కాంగ్రెస్‌ గుండెల్లో గుబులు

0
  • అధినేతకు అందుబాటులో 9మంది ఎమ్మెల్యేలు
  • టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ ఆరంభం
  • పార్టీ మారేందుకు నేతలు రెడీ
  • ఎమ్మెల్సీ బరినుండి తప్పుకోన్ను కాంగ్రెస్‌
  • ఏకగ్రీవం కానున్న ఎమెల్సీ ఎన్నికలు

హైదరాబాద్‌ : ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. అన్ని స్థానాలనూ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదువుతున్న టీఆర్‌ఎస్‌… ఆపరేషన్‌ ఆకర్ష్‌ కు తెరలేపింది. దీంతో పార్టీ మారేందుకు నేతలు రెడీ అవుతున్నారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రిజైన్‌ చేసేందుకు కూడా సిద్ధమంటున్నారు. తెలంగాణలో మళ్లీ ఎలక్షన్‌ హీట్‌ కనిపిస్తోంది. ఓవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు సవిూపిస్తుంటే… ఆపరేషన్‌ ఆకర్ష్‌ కూడా జోరందుకుంది. మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి అన్ని స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది టీఆర్‌ఎస్‌. ఇద్దరు కాంగ్రెసు ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)లో చేరడానికి సిద్ధపడిన నేపథ్యంలో మరింత మంది ఫిరాయింపులకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మరో 9 మంది కాంగ్రెసు శాసనసభ్యులు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర రావుకు టచ్‌ లో ఉన్నట్లు చెబుతున్నారు. లోకసభ ఎన్నికల తర్వాత జరిగే శాసనసభా సమావేశాల నాటికి కాంగ్రెసుకు ప్రతిపక్ష ¬దాను గల్లంతు చేయాలనే వ్యూహంతో కేసీఆర్‌ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నట్లు చెబుతున్నారు. శాసన మండలిలో ఇప్పటికే కాంగ్రెసు ప్రతిపక్ష ¬దాను కోల్పోయింది. డిసెంబర్‌ లో శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెసు ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మండలిలో కాంగ్రెసు ప్రతిపక్ష ¬దాను కోల్పోయింది. ఈ స్థితిలో ఇద్దరు ఎమ్మెల్యేలతోనే ఫిరాయింపులు ఆగిపోవని అంటున్నారు. రేగా కాంతారావు, ఆత్రం సక్కు టీఆర్‌ఎస్‌ లో చేరాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. నిరుడు డిసెంబర్‌ 7వ తేదీన ఫలితాలు వెలువడిన తర్వాత కేసీఆర్‌ ఆసక్తికరమైన ప్రకటన ఒకటి చేశారు. మహా కూటమి ఓటమితో కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఆందోళనలో ఉన్నారని, వారిలో పలువురు టీఆర్‌ఎస్‌ లో చేరడానికి సిద్ధపడుతున్నారని, వారు తనను సంప్రదిస్తున్నారని కేసీఆర్‌ విూడియా సమావేశంలో చెప్పారు. అయితే వారి పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ నుంచి ఐదుగురు, దక్షిణ తెలంగాణ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. టీఆర్‌ఎస్‌ లో చేరిన వెంటనే ఓ మహిళా శాసనసభ్యురాలికి మంత్రి పదవి ఇవ్వడానికి కూడా కేసీఆర్‌ సిద్ధపడినట్లు చెబుతున్నారు. పార్టీ మారేందుకు రెడీగా ఉన్న నేతలను కారెక్కించేస్తోంది. టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు.. అధికార పార్టీలో చేరేందుకు రెడీ అంటూ ప్రకటనలు చేసేస్తున్నారు. దీంతో.. మండలి ఎన్నికల నాటికి ఎవరు ఏపార్టీలో ఉంటారు. ఎవరు ఎవరికి ఓటేస్తారనే విషయం అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అయితే… ఎన్నికల నాటికి కాంగ్రెస్‌కు దూరమయ్యే ఎమ్మెల్యేల సంఖ్యపై పూర్తి క్లారిటీ వస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు… త్వరలోనే అంటే… పార్లమెంట్‌ ఎన్నికల నాటికి నేతలు గులాబీ గూటికి చేరడం పూర్తవుతుందని పొలిటికల్‌ సర్కిల్‌లో టాక్‌ వినిపిస్తోంది. అవసరమైతే.. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి.. తిరిగి అధికార పార్టీ నుంచి శాసన సభకు పోటీ చేసేందుకు సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ఈసారి ఎవరికీ అవకాశం ఇవ్వొద్దని టీఆర్‌ఎస్‌ అధినేత భావిస్తున్నారు. అందులో భాగంగానే… కారెక్కేందుకు సిద్ధమవుతున్న నేతలు… పార్టీ పదవులతో పాటు… ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తామని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రేగా కాంతారావ్‌, ఆత్రం సక్కు కూడా ఇదే తరహా ప్రకటన చేశారు. టీడీపీ ఎమ్మెల్యే కూడా అవసరమైతే ఎమ్మెల్యే పదవికి గుడ్‌ బై చెప్పేందుకు రెడీ అని ప్రకటించారు. దీంతో.. కేసీఆర్‌ నిర్ణయం మేరకే… టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రెడీగా ఉన్న ఎమ్మెల్యేలు.. ఉప ఎన్నికలు ఎదుర్కొనేందుకు కూడా సిద్ధపడుతున్నారనే వాదన వినిపిస్తోంది. ఇక.. పార్లమెంట్‌ ఎన్నికల నాటికి.. కనీసం 8నుంచి 10మంది ఎమ్మెల్యేలు కారెక్కే అవకాశం ఉందనే చర్చ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్‌ ఉంటుందా?

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్‌ పార్టీ నిలువడం అనుమానంగా మారింది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నిక కావడానికి 21 మంది ఎమ్మెల్యేల బలం కావాల్సి ఉన్నది. కాంగ్రెస్‌ తరఫున 19 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను కలుపుకొంటే తమకు సంఖ్యాబలం సరిపోతుందని కాంగ్రెస్‌ భావించింది. కానీ ఆ పార్టీకి చెందిన ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు సీఎం కేసీఆర్‌ పనితీరుకు ఫిదా అయ్యారు. వీరిద్దరూ టీఆర్‌ఎస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. అవసరమైతే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తామని వారు ఇప్పటికే ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌ బలం 19 నుంచి 17కు పడిపోయింది. మరోవైపు టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమకే మద్దతు ఇస్తారన్న ఆశలపైనా నీళ్లు చల్లినట్టయింది. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్‌ఎస్‌లో చేరుతానని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ముగ్గురు ఎమ్మెల్యేల లోటు ఏర్పడింది. 21 మంది ఎమ్మెల్యేల బలం ఉందన్న నమ్మకంతో కాంగ్రెస్‌.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవికి అభ్యర్థిని బరిలో నిలిపింది. కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్సీ పదవికి గూడూరు నారాయణరెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో మ్యాజిక్‌ ఫిగర్‌కు ముగ్గురు తగ్గడంతో ఆయన బరిలో ఉంటారా? తప్పుకుంటారా? అనే అయోమయం నెలకొంది. సంఖ్యాబలం లేకుండా పోటీచేయడం మంచిది కాదని చాలా మంది కాంగ్రెస్‌ నేతలు సూచిస్తున్నారు. ఇలా పోటీచేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని సీఎల్పీ సమావేశంలో నేరుగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గూడూరు నారాయణరెడ్డి ఎమ్మెల్సీ బరిలో నుంచి తప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. నేటితో ముగయనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. అప్పటి లోపే కాంగ్రెస్‌.. పోటీ నుంచి తప్పుకుంటే టీఆర్‌ఎస్‌ నుంచి నలుగురు, ఎంఐఎం నుంచి ఒకరు చొప్పున ఎమ్మెల్యే కోటా కింద మొత్తం ఐదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా గెలుస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here