Friday, April 19, 2024

టీ20ల్లో పాక్‌ కెప్టెన్‌ సంచలనం..

తప్పక చదవండి
  • విండీస్‌ లెజెండ్‌ సరసన బాబర్‌
    పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజాం అరుదైన ఫీట్‌ సాధించాడు. లంక ప్రీమియర్‌ లీగ్‌లో తొలి సెంచరీ కొట్టిన అతను టీ20ల్లో పదో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. దాంతో, పొట్టి క్రికెట్‌లో 10కి పైగా సెంచరీలు బాదిన వెస్టిండీస్‌ దిగ్గజం క్రిస్‌ గేల్‌ రికార్డు సమం చేశాడు. అయితే.. ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీల రికార్డు మాత్రం గేల్‌ పేరిటే ఉంది. కొలంబో స్ట్రయికర్స్‌ జట్టు తరఫున ఆడుతున్న బాబర్‌ సెంచరీతో కదం తొక్కాడు. ఈరోజు గాలే టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 59 బంతుల్లోనే 104 పరుగులు సాధించాడు. దాంతో, 183 పరుగుల లక్ష్య ఛేదనలో కొలంబో జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. పొట్టి ఫార్మాట్‌లో బాబర్‌కు గొప్ప రికార్డు ఉంది. ఈ స్టార్‌ ఆటగాడు 52 ఇన్నింగ్స్‌లోనే 2వేల పరుగులు కొట్టాడు. అంతేకాదు ఒక వరల్డ్‌ కప్‌లో నాలుగు హాఫ్‌ సెంచరీలు, 303 పరుగులతో మరో రికార్డు నెలకొల్పాడు. నిరుడు బాబర్‌ సారథ్యంలోని పాక్‌ ఫైనల్‌ చేరింది. అయితే.. ఇంగ్లండ్‌ జట్టు చేతిలో అనూహ్యంగా 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
    ఐదో స్థానంలో కోహ్లీ.. ప్రస్తుతం పొట్టి ఫార్మాట్‌లో ఎక్కువ శతకాలు కొట్టింది ఎవరో తెలుసా..? విండీస్‌ విధ్వంసక ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌. అతను 22 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ 10 సెంచరీతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్‌ మైకేల్‌ క్లింగర్‌ డాషింగ్‌ డేవిడ్‌ వార్నర్‌ 8 శతకాలతో మూడో స్థానంలో ఉన్నారు. టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లీ 8 సెంచరీలతో ఐదో స్థానంలో నిలిచాడు.
    టెస్టుల్లో దంచేశాడు.. అయినా వన్డేల్లో పక్కన పెట్టేశారు..
    మూడో టీ20లో హార్దిక్‌కు అవసరమయ్యాడు?
    వెస్టిండీస్‌తో వరుసగా రెండు టీ20ఐ మ్యాచ్‌ల్లో ఓడిన టీమిండియా.. మూడో మ్యాచ్‌కు ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈక్రమంలో మూడవ టీ20ఐ మ్యాచ్‌లో టీమిండియా తన అతిపెద్ద మ్యాచ్‌ విన్నర్‌ను జట్టులోకి చేర్చేందుకు రెడీ అయింది. ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 ఇంటర్నేషనల్‌ సిరీస్‌లో టీమిండియా 0-2తో చేజార్చుకుంది. ఆదివారం భారత్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో వెస్టిం డీస్‌ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తర్వాతి మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోతే సిరీస్‌ చేజా రిపోయే అవకాశం ఉంది. టీమిండియా పరువు కాపాడేందుకు మూడో టీ20లోకి ఎంట్రీ.. టీమిం డియా పరువు కాపాడేందుకు, మూడో టీ20 ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లో ప్రమాదకరమైన ఆటగాడు ప్లేయింగ్‌ శIలోకి ప్రవేశించవచ్చని తెలుస్తోంది. ఈ ఆటగాడు ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పేస్తుంటాడు. వెస్టిండీస్‌తో జరిగే మూడో టీ20 ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లో ఓపెనర్‌గా తుఫాన్‌ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. ఆ ప్లేయర్‌ ఎవరో కాదు.. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌. టీమ్‌ ఇండియా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా ప్లేయింగ్‌ ఎలెవన్‌లో అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ ఇషాన్‌ కిషన్‌ ఓపెనింగ్‌ నుంచి నంబర్‌-4కి మారవచ్చని తెలుస్తోంది. ఇది కాకుండా, సంజూ శాంసన్‌ లేదాసూర్యకుమార్‌ యాదవ్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌ నుంచి తొలగించవచ్చు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు