ముగిసిన నామినేషన్ల పర్వం.. 5 స్థానాలు 6గురు పోటీ!

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామనేషన్ల పర్వం ముగిసింది. మొత్తం ఐదు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో ఎన్నికలు అనివార్యం కానున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ నుంచి మహమూద్‌ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, మల్లేశం బరిలోకి దిగగా.. టీఆర్‌ఎస్‌ మద్దతుతో మిత్రపక్షం ఎంఐఎం నుంచి మీర్జా రియజ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఇక, ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌ నుంచి గుడూరు నారాయణరెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఈ నెల 12న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ తన సంఖ్యాబలం ఆధారంగా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను అలవోకగా గెలుచుకునే అవకాశం ఉంది. టీడీపీ మద్దతుతో కాంగ్రెస్‌ పార్టీ కూడా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకునే అవకాశముంది. అయితే, పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఉండటంతో క్రాస్‌ ఓటింగ్‌ ద్వారా మొత్తం ఐదు స్థానాలు తామే గెలుచుకుంటామని టీఆర్‌ఎస్‌ ధీమాతో ఉంది. తమ అభ్యర్థిని గెలిపించుకోవాలంటే కాంగ్రెస్‌కు 21మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాగా ప్రస్తుతం వారి బలం19. దీంతో ప్రస్తుతం పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

పట్టభద్రుల ఎమ్మెల్సీగా జీవన్‌ రెడ్డి: పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయనున్న మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఆదిలాబాద్‌- కరీంనగర్‌- నిజామాబాద్‌- మెదక్‌ జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి ఆయన పోటీ చేయనున్న విషయం తెలిసిందే. నామినేషన్‌ వేసిన అనంతరం జీవన్‌రెడ్డి మాట్లాడుతూ… ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి క త్ఞతలు తెలిపారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ పథకాన్ని విస్మరించి విద్యార్థులకు అన్యాయం చేసిందని ఆరోపించారు. ప్రజా గొంతుక వినిపించేందుకే తాను మండలికి పోటీ చేస్తున్నానని వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here