సీఎం మమతకు భయం

0

కోల్‌కతా : ప్రజలు భాజపాను ఆదరిస్తున్న తీరు చూసి పశ్చిమ్‌ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి భయం పట్టుకుందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. లోక్‌సభ ఎన్నికలు సవిూపిస్తున్న నేపథ్యంలో ఆయన పశ్చిమ్‌ బంగాలో వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. మాత్వా షెడ్యూలు కులాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు బిజెపివైపు ఉండడం చూసి తట్టుకోలేకే మమత హింసకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మమత, ఆమె పార్టీ కార్యకర్తలు అమాయక ప్రజలను చంపుతూ హింసకు ఎందుకు పాల్పడుతున్నారో అర్థం అయ్యిందన్నారు. ప్రజల ప్రేమ మా వైపుంది కాబట్టేనని వ్యాఖ్యానించారు. శుక్రవారం బ్జడెట్‌లో రైతుల కోసం తీసుకున్న నిర్ణయాల్ని చారిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించారు. స్వాతంత్యం సిద్ధించి దశాబ్దాలు గడచినా, గత ప్రభుత్వాల చేతిలో శ్రామిక, మధ్యతరగతి ప్రజలు నిర్లక్ష్యానికి గురయ్యారని ఆయన ఆరోపించారు. బ్జడెట్‌తో తాము ప్రకటించిన కేటాయింపులు 12కోట్ల మంది సన్నకారు రైతులకు లాభం చేకూర్చనుందని ఆకాంక్షించారు. 30నుంచి 40కోట్ల మంది శ్రామికులకు, మూడు కోట్ల మధ్య తరగతి ప్రజలకు ప్రస్తుత కేటాయింపులతో లబ్ది పొందనున్నారని వివరించారు. సభా ప్రాంగణంలో గందరగోళ వాతావరణం నెలకొనటంతో 14నిమిషాల్లో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ సందర్భంగా ఠాకూర్‌నగర్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. మమతాబెనర్జీ ప్రభుత్వంలో గ్రావిూణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మోదీ దుయ్యబట్టారు. అనంతరం కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లు గురించి మాట్లాడుతూ.. ‘పొరుగు దేశాల్లో ఉంటున్న హిందవులు, సిక్కులు, పార్శీలు, కైస్త్రవులు అక్కడ ఎన్నో బాధలు అనుభవించారు. ఎక్కడకు వెళ్లాలో తెలియక భారత్‌కు వచ్చారు. అలాంటి వారికి ఆపన్నహస్తం అందించేందుకు పౌరసత్వ బిల్లును తీసుకొచ్చాం. పార్లమెంట్‌లో ఈ బిల్లుకు మద్దతివ్వండి. ఇక్కడున్న నా సోదరసోదరీమణులకు ఈ బిల్లు ఎంతో అవసరం’ అని ప్రధాని మోదీ తృణమూల్‌ పార్టీని కోరారు. చాలా ఏళ్ల పాటు రైతులు, కార్మికులు, మధ్యతరగతి ప్రజలు నిర్లక్ష్యానికి గురయ్యారు. వారి సంక్షేమం కోసం బడ్జెట్‌లో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో రైతులు, యువత కోసం అనేక పథకాలు తీసుకొస్తాం’ అని మోదీ చెప్పుకొచ్చారు.

మోడీ పోస్టర్లను చించేసిన తృణమూల్‌ కార్యకర్తలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పశ్చిమ్‌బంగాలో పర్యటన సందర్భంగా పశ్చిమ బుర్ద్వాన్‌ జిల్లాలో భాజపా కార్యకర్తలు మోదీ పర్యటనపై పోస్టర్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ పోస్టర్లను చించేసి వాటి స్థానంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతల పోస్టర్లను పెట్టడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ‘మా కార్యకర్తలను తృణమూల్‌ కార్యకర్తలు బెదిరించారు. ప్రధాని మోదీ పోస్టర్లను చించేసి తృణమూల్‌ నేతల పోస్టర్లు అంటించారు. మా కార్యకర్తలపైనా దాడి చేశారు. ఈ ఘటనలో కొందరు గాయపడ్డారు’ అని భాజపా రాష్ట్ర జనరల్‌ సెక్రటకీ శయంతన్‌ బసు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను తృణమూల్‌ పార్టీ తోసిపుచ్చింది. తాము పోస్టర్లను చించలేదని, భాజపా నేతలే ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పోస్టర్లపై నల్ల రంగు వేశారని స్థానిక పార్టీ నేతలు ఆరోపించారు. అందుకే తాము వారితో ఘర్షణకు దిగినట్లు తెలిపారు. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here