ఎవ్వెరి డాగ్‌ హ్యాజ్‌ ఏ డే!

0

2017 లో ప్రపంచసుందరిగా కిరీటం గెలుచుకుంది మానుషి చిల్లర్‌. అప్పటి నుంచి ఈ అమ్మడు బాలీవుడ్‌ ఎంట్రీ గురించి ఎంతగానో తహతహలాడింది. కానీ ఇప్పటివరకూ అవకాశం దక్కించుకోవడంలో విఫలమైంది. ఎవ్వెరి డాగ్‌ హ్యాజ్‌ ఏ డే! దేనికైనా టైమ్‌ రావాలని అంటారు. ఆ టైమ్‌ ఇప్పటికి వచ్చింది. మిస్టర్‌ పెర్ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌.. కింగ్‌ ఖాన్‌ షారూక్‌.. సల్మాన్‌.. రణవీర్‌ లాంటి హీరోల సరసన నటించాలనుందని బహిరంగంగానే ప్రకటించిన మానుషికి ఎట్టకేలకు ఎదురు చూపులు ఫలించి జాక్‌ పాట్‌ తగిలింది. అది కూడా యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ లాంటి ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థలో తెరకెక్కనున్న భారీ హిస్టారికల్‌ చిత్రంలో ఈ అమ్మడు అవకాశం దక్కించుకోవడంపై చర్చ సాగుతోంది. భారతదేశ రారాజు ప థ్వీరాజ్‌ చౌహన్‌ బయోపిక్‌ లో ఊహించని విధంగా మానుషికి ఈ ఛాన్స్‌ దక్కింది. కిలాడీ అక్షయ్‌ కుమార్‌ ఈ చిత్రంలో టైటిల్‌ పాత్రను పోషిస్తున్నారు. రాణి సంయుక్త పాత్రలో మానుషి నటించనుందని సమాచారం.హిస్టారికల్‌ బ్యాక్‌ డ్రాప్‌ ఈ సినిమాకి ఎగ్జయిటింగ్‌ పాయింట్‌. పింజర్‌.. మొహళ్ల అస్సీ లాంటి భారీ చిత్రాల్ని తెరకెక్కించిన చంద్రప్రకాష్‌ ద్వివేది ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఏడాది చివర్లో సినిమా ప్రారంభం కానుంది. భారీ బడ్జెట్‌ తో ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. మానుషి గురించి ఆదిత్య చోప్రా మాట్లాడుతూ.. అక్షయ్‌ సరసన సంయుక్త పాత్రలో తను నటిస్తుంది. మానుషిలో చక్కని స్క్రీన్‌ ప్రెజెన్స్‌ ఉంది. అందుకే ఎంపిక చేసుకున్నాం అని ప్రకటించారు. అయితే రెండేళ్లుగా మానుషి బాలీవుడ్‌ ఛాన్సుల కోసం ఎంతగానో వేచి చూసిన సంగతి తెలిసిందే. తనలానే ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న సుశ్మితాసేన్‌.. ఐశ్వర్యారాయ్‌ ఇండస్ట్రీలో వేగంగా అవకాశాలు అందుకుని స్టార్లుగా అవతరించారు. అయితే మానుషికి మాత్రం ఆ ఛాన్స్‌ రావడానికి ఇంత సమయం పట్టింది. ఈ గ్యాప్‌ లో వరల్డ్‌ టూర్‌ .. సామాజిక సేవలు.. బ్రాండ్‌ ప్రమోషన్లు అంటూ మానుషి చాలానే వ్యాపకాలతో బిజీ అయిపోయింది. పనిలో పనిగా నిరంతర ఫోటోషూట్లతోనూ సామాజిక మాధ్యమాల్లో టచ్‌ లో ఉంది. ఎట్టకేలకు జాక్‌ పాట్‌ కొట్టింది కాబట్టి తనని తాను నిరూపించుకుని ఒక స్టార్‌ గా ఎదిగేస్తుందేమో చూడాలి. ఎందరో డెబ్యూ నాయికలకు అవకాశాలిచ్చిన యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్లెస్సింగ్స్‌ ఈ విశ్వసుందరికి ఏమేరకు కలిసొస్తాయో జస్ట్‌ వెయిట్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here