Friday, November 1, 2024
spot_img

కారులో రూ.2కోట్లు..

తప్పక చదవండి
  • నగరంలో పోలీసుల తనిఖీలు..
  • పెద్ద అంబర్‌పేట్‌లో భారీగా నగదు పట్టివేత
  • ఎన్నికల వేళ భారీగా నగదు స్వాధీనం
  • నాచారంలో కారు డోరులో ఉంచి డబ్బు రవాణా
  • రూ. 3.20 కోట్లు సీజ్ చేసిన పోలీసులు

హైదరాబాద్ : ఎన్నికల వేళ తెలంగాణలో భారీగా నగదు పట్టుబడుతోంది. పోలీసులు, ఎన్నికల అధికారులు జరుపుతున్న తనిఖీల్లో కోట్ల రూపాయల క్యాష్ కనిపిస్తోంది. వాహనాల్లో కట్టలు కట్టల డబ్బును మూటల్లో కట్టి తరలిస్తున్నారు. సరైన పత్రాలు లేకుంటే పోలీసులు ఆ డబ్బుని సీజ్ చేస్తున్నారు. తాజాగా.. పెద్ద అంబర్ పేట్ లో భారీగా నగదును పట్టుకున్నారు పోలీసులు. కారులో తరలిస్తున్న రూ.2కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఆ నగదు ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. భారీ మొత్తంలో డబ్బును తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేసి కారులో తరలిస్తున్న రూ.2కోట్ల నగదును పట్టుకున్నారు.

అటు నాచారం పోలీసు స్టేషన్ పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. చాలా తెలివిగా కారు డోర్‌లో నగదును ఉంచి తరలిస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ కొత్తపేటకు చెందిన బండి సుధీర్‌ రెడ్డి పాత కార్లు విక్రయిస్తుంటారు. అయితే బుధవారం కారులో భువనగిరి వెళ్తుండగా.. నాచారంలో పోలీసులు ఆపి తనిఖీలు చేపట్టారు. కారు ముందు డోర్లు వచ్చినంత సులువుగా వెనుక డోర్లు రాకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. కారు డోర్లు మెుత్తం తెరిచి చూడగా.. రూ.1.20 కోట్ల నగదు బయటపడింది. హబ్సిగూడలోని లక్ష్మారెడ్డి అనే వ్యక్తి దగ్గర నుంచి ఈ డబ్బు తీసుకొస్తున్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు