No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

జీ 20 సదుస్సుకై భారత్ రానున్న అమెరికన్ ప్రెసిడెంట్..

తప్పక చదవండి
  • అధ్యక్షుడి పర్యటనను ధృవీకరించిన వైట్‌హౌజ్‌..
  • భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసెస్తున్న భారత ప్రభుత్వం..
  • ద్వైపాక్షిక అంశాలపై ప్రధాని మోడీతో ప్రత్యేక సమావేశం..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ జి20 సదస్సులో పాల్గొనేందుకు ఈ నెలలో భారత్‌లో పర్యటించనున్నారు. 910 తేదీల్లో ఢిల్లీలో జరిగే జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల పర్యటన నిమిత్తం బైడెన్‌ భారత్‌కు వస్తున్నారు. కాగా, సమావేశాలకు రెండు రోజుల ముందే బైడెన్‌ భారత్‌కు రానున్నట్లు వైట్‌ హౌస్‌ తెలిపింది. సమావేశాల్లో పాల్గొనడంతోపాటు మోదీ తో ప్రత్యేకంగా సమావేశమవుతారని వెల్లడించింది.. ఈనెల 7వ తేదీన గురువారం బైడెన్‌ భారత్‌ పర్యటనకు బయలుదేరుతారని తెలిపింది. 8వ తేదీన ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారని వెల్లడించింది.. ఆ తర్వాత 910 తేదీల్లో జీ20 సమ్మిట్‌లో పాల్గొంటారని పేర్కొంది. ఈ సమావేశాల్లో అంతర్జాతీయ సమస్యలు, వాతావరణ మార్పులు, క్లీన్‌ ఎనర్జీ, రష్యాఉక్రెయిన్‌ యుద్ధం తదితర అంశాలపై ప్రపంచ దేశాల నేతలతో చర్చిస్తారని వెల్లడిరచింది. కాగా, అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ భారత్‌కి రావడం ఇదే తొలిసారి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు