Friday, September 20, 2024
spot_img

పిలిచి మంత్రిని చేస్తే జిల్లాకు చేసిందేమిటి..?

తప్పక చదవండి
  • ఒక్క సీటయినా గెలిపించలేకపోయి విమర్శలా
  • ఓడినా స్పేహబంధంతో చేరదీస్తే పార్టీకి ద్రోహమా
  • పాలేరు సభలో మాజీమంత్రి తుమ్మలను ఏకిపారేసిన కెసిఆర్‌
  • బిఆర్‌ఎస్‌ గెలిస్తేనే ఖమ్మం జిల్లా అభివృద్దికి అవకాశం
  • సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి నీటిని అందిస్తాం
  • అరాచక రాజకీయనేతలను తిప్పి కొట్టాలని కెసిఆర్‌ పిలుపు

ఖమ్మం : మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర రావుపై తొలిసారి సిఎం కెసిఆర్‌ విమర్శలు గుప్పించారు. తుమ్మల ఓడిపోయి మూలకు కూర్చుంటే.. పిలిచి మంత్రిని చేశాను అని కేసీఆర్‌ తెలిపారు. మిత్రుడు తుమ్మల నాగేశ్వర్‌ రావుకు తాను అన్యాయం చేశానని ప్రచారం చేస్తున్న తీరుపై పాలేరు సభలో మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే చేసి ఐదేండ్లు ఖమ్మం జిల్లా విూద ఏకఛత్రాధిపత్యం ఇస్తే, ఒక్క సీటు రాకుండా చేశారని తుమ్మలపై కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. పాలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసి బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఆయన ఖమ్మంలో పువ్వాడ అజయ్‌పై ఓడిపోయాడు. ఓడిపోవడంతో ఇంట్లకు పోయి మూలన కూర్చున్నాడు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత స్నేహితం ఉందని, సీనియర్‌ నాయకులని చెప్పి ఆయనను తీసుకొచ్చి ఏ పదవి లేకున్నా మంత్రి పదవి ఇచ్చి, ఎమ్మెల్సీని చేశాను. ఆ తర్వాత పాలేరులో ఎమ్మెల్యే వెంకట్‌ రెడ్డి చనిపోయారు. ఆయన భార్యను పోటీలో పెట్టాలని అనుకున్నాం. కానీ ఈయన వచ్చి అన్న నా నియోజకవర్గం రిజర్వ్‌ అయింది. అవకాశం ఇస్తే పాలేరు సేవకు చేస్తా, కాపాడుకుంటాను అని చెప్తే ఉప ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చి మేమంతా వచ్చి దండం పెడితే 42 వేల మెజార్టీతో గెలిపించారు. ఈ సత్యం విూకు తెలుసు. ఓట్లు వేసింది విూరే అని కేసీఆర్‌ తెలిపారు.నేను ఒక్కటే మాట అడుగుతున్నాను. మంత్రిని చేసి, ఎమ్మెల్సీని చేసి, ఎమ్మెల్యేను చేసి ఐదేండ్లు జిల్లా విూద ఏకఛత్రాధిపత్యం ఇస్తే నీవు చేసింది సున్నా గుండు సున్నా. ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు రాకుండా చేశారు. ఎవరు ద్రోహం చేశారు. ఎవరికి ఎవరు నష్టం చేశారు. బీఆర్‌ఎస్‌కు తుమ్మల అన్యాయం చేసిండా..? బీఆర్‌ఎస్‌ తుమ్మలకు అన్యాయం చేసిందా..? న్యాయం చెప్పాలింది విూరే అంటూ ప్రశ్నించారు. ఈ చరిత్ర అంతా విూ కండ్ల ముందు జరిగిన చరిత్ర. ఇవన్నీ మరిచిపోలేం. ఇవాళ నోరు ఉందని అడ్డగోలుగా మాట్లాడితే రాజకీయం కాదు. ప్రజాస్వామ్యం కాదు. అది అరాచకం. అరాచకాల్ని తిప్పికొట్టాలన్నారు. అరాచక రాజకీయవేత్తలకు బుద్ది చెప్పాలని కేసీఆర్‌ పాలేరు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వల్లే పాలేరు నియోజకవర్గానికి మోక్షం లభించిందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఖమ్మంలో రెండు సార్లు ఒక్కొక్క సీటే వచ్చింది. అయినా బీఆర్‌ఎస వచ్చింది. ఇప్పుడు కూడా బీఆర్‌ఎస్‌ వస్తది. ఎవడో ఎల్లయ్య, మల్లయ్య గెలిస్తే అయ్యేది ఏం లేదు. అదే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గెలిస్తే జిల్లా అభివృద్ధికి, సీతారామ ప్రాజెక్టు కోసం పాటుపడుతారు అని కేసీఆర్‌ తెలిపారు. నిన్నమొన్నటి దాకా కేసీఆర్‌ వల్ల మోక్షం వచ్చిందని మాట్లాడిన నాలుకలు.. నరం లేని నాలుక కాబట్టి వారే ఉల్టా మాట్లాడుతున్నారు. నరం లేని నాలుక మారొచ్చు కానీ సత్యం మారదు. నిజం నిజం లాగే ఉంటుంది. నిజం నిప్పులాంటింది కదా..? ఎవరి వల్ల పాలేరుకు మోక్షం వచ్చిందో విూకు అందరికీ తెలుసు అని కేసీఆర్‌ పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ఏర్పాటు కోసం 24 ఏండ్ల క్రితం ఈ జెండా ఎత్తి, ఉద్యమాన్ని పిడికెడు మందితో ప్రారంభించు కున్నాం అని కేసీఆర్‌ తెలిపారు. ఉద్యమ ప్రారంభంలో చాలా అవమానాలు, అవహేళన చేశారు. తెలంగాణ ఎట్ల వస్తది.. సాధ్యం కాదు.. కేసీఆర్‌ బక్క పలచనోడు ఎవడో పిసికి చంపేస్తడు అని మాట్లాడారు. కానీ 14. 15 ఏండ్లు పోరాటం తర్వాత యావత్‌ తెలంగాణ ఒక ఉప్పెన అయి కదిలేతే దేశ రాజకీయ పరిస్థితి తలవంచి తెలంగాణ ఇచ్చింది అని కేసీఆర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మోసం చేస్తే ఆ రోజు నేనే కేసీఆర్‌ శవయాత్రనా.. తెలంగాణ జైత్రయాత్రనా.. అని ఆమరణ దీక్ష చేపట్టాను అని కేసీఆర్‌ తెలిపారు. ఆమరణ దీక్షకు పూనుకుంటే తనను అరెస్టు చేసి ఇదే ఖమ్మం జైల్లో పెట్టారు. అనేక మోసాలు చేశారు. మాటలతో నమ్మించారు. అన్నింటిని అధిగమించి అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం అని సీఎం స్పష్టం చేశారు. భక్తరామదాసు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ప్రారంభం చేసిన రోజు మన మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డి.. ప్రత్యేకించి ఆయన వచ్చారు. పాలేరుకు విూరు ఎందుకు వస్తున్నారంటే నాది కూడా పాలేరు నియోజకవర్గమే.. 45 ఏండ్లలో 40 ఏండ్లు కరువుకాటకాలకు గురైంది. ఇవాళ విూరు నీళ్లు అందిస్తున్నారు. సంతోషమైందని వచ్చానని మహేందర్‌ రెడ్డి తెలిపారని కేసీఆర్‌ గుర్తు చేశారు.విూ అందర్నీ కోరేది ఒక్కటే మాట. బీఆర్‌ఎస్‌ రాక ముందు ఈ రాష్ట్రంలో చాలా పార్టీలు రాజ్యం చేశాయి అని కేసీఆర్‌ తెలిపారు. కొన్ని మంచినీళ్లు ఇవ్వాలన్న ఆలోచన చేయలేదు. పాలేరుకు మోక్షం లభించందంటే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. భక్తరామదాసు పూర్తి చేసి నీళ్లు ఇచ్చాం. ఈ విషయం విూ అందరికీ తెలుసు. వాగుల విూద చెక్‌ డ్యాంలు కట్టుకున్నాం. ఎండిపోయిన పాలేరు చెరువులు నిండుగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఉపేందర్‌ రెడ్డి ఉపన్యాసం విన్నాను అని కేసీఆర్‌ తెలిపారు. అది ఉపన్యాసం లాగా లేదు. ఇంటి మనషులతో మాట్లాడినట్లు ఉంది. నా సెల్‌ ఫోన్‌ నంబర్‌ విూ దగ్గర ఉందా? అని అడిగారు. ఇది నాయకత్వ లక్షణం. ప్రజల్లో కలిసిపోయి మాట్లాడే నాయకులు చాలా తక్కువగా ఉంటారు. ఉపేందర్‌ రెడ్డి ఎమ్మెల్యేగా విూకు ఉండటం అదృష్టం అని కేసీఆర్‌ అన్నారు. గిరిజనులపై నోరు పారేసుకున్న టీ పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. గిరిజనులకు వెయ్యి నోటు చేతిలో పెట్టి గుడుంబా పోస్తే ఓట్లు వేస్తారా..? ఇదేనా గిరిజనులకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చే మర్యాద అని కేసీఆర్‌ ప్రశ్నించారు. పాలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. బెల్లయ్య నాయక్‌కు ఎమ్మెల్యే టికెట్‌ రావాలని లంబాడీ హక్కుల పోరాట సమితి వాళ్లు పోరాటం చేస్తుంటే.. వాళ్లది ఏంది.. వెయ్యి నోటు చేతిలో పెట్టి ఇంత గుడుంబా పోస్తే వాళ్లే ఓటు వేస్తారు అని రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇదేనా గిరిజనులకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చే మర్యాద. గిరిజనులకు గుడుంబా పోసి ఓట్లు తీసుకుంటారా..? ఇంత బాహాటంగా మాట్లాడుతారా..? ఇంత అహకారంతోని మాట్లాడే పార్టీ రేపు ఎవరికి న్యాయం చేస్తది. కాబట్టి ఆలోచించాలని కోరుతున్నానని గిరిజనులకు కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. వందకు వంద శాతం రైతుబంధు కొనసాగిస్తాం అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన రీతిలో రైతుబంధు వచ్చే ఏడాది నుంచి రూ. 12 వేలు ఇస్తాం. క్రమంగా రూ. 16 వేలకు పెంచుతాం. ధాన్యం కొనుగోలు కొనసాగిస్తాం. రైతుకు ఇబ్బంది లేకుండా చేస్తాం. రైతుబీమా తరహాలోనే 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్‌ బీమా ప్రతి ఇంటికి ధీమా అనే పథకాలను తీసుకువస్తున్నాం. ప్రజల విూద భారం పడకూడదని గ్యాస్‌ సిలిండర్‌ను 400కే అందించాలని నిర్ణయించాం. ఇవన్నీ జరగాలంటే బీఆర్‌ఎస్‌ కచ్చితంగా గెలవాలి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కచ్చితంగా వస్తదన్న ధీమా వ్యక్తం చేశారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు