Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

యూరియా కోసం బారులు తీరిన రైతులు.

మహబూబాబాద్(ఆదాబ్ హైదరాబాద్).మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేద్రంలోని స్థానిక సొసైటీలో మంగళవారం యూరియా కోసం మండలంలో ఉన్న రైతులంతా వానను లెక్కచేయకుండా లైన్లో నిలబడి యూరియా కోసం నానా తంటాలు పడుతూ ఉన్నారు. ఉదయం 6 గంటల నుండి వివిధ గ్రామాల నుండి రైతులు సొసైటీ దగ్గరకు చేరుకొని యూరియా కోసం చిట్టీలు దొరకక చాలా మంది రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు యూరియా కొరత లేదని చెప్పుతున్న కూడా  మండల కేంద్రంలో రైతులను చూసినట్లయితే పోలీసుల సెక్యూరిటీ ఉన్న కూడా రైతులు యూరియా కోసం సొసైటీల దగ్గర చాలా ఇబ్బందులు పడుతున్నారు తప్ప యూరియా మాత్రం సరైన సమయంలో దొరకడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. . ఇప్పటికైనా తక్షణమే రైతులను దృష్టిలో ఉంచుకొని రైతులకు సకాలంలో యూరియా అందరికి అందేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close