అంతా రహస్యమే…

0

ప్రతి పని రహస్యమే అవుతుందీ.. ఎప్పుడు ఏలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎప్పుడు ఏమి మాట్లాడుతాడో తెలియకుండా పోయిందీ. గతంలో సన్నిహితుల దగ్గర పార్టీ కార్యక్రమాలు.. నాయకుల పనితీరుపై చర్చించే అధినేత ఇప్పుడు పక్కవారితో, తనకు దగ్గరగా ఉన్న వారితో కూడా ఏలాంటి చర్చలు, సంప్రదింపులు జరపడం లేదని తెలుస్తోంది. మాట వచ్చేవరకు, పని చేసే వరకు తనకు తప్ప మిగతా వారికి ఎవ్వరికి ఒక్క విషయం కూడా తెలియకుండా చేస్తున్నారని వినికిడి. రెండవసారి అధికారంలోకి వచ్చిన తెరాస పార్టీ రెండు నెలలు గడిచినా కూడా ఇప్పటికి కేబినెట్‌ నియామకమే జరపలేదు.. అధినేత కనుసన్నల్లోనే అంతా ఉందని, ఆయన తీసుకునే నిర్ణయాల కోసమే అందరూ ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన మనసులో ఏముందో ఎవరికి అవకాశం కల్పిస్తారో, ఎవరిని ఎక్కడ పెడుతారో తెలియక సతమతమయ్యేవారే ఎక్కువగా ఉన్నారు… అధినేత మనసులో ఉన్న ఆలోచనల గురించి, ఆయన మాటల గురించి ఎంత తటాపటాయించినా ముక్క అర్థం కావడం లేదు… తాను అనుకునే పని అయ్యేంత వరకు ఎవరికి చెప్పకుండా, ఎవరితో చర్చించకుండా ఉంటున్నారని సన్నిహితులు అంటున్నారు… అధినేత మనసులో ఏముందో, ఎవ్వరికి స్థానం ఏలా ఉందో తెలియక అయోమయంలో ఉంటున్నారు పార్టీనాయకులు.. శాసనసభ సభ్యులు..

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

బంగారు తెలంగాణ సాధనలో కీలక పాత్ర వహించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధికారంలోకి రాకముందు, వచ్చాక కూడా ఎన్నో సలహాలు, సూచనలు వినేవారు, చెప్పేవారు. అభ్యర్థుల పనితీరుపై, వారి నడవడికపై కూడా స్పందించేవారు. పార్టీ బలోపేతమే ప్రధానంగా ఉంటున్న కెసిఆర్‌ రెండవసారి అధికారంలోకి వచ్చాక మాత్రం పార్టీ విశేషాలు, పాలనకు సంబంధించిన అంశాలు కూడా ఎవ్వరికి చెప్పడం లేదని తెలుస్తోంది. సన్నిహితులను, స్నేహితులను కూడా కొన్ని విషయాలపై దూరంగా ఉంచుతున్నట్లు సీనియర్‌ అధికారులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన సంగతులు ఎలా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌లో ఉండే మంచి గుణాన్ని పలువురు చెబుతుంటారు.మనిషి భోళాగా ఉంటారని, నమ్మిన వారి దగ్గర ప్రైవేట్‌ విషయాల్ని సైతం మనసువిప్పి మాట్లాడుతారనే అందరూ అనుకుంటు ఉంటారు. తన ఆలోచనల్ని, తన చేపట్టేబోయే పని, పథకాల వివరాల గూర్చి తను అనుకునే వారి దగ్గర చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని పేరుంది. మనిషి మాట తీరు కఠినంగా ఉన్నా ఆయన ఆలోచనలు, పనులు మాత్రం అందరిని ఆకట్టుకునేలా ఉంటాయని చెప్పుకుంటారు. వివిధ ఆంశాలపై చర్చలకోసం పలువురిని కలిసి ముందుకు పోతారని, అందరిని ఆట్టుకునేలా కలుస్తూ ఉంటారని అంటున్నారు. ముందు పార్టీ భవిష్యత్తు, నాయకుల పనితీరుపై సన్నిహితుల దగ్గర కొన్ని విషయాల్ని చర్చించి, తాను చేయాలనుకుంటున్న అంశాల్ని ప్రస్తావిస్తుంటారు. ఇక తన సన్నిహితుల దగ్గర ఐతే ఆయన ఎప్పుడూ ఓపెన్‌గానే ఉంటారని చెబుతుంటారు. కొన్ని కీలక నిర్ణయాలతో పాటు, వ్యూహాల్ని ఆయన బయటపెట్టరు కాని అంతర్గత సంభాషణల్లో మాత్రం దాదాపుగా అన్ని విషయాల్ని తన సన్నిహితులతో చర్చిస్తూ ఉంటారు కెసిఆర్‌. అలాంటి ముఖ్యమంత్రిలో ఇప్పుడు అనుకోకుండా మార్పు కొట్టచ్చినట్లుగా కనిపిస్తోందని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి కెసిఆర్‌లో మార్పు స్పష్టంగా తెలుస్తోందన్న మాట పలువురి సన్నిహితుల వద్ద, పార్టీ సీనియర్‌ నాయకుల నోట వినిపిస్తోంది. గతానికి భిన్నంగా ఆయన పనితీరు, ఆలోచన తీరు ఉందని పలువురు అంటున్నారు. అందరిని అప్యాయంగా కలుస్తున్నా, నాయకులతో మామూలుగా మాట్లాడుతున్నా గతంలో మాదిరి విషయాల్ని చెప్పేందుకు ఆయన పెద్దగా ఆసక్తి చూపడం లేదని పార్టీ నాయకులు అంటున్నారు.

ఆలోచనలు బయటపెట్టని ఆధినేత..

పార్టీ నాయకులతో, సన్నిహితులతో నిత్యం ఏదో అంశాలపై చర్చిస్తూ ఉండే కెసిఆర్‌ ఇప్పుడు అంతా రహస్యంగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో కెసిఆర్‌ నిర్ణయాలు చాలా ఆసక్తికంగా ఉంటున్నాయి. ఎమ్మెల్యెల ప్రమాణ స్వీకారం, మంత్రి వర్గ ఏర్పాటుతో పాటు చాలా అంశాల్లో ఆయన తన మనసులోని ఆలోచనల్ని అస్సలు బయటపెట్టడం లేదు. కెబినేట్‌ ఏర్పాటు రేపు, మాపు అంటూ కసరత్తుల మీద కసరత్తులు చేస్తున్నారు కాని అందులో ఎవరికి స్థానం ఉంటుందో, అనేది తెలియకుండా ఉంది. గతంలో మంత్రులుగా పనిచేసిన వారిలో నలుగురైదుగురు మినహా మిగతా వారందరూ మళ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. వారిలో ఎంతమందికి స్థానం లభిస్తుందో, ఎంతమందిని దూరం పెడుతారనే విషయాలపై ఎవ్వరితో చర్చించకుండా అన్ని తానై నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. తను నమ్మకంగా ఉన్న సన్నిహితులు, సీనియర్‌ నాయకుల వద్ద కూడా ఎవరికి ఈ సారి మంత్రిగా అవకాశం కల్పిస్తుందో కూడా తెలియడం లేదు. గతంలో ఎప్పుడూ లేనంతగా పాలనకు సంబంధించిన పలు విషయాల్ని రహస్యంగా ఉంచుతున్నారనే మాట పలువురి నాయకులు నోటి వెంట వినిపిస్తోంది. సీనియర్‌ పాత్రికేయులతో పాటు కీలక అధికారులతో, తనకు తెలంగాణ ఉద్యమం నుంచి సన్నిహితంగా ఉండే నాయకులతో తానేం చేయబోతున్న, ఏం చేయాలనుకుంటున్న విషయాన్ని మాత్రం మాట వరుసకు కూడా బయటకు చెప్పడం లేదంటున్నారు. ఈ అలవాటు కెసిఆర్‌కు గతంలో లేదని, ఇప్పుడున్న కెసిఆర్‌కు గతంలో ఉన్న కెసిఆర్‌కు చాలా మధ్య తేడా కొట్టచినట్లుగా కనిపిస్తోంది. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో తాను కేంద్రంలోకి వెళ్లి అన్ని అనుకున్నట్లుగా జరిగితే కెటిఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయాలనే ఆలోచనలో కెసిఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఎవరూ ఏలాంటి వారో తెలియక, ఎవరిని ఎప్పుడు నమ్మాలో అర్థంకాకనే తాను తీసుకునే నిర్ణయాలు ఎవ్వరికి చెప్పడం లేదని తెలుస్తోంది. ప్రతిపక్షంతో ఏలాంటి ఇబ్బంది లేకున్నా తన పార్టీలోనే కొంత ఆసమ్మతి చెలరేగే అవకాశాలు ఉండడంతో అందరిని అంత ఈజీగా నమ్ముకపోవడమే మంచిదనే అభిప్రాయంలో ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో సీనియర్లు అనుకునే వారందరిని తనతో తీసుకుపోవాలనే ఆలోచనలో ఉన్నట్లు, అందుకు ఎవరెవరితో సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయో తన స్వతహాగా అంచనా వేస్తున్నారని సీనియర్లు అంటున్నారు. రాజకీయం అంటేనే ఎవరిని అతిగా నమ్మలేని అందులో మనవారెవరో, పరాయి వారెవరో అంత ఈజీగా అర్థంకాదనే నానుడిని కెసిఆర్‌ పాటిస్తున్నట్లు చెపుతున్నారు. రెండవసారి విజయం సాధించి, అధికారంలోకి వచ్చాక అచి తూచి అడుగేయడమే మంచిదనే అభిప్రాయంలో అధినేత ఉన్నారని తెలుస్తోంది. తను ఊహించినట్లు కేంద్రంలో తన అనుకున్న పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు ఏలాంటి సమస్య ఉండదని, అప్పుడు కెసిఆర్‌ అనుకున్న పనులన్నీ ఈజీగా చేసుకోవచ్చంటున్నారు. ఒక వేళ కేంద్రంలో అంచనాలు తారుమారైతే తప్ప అప్పుడు రాష్ట్రంలో పెద్ద మార్పులేమి ఉండకపోవచ్చని, ఎందుకైనా మంచిదే పార్లమెంట్‌ ఎన్నికలు పూర్తయ్యే వరకు కొన్ని విషయాలపై, కొన్ని అంశాలపై రహస్యంగా ఉండడమే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని చెపుతున్నారు. అందుకే కెసిఆర్‌ ఎప్పుడు ఏలా నిర్ణయాలు తీసుకుంటారో అని పార్టీ నాయకులు టెన్షన్‌ పడుతున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here