No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

కొల్తూరులో కోట్ల విలువచేసే భవంతులు

తప్పక చదవండి
  • అనుమతులు బేఖతారు భారీగా ప్రభుత్వ ఖజానాకు గండి
  • స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులకు లక్షల్లో ముడుపులు

శామీర్‌పేట్‌ : సీఎం దత్తత మండలం మూడు చింతలపల్లి కొల్తూరు గ్రామంలో కోట్ల విలువ చేసే భవనాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నా.. ఏమాత్రం పట్టించుకోని అధికారులు నిబంధనలు పాతరేస్తూ అడ్డు అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతున్న..? పట్టించుకోవలసిన పంచాయతీ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు ప్రజా ప్రతినిధులే భాగస్వాములుగా అక్రమ నిర్మాణాలు చేయబడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం హెచ్‌ఎండిఏ టెక్నికల్‌ అనుమతి తీసుకున్న తర్వాతే నిర్మాణాలు కొనసాగించాల్సి ఉంది. కానీ స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులకు భారీగా ముడుపులు చెల్లిస్తూ నిర్మాణదారులు అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారు. నిర్మాణదారులు అధికారులను ప్రసన్నం చేసుకోవడం కారణంగానే గ్రామ పంచాయతీ ఆదాయానికి భారీగా గండి కొడుతూ అక్రమ కట్టడాలు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. గ్రామంలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై గ్రామ పంచాయతీ అధికారి శరత్‌ కుమార్‌ ను వివరంగా కోరగా… రాకముందు నుంచే నిర్మాణాలు కొనసాగుతు న్నాయని నేను విధుల్లో చేరిన తర్వాత నా దృష్టికి వచ్చిన అక్రమ కట్టడాల నిర్మాణదారులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు