ముగిసిన పంచాయతీ ప్రచారం

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. ఈనెల 30న జరగనున్న చివరి విడత ఎన్నికలకు ఎన్నికల యంత్రాంగం సమయాత్తమవుతోంది. మొత్తం 12,732 పంచాయతీల్లో ఇప్పటికే రెండు విడతలకు ఎన్నికలు పూర్తవగా.. మిగిలి ఉన్న 4,116 పంచాయతీలు మూడో విడత పోలింగ్కు సిద్ధమయ్యాయి. ఇందులో 573 గ్రామాల్లో సర్పంచి పదవులు ఏకగ్రీవం కాగా మిగిలి ఉన్న 3,529 గ్రామాల్లో 30న సర్పంచి ఎన్నిక జరగనుంది. మొత్తం 11,667 మంది అభ్యర్థులు సర్పంచి పదవికి బరిలో నిలిచారు. ఇక ఈ గ్రామాల పరిధిలో మొత్తం 36,729 వార్డు సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీకాగా.. 8,956 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలి ఉన్న 27,583 వార్డులకు గానూ 67,316 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నల్గొండ, నిజామాబాద్‌, మంచిర్యాల జిల్లాలలోని మూడు పంచాయతీల పరిధిలో నిలిచిపోయిన పలు వార్డులకు కూడా ఈ నెల 30న ఎన్నికలు నిర్వహించి.. అదే రోజున ఫలితాలు వెల్లడించనున్నారు. దీంతో ఆ గ్రామాల పరిధిలో నిలిచిపోయిన ఉపసర్పంచి ఎన్నికకు మార్గం సుగమమం కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here