Featuredస్టేట్ న్యూస్

ఈఎస్‌ఐ మందుల కొనుగోలు కుంభకోణం 4 ఏళ్ళలో వేయి కోట్లు..!

– వెలుగులోకి కీలక అంశాలు!

– 6 నెలల ‘ఆదాబ్‌’ పరిశోధన సక్సెస్‌

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

తెలంగాణలో సంచలనం సృష్టించిన కార్మిక వైద్య బీమా సేవల సంస్థ (ఈఎస్‌ఐ) మందుల కొనుగోలు కుంభకోణాన్ని గత ఆరు నెలలుగా ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ పరిశోధించి అనేక కథనాలు ప్రచురించింది. దీంతో విజిలెన్స్‌ విచారణతో మొదలై అవినీతి నిరోధక శాఖకు అంచెలంచెలుగా చేరింది. పందుల్లా మేసిన ఈ మందుల కుంభకోణంలో

రోజుకో కొత్త కోణం బయటపడుతోంది. ఆ విభాగం అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది, కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు కలిసి భారీగా అందినకాడికి దండుకున్నట్లు… కాదు దోచుకున్నట్లు అనిశా అధికారులు గుర్తించారు.

ఇలా వేయి కోట్లు మేశారు:

తెరవెనుక రాజకీయులు.. తెరవిూద ఉద్యోగులు… మధ్యలో ఓ పాతబడ్డ పాత్రికేయుడు.. వెరసి

ఏడాదికి రూ.250 కోట్లు చొప్పున నాలుగేళ్లలో దాదాపు రూ. వెయ్యి కోట్ల మేర ఔషధాల కొనుగోళ్లు జరిగినట్లు అధికారుల విచారణలో తేలింది. ఈఎస్‌ఐ కుంభకోణంలో అవినీతి నిరోధక శాఖ అధికారుల దర్యాప్తులో మరో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. గడిచిన నాలుగేళ్ళలో రూ. 1000 కోట్ల మేర మందుల కొనుగోళ్లు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఏటా సుమారు రూ. 250కోట్ల మందులు కొనుగోలు చేసినట్లుగా ఆధారాలను సేకరించారు.

70 డిస్పెన్సరీలు:

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70 డిస్పెన్సరీల వద్ద తనిఖీలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ కుంభకోణం దర్యాప్తులో భాగంగా.. పలు మెడికల్‌ ఏజెన్సీ కార్యాలయాల్లో కూడా ఇప్పటికీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ స్కాంలో మొత్తం 8 మందిని అరెస్టు చేయగా, పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఓమ్ని ‘నాగ’రాజు:

ఇక దర్యాప్తులో భాగంగా బుధవారం ఓమ్ని మెడి ఉద్యోగి నాగరాజు ఇంట్లో రూ. 46 కోట్ల నకిలీ ఇండెంట్లు దొరకడంతో అధికారులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. దొరికిన నకీలి ఇండెట్లపై పలువురు ఈఎస్‌ఐ ఉద్యోగుల సంతకాలు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ప్రైవేటు వ్యక్తుల ఇళ్లతో పాటు పలు అధికారుల ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహించనున్నది. ఈ తనిఖీల అనంతరం శుక్రవారం నాడు మరికొంత మంది అరెస్టుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు.

బెయిల్‌ కోసం ప్రయత్నాలు:

ఇప్పటికే ఊచలు లెక్కిస్తున్న 8మందిలో ప్రధాన నిందితురాలు దేవికారాణి ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిల్‌ పొందాలని భావిస్తోంది. గురువారం రాత్రి హైకోర్టు సీనియర్‌ న్యాయవాదిని ఆమె బంధువులు కలిసినట్లు తెలిసింది. అయితే దేవికారాణి అరెస్టుకు ముందు ఏసీబి కూడా ఇది కొద్దిమంది ఉద్యోగుల ప్రమేయం అనుకుంది. అయితే ఈ అరెస్టుల ముందు వరకు ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ వరుస కథనాలను అందించింది.

ఓ రాజకీయ నాయకుడి హస్తం:

ఇంత పెద్ద మొత్తంలో కేవలం ఉద్యోగులు, ఏజెన్సీలు, ఏజెంట్లు మాత్రమే కాదు ఓ రాజకీయ వేత్త ఉన్నారు. పత్రికలలో రాకుండా ఓ ఎలక్ట్రానిక్‌ పాత్రికేయుడితో బేరసారాలు సాగించారని ఏసిబి గుర్తించింది. ఈసారి అరెస్టులలో ‘రికవరీ’ విషయం తోడైతే ఆ నాయకుడి బాగోతం బట్టబయలు అవుతుంది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close