Thursday, March 28, 2024

విద్యతోనే జీవితానికి వెలుగు

తప్పక చదవండి
  • కార్పొరేట్‌కు దీటుగా సర్కారు బడులు
  • మన ఊరు-మన బడితో స్కూళ్లకు కొత్తరూపు..
  • చివ్వెంల మండలం ఐలాపురం వద్ద కార్పొరేట్‌ విద్యాసంస్థలను తలపిస్తున్న గిరిజన గురుకుల రెసిడెన్షియల్‌..

సూర్యాపేట : కోట్లాది రూపాయలు వెచ్చించి విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య అందిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమె అన్నారు. శనివారం రాత్రి సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలంలో ఐలాపురం గ్రామం వద్ద 4.2 కోట్లతో నిర్మించిన టి టి డబ్ల్యూ ఆర్‌ జె సి బాలికల పాఠశాల మరియు కళాశాల లో ప్రారంభించారు.ముందుగా మంత్రిని విద్యార్థులు ఘనంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడిన మంత్రి ,అభివృద్ధి విద్యతోనే సాధ్యమని అందుకే కష్టపడి చదివి మంచి ర్యాంకులు సాధించి భవిష్యత్తు బంగారు బాటలు వేసుకోవాలని విద్యార్థులకు పిలుపు నిచ్చారు.ఏదైనా సమాజం లో వెనుక బాటు తనానికి విద్య లేక పోవడమే కారణమని ,అందుకే చిన్న చిన్న దేశాలు భారతదేశంపై దండెత్తి వందల సంవత్సరాలు ఆక్రమించుకుని పరిపాలించారని తెలిపారు.అందరూ చదువుకునేలా జ్యోతిరావు పూలే ,బిఆర్‌ అంబేద్కర్‌, సంత్‌ సేవలాల్‌ ప్రజలను విద్య వైపు మళ్ళించే విధంగా పోరాటం చేశారని వారి ఆశయాలకు అనుగుణంగానే రాష్ట్రంలో కెసిఆర్‌ పాలన సాగిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న గురుకుల పాఠశాలలన్నీ అన్ని జూనియర్‌ కళాశాలలుగా అప్‌ గ్రేడ్‌ చేసుకున్నామని మంత్రి పేర్కొన్నారు.ఆడపిల్లలు సౌకర్యాలు లేక తమ విద్యను మధ్యలోనే ఆపివేస్తున్నారని వారికి రెసిడెన్షియల్‌ కళాశాలలు ఏర్పాటు చేసి ప్రభుత్వం అధిక నిధులు వెచ్చించి ఆడపిల్లలు బాగా చదువుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి అన్నారు. బాగా చదువుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి కెసిఆర్‌ ఆశయాలను నెరవేర్చాలని విద్యార్థిలోకానికి పిలుపునిచ్చారు.ఈ కళాశాలకు కాంపౌండ్‌ వాల్‌ ,రోడ్డు నిర్మాణం, సోలార్‌ స్ట్రీట్‌ లైట్లు, ఏర్పాటు దానితో పాటుగా సీసీ కెమెరాల ఏర్పాటు కూడా చేయడానికి అన్ని నిధులు మంజూరు చేసినట్లు, త్వరలోనే పనులు ప్రారంభిస్తారని మంత్రి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సంజీవ్‌ నాయక్‌ ,గ్రామ సర్పంచ్‌ బి సునీత, కళాశాల ఆర్సి కే లక్ష్మయ్య, ప్రిన్సిపాల్‌ కి మంజుల,అరుణ, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు