No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

కేంద్ర కార్యాలయాలకు 3 రోజలు సెలవులు..

తప్పక చదవండి
  • సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు ఢిల్లీలో జీ-20 సదస్సు..
  • పూర్తిగా 3రోజులు మూతపడనున్న ఢిల్లీ..
  • 7 వతేదీ అర్దరాత్రి నుంచి నిబంధనలు అమల్లోకి..

జి – 20 సదస్సు కారణంగా సెప్టెంబర్‌లో దేశ రాజధాని ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. సెప్టెంబరు 9, 10 తేదీలలో జి – 20 సదస్సు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సెప్టెంబర్‌ 8 నుంచి 10వ తేదీ వరకు ఢిల్లీలో ఉన్న అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలూ మూసే ఉంటాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు 7 నుంచి 10వ తేదీ వరకు జీ 20 సమావేశాలు కొనసాగనుండగా.. ఆయా సభ్య దేశాల అధినేతల భేటీ మాత్రం 9, 10 తేదీల్లో జరగనుంది. జి – 20 శిఖరాగ్ర సమావేశం జరిగే మూడు రోజులూ ఢిల్లీ పూర్తిగా మూతపడనున్న సంగతి తెలిసిందే. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఢిల్లీ పోలీసులు కనివిని ఎరుగనిరీతిలో ఆంక్షలు విధించనుండటమే ఈ పరిస్థితికి కారణం. ఆంక్షలకు సంబంధించిన కసరత్తును పోలీసులు ఇప్పటికే పూర్తిచేయడంతో పాటు, వివిధ శాఖలకు సమాచారం కూడా అందించారు. విద్యా బోధనకు ఆన్‌లైన్‌ సేవలను ఉపయోగించుకోవాలని సూచిస్తున్న పోలీసులు ఆ సదుపాయం ఉన్నాలేకపోయినా పాఠశాలలను మూసేయాల్సిందేని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. వాణిజ్య సముదాయాలు, మాల్స్‌, మార్కెట్లు, ఇతర కార్యాలయాల కార్యకలాపాలను కూడా ఆ మూడు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించారు. ఏడవ తేదీ అర్ధరాత్రి నుంచి ఆంక్షలు అమల్లోకి రానున్నట్లు ప్రకటించాయి..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు