మొదలైన ప్రపంచ కప్‌ క్రికెట్‌

0

తొలి పోటీలో తలపడ్డ ఇంగ్లండ్‌-ఆస్టేల్రియా

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌

నిర్ణీత ఓవర్లలో 311 పరగుల భారీ స్కోరు సాధించిన ఇంగ్లండ్‌

స్పిన్‌తో మొదలు పెట్టిన దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ రికార్డు

లండన్‌ : ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రపంచకప్‌ ప్రారంభమైంది. ఆతిథ్య ఇంగ్లండ్‌-దక్షిణాఫ్రికా మధ్య తొలి మ్యాచ్‌ మొదలయ్యింది. టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా ఇంగ్లండ్‌కు బ్యాటింగ్‌ అప్పగించింది. ప్రారంభ మ్యాచ్‌లో తొలి ఓవర్‌ వేసేందుకు బంతి అందుకున్న వెంటనే దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ రికార్డులకెక్కాడు. ప్రపంచకప్‌లో తొలి ఓవర్‌ వేసిన తొలి స్పిన్నర్‌గా అత్యంత అరుదైన రికార్డును అందుకున్నాడు. 1975 నుంచి గత ప్రపంచకప్‌ వరకు తొలి ఓవర్‌ ఎప్పుడూ స్పిన్‌తో ప్రారంభం కాలేదు. తొలిసారి ఇప్పుడు తాహిర్‌ ఆ రికార్డును అందుకున్నాడు. టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ బంతిని తాహిర్‌కు అందించాడు. కెప్టెన్‌ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ తాహిర్‌ తాను వేసిన రెండో బంతికే ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టోను గోల్డెన్‌ డకౌట్‌ చేశాడు. ఇప్పటి వరకు ప్రతీ ప్రపంచకప్‌ పేస్‌ బౌలింగ్‌తో ప్రారంభం కాగా, ఈసారి స్పిన్నర్‌తో ప్రారంభమైంది. తాహిర్‌ ఈ అరుదైన రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. ఇకపోతే ప్రపంచకప్‌లో భాగంగా లండన్‌లోని కెన్నింగ్టన్‌ ఓవల్‌ మైదానం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 311 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో ఇంగ్లాడ్‌, దక్షిణాఫ్రికా జట్టుకు 312 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ కు దిగిన ఇంగ్లాండ్‌ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో (0) డకౌట్‌ గా వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన జో రూట్‌ (50), మరో ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (54) రెండో వికెట్‌కి 106 పరుగుల భాగస్వామ్యంతో జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు. ఆ తర్వాత కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (57), ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ (89)లు రాణించారు. సఫారీ జట్టులో లుంగి ఎంగిడి 3, ఇమ్రాన్‌ తాహిర్‌, రబాడ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here