ప్రచారంలో ఫేక్‌ ఫోటో…

0

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఫోటో ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అయితే ఆయన సజీవంగా ఉన్న కాలంలో ఇంకా ఫొటోగ్రఫీ వెలుగు చూడలేదు. అయినా నకి’లీలలు’ కలియుగంలో రాజ్యామేలుతాయని బ్రహ్మంగారు చెప్పారు. అయితే ఆయనను ఓ ఫోటో తీసినట్లు స్వార్ధపరులు కొందరు ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం కల్పించారు. దీంతో హఠాత్తుగా ఆయన సజీవంగా ఉన్న సమయంలో ‘నకిలీ ఫొటో’ పట్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది శ్రీశైలంలోని ఓక యేగిది ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ వివరాలు సంపాదించగలిగింది.

ఇదీ తైలవర్ణ చిత్రం: ‘శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధి పొందే సమయానికి ‘ఎలా ఉండవచ్చు..?’ అని ఊహించి, శ్రీ బ్రహ్మంగారి అర్చకులు శాస్త్ర ప్రకారం చిత్రీకరించిన కళా సృష్టి ఆదరణ పొందింది. పాములపర్తి సంగయ్యచారి ఆధ్వర్యంలో ఈ చిత్రీకరణ కొనసాగింది. దీనిని చిత్రీకరించడానికి పది నెలల సమయం పట్టింది. బ్రహ్మంగారి మఠంతో పాటు రాష్ట్ర, దేశ, విదేశాల్లో ఆదరణతో పూజలందుకుంటున్న చిత్రపటం ఇదే. బ్రహ్మంగారి నాలుగోతరం వారసుల ఫోటోలు ఇప్పటికీ మఠంలో భద్రపరిచి ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో పర్యటన: దేశాటనలో భాగంగా ఆయన ముందుగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించకున్నారు .రాజమండ్రి, వరంగల్‌, హైదరాబాదు నగరాలలో ఆయన పర్యటించారు.

ఇదే నివాసం: కడపజిల్లా, కందిమల్లాయపల్లిలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తన చివరి జీవితం నిరాడంబరంగా గడిపారు. అక్కడే ఆయన జీవసమాధి పొందారు. నాడు ఇదో పెద్ద సంచలనం. భక్తులు బారులు తీరి ఆయన దర్శనం కోసం వేచిచూశారు. ఇప్పటికీ కందిమల్లాయపల్లిలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివసించిన ఇల్లు ఉంది. ఆ ఇంటిని బ్రహ్మాంగారి మఠం సంబంధీకుల సంరక్షణలో ఉంది. ఆ ఇంటి పరిసరాల్లోనే బ్రహ్మంగారి స్వయంగా 80అడుగుల బావి తవ్వినది ఇంకా ఉంది. పొలేరమ్మను నిప్పు వెలుగించిన గృహం కూడా ఉంది అక్కడే బ్రహ్మంగారు నిత్య పూజలు చేసేవారు. ఇప్పటికీ అక్కడ పూజలు జరుగుతున్నాయి.

పాదముద్రికలు.. అనుమానాస్పదం:

జీవసమాధి పక్కనే ఉన్న పాదముద్రికల విషయంలో అనేక అనుమానాలున్నాయి. ఈ పాదముద్రికలు 1969 తరువాత ఏర్పాటు కావడం జరిగింది. స్వతహాగా బ్రహ్మంగారి జీవితంలో ఎలాంటి మిస్టరీ లేదు…అంతా బహిరంగమే. ఆయన జీవన పయనం అంతా పద్ధతి ప్రకారం ఉన్నదే. సమయం, సందర్భం, మిగిలిన తీపిగుర్తులు అన్నీ నేటికీ ఉన్నాయి. నాడు బ్రహ్మంగారు వెలిగించిన ఆ ప్రమిదల్లోనే… నేడు ఆయన సమాధి వద్ద నేటికీ వెలుగుతున్నాయి. తేడా ఏమిటంటే.. అయితే నాడు ఆయన నీటితో వెలిగించగా… నేడు నూనెతో వెలిగిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here