల్​, కాన్పూర్​, కోల్​కతా, లక్నో, శిమ్లాలోని బ్యాంక్​లకు సెలవును ప్రకటించారు.
  • నవంబర్‌ 20వ తేదీన ఛత్ పండుగను పురస్కరించుకొని..​. పట్నా, రాంచీలోని బ్యాంక్​లకు హాలీడేను ప్రకటించారు.
  • నవంబర్‌ 23వ తేదీన సెంగ్​ కుట్సునెమ్ కారణంగా..​. డెహ్రాడూన్​, షిల్లాంగ్​లోని బ్యాంక్​లకు సెలవును ప్రకటించారు.
  • నవంబర్ 27వ తేదీన గురునానక్​ జయంతిని పురస్కరించుకొని.. అహ్మదాబాద్​, ఇంఫాల్​, ఏపీ మినహా అన్ని బ్యాంక్​లకు హాలీడే ప్రకటించారు.
  • ఇక నవంబర్‌ 30 తేదీన కనకదాస జయంతి రోజున బెంగళూరులో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

ఇదిలా ఉంటే ఈ పండుగలతో పాటు సెకండ్ శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు బ్యాంకులు పనిచేయవనే విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నవంబర్‌ 5,11,12,19,25,26 తేదీల్లో రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాల్లో బ్యాంకులు సేవలు అందించవు. ఇదిలా ఉంటే ఈ నెల చివర్లో కూడా బ్యాంకులకు భారీగా సెలవులు ఉన్నాయి. అక్టోబర్​ 23, 24, 25, 26,27, 28, 29 తేదీల్లో పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఇదిలా ఉంటే బ్యాంకులకు సెలవులు ఉన్నా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్ సేవలు మాత్రం అందుబాటులోనే ఉంటాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు