Thursday, September 19, 2024
spot_img

ఢిల్లీ మెట్రోలో దారుణం..

తప్పక చదవండి
  • వృద్ధుడిపై దాడి చేసిన యువకుడు..

ఢిల్లీ : గత కొద్ది రోజులుగా ఢిల్లీ మెట్రోకు సంబంధించి అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కొన్ని సరదా సంఘటనలు, కొన్ని షాకింగ్‌ విషయాలు కూడా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఢిల్లీ మెట్రోలో ప్రయాణీకుల చేష్టలు, అసభ్యకర ప్రవర్తనలు, డ్యాన్స్‌ రీల్స్‌ వంటి వింత పోకడలకు సంబంధించిన వీడియోలు త‌ర‌చూ వైర‌ల్‌ అవుతుంటాయి. మెట్రోలో కొందరు చేసే చిలిపి పనులు, అల్లరి చేష్టలు, యువతి యువకుల రోమాన్స్‌కు సంబంధించిన వీడియోలు కూడా అనేకం చూశాం. మెట్రో ప్రయాణికుల మధ్య చిన్నచిన్న కార‌ణాల‌కే గొడ‌వ‌లు పడుతుండటం, వాగ్వాదానికి సంబంధించిన వీడియోలు చాలా చూశాం. ఢిల్లీ మెట్రోలో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరో వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఒక వృద్ధుడిపై తోటి ప్రయాణికుడు దుసురుగా ప్రవర్తించాడు. వైరల్‌ అవుతున్న వీడియోలో మెట్రో రైలు కోచ్‌లో నిలబడి ఉన్న ఒక వృద్ధ ప్రయాణికుడిపై తోటి వ్యక్తి వాగ్వాదానికి దిగటం కనిపించింది. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి సదరు పెద్దమనిషిపై ఒక్కసారిగా దాడికి దిగాడు…అది గమనించిన తోటి ప్రయాణికులు జోక్యం చేసుకొని పెద్దాయనకు సాయంగా నిలిబడ్డారు.. దాడి చేసిన వ్యక్తిని వారిస్తూ.. దూరంగా నెడుతున్నారు. అంతా కలిసి అతడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అయితే, అక్కడ జరిగిన గొడవకు కారణంగా మాత్రం తెలియారాలేదు. ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘వెల్‌కమ్ టు ఢిల్లీ మెట్రో’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు