Friday, April 19, 2024

డ్ర‌గ్స్ కిల్లర్ రఘు తేజ అరెస్ట్ లో పొలిటికల్ గేమ్..

తప్పక చదవండి
  • డ్ర‌గ్స్ దందా అక్క‌డ నుంచే స్టార్ట్ అయ్యిందని పోలీసుల డౌట్..
  • ఎఫ్‌సీఐ కాల‌నీ రోడ్లు క‌బ్జా చేసి మరీ ఫుడ్ కోర్టు నిర్మాణం..
  • గతంలో కోర్టు అదేశాల‌తో కూల్చివేసిన జీహెచ్ఎంసీ సిబ్బంది..
  • అయినా సరే అక్కడే మకాం వేసిన డ్రగ్స్ మాఫియా..
  • పోజిష‌న్ కోసం లీజ‌ర్, లీజీ ఫైటింగ్..
  • ప్ర‌యివేట్ పిటిష‌న్ తో కేసు న‌మోదైనా పట్టింపులేదు..
  • రెండెక‌రాల భూమిని నెల‌కు 50 వేల‌కే లీజంటూ దొంగ‌ప‌త్రాలు.
  • కోర్టులో అప్పిల్ కి వెల్తూ కాలం గ‌డిపేస్తున్న లీజీ.
  • ఓ ఛాన‌ల్ ఎగ్జిక్యూటివ్ ఎడిట‌ర్ కి పెట్రోల్ పంపు లీజు..
  • డ్ర‌గ్స్ దందా ప్రసారం చేయని ఆ ఛాన‌ల్ త‌న‌కు లీజుకిచ్చిన వారిపై కథనాలు ప్రసారం..
  • లీజు గ‌డ‌వులు పెంచాలని, లేదంటే రూ. 10 కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్..
  • రోజుకో మలుపు తిరుగుతున్న ఫుడ్ కోర్టు వ్యవహారంపై ఎటూ తేల్చని అధికార గణం..
  • గ‌ లీజు ప‌నుల‌కు అడ్డాగా గ‌చ్చిబౌలి డ్రైవ్ ఇన్ పై నిజ‌ నిర్ధారణ రిపోర్టు..

హైదరాబాద్ : ఇన్ఫినిటీ ఫుడ్ కోర్టు.. ఇది ఇప్పుడు ఇల్లీగ‌ల్స్ దందాకు అడ్డాగా మారింది. ఎవరినైనా క్షణాల్లో బుట్ట‌లో వేసేకునే డ్ర‌గ్స్ కేసు నిందుతుడు వెల‌గ‌పూడి ర‌ఘు తేజ.. మాతృక అనే కంపెనీ పేరుతో మ‌చ్చిక చేసుకుని.. దొంగ ప‌త్రాల‌తో, ఫోర్జరీ సంత‌కాల‌తో రెండున్న‌ర ఎక‌రాల భూమిని నెల‌కు రూ. 50 వేల‌కు లీజుకు తీసుకున్న‌ట్లు ఒప్పంద ప‌త్రాలు సిద్ధం చేశారు.. రెండేళ్ల పాటు నెల‌కు రూ. 2 కోట్ల లాభాల‌తో.. అక్రమంగా పెద్దఎత్తున సంపాదించిన ర‌ఘు తేజ, అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి త‌న‌కు బాగా కావలసిన వారు అంటూ కొందరు పోలీసుల‌ను, కొన్ని మీడియా మిత్రులను మ‌చ్చిక చేసుకున్నాడు.. పైగా కొందరు పోలీస్ అధికారులు తనవాళ్లంటూ.. త‌నపై న‌మోదైన కేసును ఒక్క అడుగు ముందుకు వెళ్లకుండా అడ్డుకో గ‌లిగాడు.

ఇన్పినిటీ ఫుడ్ కోర్టు అండ్ డ్రైవ్ ఇన్ పేరుతో ద‌ర్జాగా క‌బ్జాలు :
డిసెంబర్ 2020నాటికి 50 వేల రూపాయల ఉద్యోగం చేస్తున్న ర‌ఘు తేజ‌. సంధ్య క‌న్వెన్ష‌న్ ఓన‌ర్ వ‌ద్ద బిజినెస్ చేసుకుంటాన‌ని కాళ్లావేళ్లా పడి.. గ‌చ్చిబౌలిలోని ఎఫ్.సి.ఎల్. కాల‌నీలోని 7 వేల గ‌జాల భూమిని లీజుకు ఇవ్వాల‌ని ప్రాధేయ పడ్డాడు.. న‌మ్మిన వ్య‌క్తి కావ‌డంతో ఒప్పందప‌త్రాలు అన్నీ కూడా అత‌నే త‌యారు చేసుకున్నారు. కాగా వ్యాపారంలో వచ్చిన లాభాల్లో 50 శాతం ల్యాండ్ యజమానికి ఇచ్చేట్లుగా ఒప్పొందం చేసుకున్నాడు.. కానీ అగ్రిమెంట్ లోని మ‌ధ్య‌లో వున్న కొన్ని పేజీలు తీసివేసి కేవలం నెలకు రూ. 50 వేలు మాత్ర‌మే లీజు అంటూ త‌ప్పుడు సంత‌కాల‌తో అగ్రిమెంట్ తో ఎంట్రీ అయ్యారు. ఫుడ్ కోర్టు భారీగా లాభాలు వ‌స్తుండ‌టం.. య‌జ‌మానికి మాత్రం 50 వేలే ఇస్తుండ‌టంతో అనుమానం వ‌చ్చి.. ఓనర్ ఒప్పంద ప‌త్రాలు చూశారు. ఆ వెంట‌నే కేసు వేసి లీజీ మోసం చేశార‌ని కోర్టుకు వెళ్లారు. ఫేక్ అగ్రిమెంట్ ని 2021 జ‌న‌వ‌రి 15న త‌యారు చేసుకున్నాడు రఘు తేజ.. రోడ్ల‌ను క‌బ్జా చేసి 53 నుంచి 64 ప్లాట్స్ ని కూడా నిర్మించారు. సోసైటీ భూమిలో రోజు రోజుకు అక్రమ కార్యక్రమాలు శృతి మించుతుండటంతో స్థానికులైన ఎఫ్.సి.ఐ. కాలనీ వాసులు జీహెచ్ఎంసీ అధికారుల‌కు పిర్యాదు చేశారు..

- Advertisement -

కోర్టులో తెలిపోయిన వ్య‌వ‌హారం :
కాగా ప‌ర్మిష‌న్ ఒక నెంబ‌ర్ తో ఇల్లీగ‌ల్ గా టెంప‌ర‌రీ స్ట్రక్చర్ అంటూ ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణం చేశారు.. మాతృక హోట‌ల్స్ ప్ర‌యివేట్ లిమిటెడ్.. యజమాని వెల‌గ‌పూడి ర‌ఘు తేజ‌, ఆయ‌న తండ్రి శ్రీనివాస్ రావు వీరిద్దరిపై జీహెచ్ఎంసీకి పిర్యాదులు అందాయి. టీఎస్-బీపాస్ చ‌ట్ట ప్ర‌కారం ద‌ర్యాప్తు చేసి నోటీసులు ఇవ్వ‌కుండానే కూల్చివేత‌లు ప్రారంభించారు. దీనిపై ర‌ఘు తేజ హైకోర్టును ఆశ్ర‌యించారు. రిట్ పిటిష‌న్ 24103 ఆఫ్ 2022. జూలై 16న ఉన్నత న్యాయస్థానం తీర్పు నిచ్చింది.. ఈ పిటిష‌న్ లో సంధ్య క‌న్సస్ట్ర‌క్ష‌న్ , ఎఫ్.సి.ఐ. కాల‌నీలో నివాసం ఉండే వారు ఇంప్లీడ్ అయ్యారు. హైకోర్టు స్ప‌ష్ట‌మైన అదేశాలు ఇస్తూ.. జీహెచ్ఎంసీకి అధికారాలు క‌ట్ట‌బెట్టింది. ముగ్గురి వాద‌న‌లు విన్న త‌ర్వాత‌.. 6 వారాల్లో నిర్ణ‌యం తీసుకోవాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ కి అదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ విచార‌ణ‌లో ఆ నిర్మాణాలు అక్ర‌మ క‌ట్ట‌డాలే అని తేలింది. దీంతో మ‌ళ్లీ స్టేట‌స్ కో అంటూ కూక‌ట్ ప‌ల్లి కోర్టును ఆశ్ర‌యించారు. ఓఎస్ నెంబ‌ర్ 850 ఆఫ్ 2022. సెప్టెంబ‌ర్ 19న స్టేట‌స్ కో మెయింటెన్స్ చేయాల‌ని కోర్టు అదేశించింది. ఐఏ 444 ఆఫ్ 2022 కేసులో స్టేట‌స్ కో సెప్టెంబ‌ర్ 26 వ‌ర‌కు మాత్ర‌మే ఉంద‌ని.. ఆ త‌ర్వాత కోన‌సాగించాల్సిన అవ‌స‌రం లేదని అప్పిల్ లో.. డిసెంబ‌ర్ 14న కోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ ఏడాది జ‌న‌వ‌రి 4న జీహెచ్ఎంసీ కోర్టు తీర్పుల‌కు అనుకూలంగా నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో కూల్చలేక పోతే, తామే కూల్చేస్తామ‌ని పేర్కొంది.. వారం రోజుల త‌ర్వాత జీహెచ్ఎంసీ కూల్చివేత‌లు ప్రారంభించింది.

లీజ్ దందాకు పోలీసులు అండ‌..! :

గ‌చ్చిబౌలిలోని ఇన్పినిటీ ఫుడ్ కోర్ట్ గ‌లీజ్ ప‌నుల‌కు అడ్డ‌గా మారింద‌ని ఎప్ప‌టి నుంచో కాల‌నీ వాసులు అవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అందుకు ర‌ఘు తేజ డ్ర‌గ్స్ తీసుకున్నార‌ని పోలీసులే స్ప‌ష్టంగా తెలిపారు. ఇప్పుడు నిందుతుడిగా చేర్చుతూ సీఆర్పీసీ 41 ఏ నోటీసులు ఇచ్చారు. అయితే ఈ ఫుడ్ కోర్టు లీజు వ్య‌వ‌హారంలో జ‌రిగిన ఫోర్జ‌రీ కేసులపై పోలీసుల‌కు పిర్యాదు చేశారు స్థలం యజమానులు.. కానీ పోలీసులు అవేమి ప‌ట్టించుకోలేదు. దీంతో లీజ్ డీడ్ లో ఫోర్జ‌రీ జ‌రిగింద‌ని కోర్టు గుర్తించి కేసు న‌మోదు చేయాల‌ని గ‌చ్చిబౌలి పోలీసుల‌ను కూక‌ట్ ప‌ల్లి కోర్టు అదేశించింది. ఇప్పటికీ ఆ కేసు ఎఫ్‌.ఐ.ఆర్. ద‌శ‌లోనే ఆగిపోయింది. ఎఫ్ఐఆర్ నెంబ‌ర్ 1030/2022 తేదీ : 12-09-2022. ఐపీసీ సెక్ష‌న్స్ 120బీ, 420, 441, 463, 464, 467, 471, రెడ్ విత్ 34 ఐపీసీ, 156(3) సీఆర్పీసీ సెక్ష‌న్స్ తో కేసు న‌మోదు చేశారు. కానీ ఇప్పటికీ ఇంకా ఎటూ తెల్చుకోలేక‌పోతున్నారు పోలీసులు. తాజాగా శుక్ర‌వారం రాత్రి స్థల యజమాని 100 మందితో వెళ్లి దాడి చేశార‌ని గ‌చ్చిబౌలిలో పిర్యాదులు అందాయి. వాటిపై ఎఫ్.ఐ.ఆర్. చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..

కాగా ఇన్ఫినిటీ ఈ ఫుడ్ కోర్టుకు సంబంధించి రోడ్స్ క‌బ్జాల పై జ‌న‌వ‌రి 30, 2023న హైకోర్టు స్ప‌ష్ట‌మైన ఆర్డ‌ర్ ఇచ్చినా.. పోలీసులు, అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.. చుట్టూ రేకులు పెట్టుకుని ఇంకా డ్ర‌గ్స్ దందా కొన‌సాగిస్తున్నార‌ని అనుమానంతో పోలీసులు త‌నిఖీలు చేశారు. ఆ ప్రాంతంలో గ‌లీజు ప‌నులు చేయ‌డం. ఫుడ్ కోర్టు ఖాళీ చేయాల్సి ఉన్నా.. కొందరు పోలీసుల స‌ఫోర్టుతో.. బౌన్స‌ర్స్ ని పెట్టుకుని అక్క‌డే తిష్ట వేయ‌డం ఇప్పుడు కలకలం రేపుతోంది..

డ్ర‌గ్స్ వార్త‌లు క‌నిపించ‌వు. ఈ స‌బ్బు సాంబ‌కు :
కొన్ని న్యూస్ ఛాన‌ల్స్ కొందరికి ప‌ర్స‌న‌ల్ ఏజెండాగా మారిపోయాయి. త‌న వారైతే.. ఎలాంటి ఇల్లీగల్ ప‌నులు చేసినా వారు ప్రసారం చేయరు.. ప‌క్క‌వారిని మాత్ర చీమ కుట్టినా.. ఎదో త‌ప్పు చేశారు కాబ‌ట్టే చీమ కుట్టింద‌ని చెబుతుంటారు.. అందుకు బెంగ‌ళూర్ హైకోర్టు లో త‌నపై వార్త‌లు వేయ‌వ‌ద్ద‌ని.. అక్క‌డ‌ ఇంజ‌క్ష‌న్ ఆర్డ‌ర్ ఉన్నా.. ఎదో క‌క్ష పూరితంగా వేస్తున్నారు. ఆ ఛాన‌ల్ ఎగ్జిక్యూటివ్ ఎడిట‌ర్ కి పెట్రోల్ బంక్ లీజుకు ఇచ్చారు. ఆ లీజు పొడిగించేందుకు ఓన‌ర్ ని బ్లాక్ మెయిల్ చేస్తూ.. రెండేళ్లుగా వార్త‌లు వడ్డిస్తూనే ఉన్నారు. లేదంటే రూ. 10 కోట్లు ఇవ్వాల్సిందే అంటూ బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారు. నిత్యం ఏపీ సి.ఎం. పై ప‌డి ఏడ్చే ఈ ఎడిట‌ర్ త‌న‌కు గిట్ట‌ని వారిపై ప‌దే ప‌దే వార్త‌లు ప్రసారం చేయడం వ‌ల‌న నిజ‌మ‌నే నమ్మే అవ‌కాశం ఉండేలా వ్య‌వ‌హారిస్తున్నారు. టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు త‌న‌కు ఇష్ట‌మైన విధంగా క‌బ్జాలు చేస్తూ.. బ్లాక్ మెయిల్ చేసి భారీగా సంపాదించార‌ని అరోప‌ణ‌లు ఉన్నాయి. ఏలాంటి వార్త‌కైనా సోప్ వేసి నున్న‌గా చేసే స‌బ్బు సాంబ‌కు ఎలాంటి బాధ్య‌త లేకుండా వ్య‌వ‌హారంచ‌డం ఎప్ప‌టి నుంచో అలవాటు.

అర్ధ‌రాత్రి హడావుడి :
ఇన్ఫినిటీ ఫుడ్ కోర్టు వ్య‌వ‌హారం.. డ్ర‌గ్స్ కేసుకు సంబందాలు ఉండ‌టంతో ఓన‌ర్ పోజిష‌న్ కోసం రంగంలోకి దిగాడు. ఇదే అదునుగా ర‌ఘు తేజ‌కు ఉన్న‌ అధికార బ‌లంతో అతనితో పోరాటం చేయ‌లేక.. అర్ధ‌రాత్రి వెళ్లి త‌న ల్యాండ్ ని పొజిష‌న్ తీసుకోవాల‌ని ప్ర‌య‌త్నించారు. జేసీబీల‌తో చ‌దును చేసేందుకు 50 మందితో వెళ్ల‌డం. అప్ప‌టికే అక్క‌డ లీజు తీసుకున్న ర‌ఘు తేజ మ‌నుషులు ఉండ‌టంతో గొడ‌వ మొద‌ల‌యింది. ధ్వంసం చేసిన వారిని ప‌ట్టుకుని ఎవరు పంపించారో చెప్పాల‌ని బెదిరింపులకు దిగారు.. లీజు దారుడికి సంబంధించిన వ్య‌క్తి శ్రీనివాస్ పిర్యాదు మేర‌కు.. సంధ్య శ్రీధ‌ర్ పై గ‌చ్చిబౌలి పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఇత‌రుల ఆస్తుల‌ను ధ్వంసం చేయ‌డం, వారిని చిత‌క‌బాద‌డంతో పాటు భ‌యాందోళ‌న‌కు గురిచేశార‌ని 448, 427, 324 ఐపీసీ సెక్ష‌న్స్ తో పాటు నేరం రుజువైతే 2 ఎండ్లు జైలు శిక్ష ప‌డే 506 సెక్ష‌న్స్ తో కేసు న‌మోదు అయింది. ఇన్ఫినిటీ ఫుడ్ కోర్టులో డ్ర‌గ్స్ దందా అంటూ వార్త‌లు రావ‌డం. ఒకరిపై పై ఒకరు కేసులు న‌మోదు చేసుకోవ‌డంపై పెను దుమారం రేగుతోంది.. చూడాలి కథ కంచికి చేరుతుందా లేదా..? అన్నది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు