తుగ్లక్‌ పాలనకు నిదర్శనం కేసీఆర్‌

0
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించారనే ఉద్యోగులపై కక్ష
  • కేంద్రంలో మళ్లీ ప్రధాని మోడీనే
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

హైదరాబాద్‌ : కేసీఆర్‌ గారడి మాటలతో ఉద్యోగులను మోసం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ఉద్యోగుల వల్లే అవినీతి పెరుగుతోందని కేసీఆర్‌ భావిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించారని కేసీఆర్‌ ఉద్యోగులపైకక్ష సాధిస్తున్నారని విమర్శించారు. 34శాతం రిజర్వేషన్లు కల్పించకుండా కేసీఆర్‌ బీసీలను మోసం చేశారని ఆరోపించారు. జితేందర్‌రెడ్డి లాంటి నేతలు టీఆర్‌ఎస్‌ను వీడారంటే.. ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్ధమవుతోందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పగటికలలు కంటున్నారని విమర్శించారు. తెరాస ఎంపీలు కేంద్రంలో మంత్రులు అవుతారని చెబుతున్నారని దుయ్యబట్టారు. మోడీ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసానికి సిద్ధమని సవాల్‌ విసిరానని.. దానికి తెరాస స్పందనలేదని విమర్శించారు. తెరాస నేతల్లో అంతర్మథనం ప్రారంభమైందన్నారు. తెలంగాణలో ల్యాండ్‌ మాఫియా పెరిగిపోయిందని ప్రశ్నిస్తే ఎదురు దాడి చేస్తున్నారని ఆక్షేపించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఆదరబాదరగా వెళ్తున్నారని.. తుగ్లక్‌ మాదిరిగా కేసీఆర్‌ వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. 34శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 23శాతానికి తగ్గించి.. ఇంకా తగ్గించాలని చూస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కార్యవర్గ సమావేశాలు జరిపి స్థానిక సంస్థల అభ్యర్థులను ఎన్నుకుంటామని లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. రేపు పదాధికారులు, జిల్లా ఇన్‌ఛార్జీల సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ఇందులో ఎన్నికలపై చర్చిస్తామని లక్ష్మణ్‌ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here