ఇవిఎంల ట్యాంపరింగ్‌ అసాధ్యం

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

బ్యాలెట్‌ పేపర్‌తో ఎన్నికల నిర్వహించడం అసాధ్యమని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా తేల్చి చెప్పారు. ఇవిఎంలను టాంపర్‌ చేయడం సాధ్యమయ్యే పనికాదని ఆయన స్పష్టం చేశారు. ఇవిఎం లను రాజకీయ పార్టీలు ఫుట్‌ బాడ్‌ మాదిరి భావించడం తమను ఆవేదనకు గురి చేసిందని ఆయన పేర్కొన్నారు. ఇవిఎంలలో తలెత్తే సమస్యలను ఈమధ్య ఎన్నికలలో బాగా తగ్గించామని ఆయన వెల్లడించారు. ఇవిఎంలలో లోపం, ఇవిఎంల టాంపర్‌ రెండు వేర్వేరు అంశాలుగా గుర్తించాలని ఆయన సూచించారు. ఇవిఎం అనేది రికార్డింగ్‌ చేసే యంత్రం మాత్రమేనని, వాటిని ప్రోగ్రామింగ్‌ చేయలేమని ఆయన తెలిపారు. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఫలితాలు వస్తే సరైనవని, ప్రతికూల ఫలితాలు వస్తే ఇవిఎంల విూద నెపం నెట్టేయడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. ఎన్నికల సంఘం విూద విమర్శలు చేసే హక్కు రాజకీయ పార్టీలకు ఉంటుందని, అయితే ఇవిఎంలను తప్పు బట్టడం మంచి పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here