Friday, September 20, 2024
spot_img

వికారాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు వరుస షాక్‌లు..

తప్పక చదవండి
  • జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్‌ కొండల్‌రెడ్డి, హనుమంత్‌రెడ్డిలు పార్టీకి రిజైన్‌
  • అదే బాటలో బంటారం మాజీ జడ్పీటీసీ సునీత శివకుమార్‌ల రాజీనామాలు

వికారాబాద్‌ : ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడడంతో రాజకీయాల్లో ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ కు టికెట్‌ ఇవ్వడంతో పార్టీలో కీలకంగా వ్యవహరించిన పలువురు ముఖ్య నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడిన విషయం అందరికీ తెలిసిందే.

గత కొద్ది రోజుల క్రితం సీనియర్‌ నాయకులు రామచంద్రారెడ్డి బిఆర్‌ఎస్‌ ను వీడి అతని అనుచరులతో పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ చేరారు. ఇక 2013 నుండి వికారాబాద్‌ లో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతానికి ఎనలేని సేవలందించిన జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్‌ సనగారి కొండల్‌ రెడ్డి గురువారం రాజీనామా ప్రకటించగా అదే బాటలో ధరూర్‌ మండల నాయకుడు హనుమంత్‌ రెడ్డి సైతం బిఆర్‌ఎస్‌ కు గుడ్‌ బై చెప్పారు.

- Advertisement -

వీరి మాదిరిగానే బంటారం మాజీ జెడ్పిటిసి సునీత శివకుమార్లు సైతం బిఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా ప్రకటించడంతో బిఆర్‌ఎస్‌ పార్టీకి వరుస షాక్‌ లు తగిలినట్లయింది. అయితే వీరంతా త్వరలో వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో జరగబోయే కాంగ్రెస్‌ బహిరంగ సభలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సమక్షంలో వారి అనుచరులతో కలిసి వేల సంఖ్యలో కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.

రెండు దఫాలు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థుల ను గెలిపించడంలో క్రియా శీలక పాత్ర పోషించిన ముఖ్య నాయకులంతా పార్టీని వీడటం గమనార్హం కాగా ఎమ్మెల్యే పై ఉన్న వ్యతిరేకత కారణంగా అసమతి నాయకులంతా కారు దిగి కాంగ్రెస్‌ పార్టీలోకి వెళుతుండ డంతో కాంగ్రెస్‌ పార్టీ బలో పేతం దిశగా దూసుకు పోతోంది. ము న్ముందు మరి కొందరు నాయకులు బిఆర్‌ఎస్‌ పార్టీని వీడే అవకాశం ఉందని సంకేతాలు విని పిస్తు న్నాయి. ఈసారి వికారాబాద్‌ నియోజక వర్గంలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించ బోతుందని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు